Brahmamudi Serial Today Episode: రుద్రాణి తాను చేసిన తప్పు గురించి దుగ్గిరాల కుటుంబానికి తెలియకూడదని మినిస్టర్ ధర్మేంద్రను రిక్వెస్ట్‌ చేస్తుంటుంది. ధర్మేంద్ర మాత్రం రుద్రాణిని తిడుతుంటాడు. ఇంతలో మినిస్టర ఇంటికి అప్పు, కళ్యాణ్‌ వస్తారు. వాళ్లను చూసిన రుద్రాణి షాక్‌ అవుతుంది.

Continues below advertisement

రుద్రాణి: వాళ్లెందుకు వస్తున్నారు మీ దగ్గరకు..

దర్మేంద్ర:  వాళ్లు ఎందుకు వస్తున్నారో నాకు తెలియదు..

Continues below advertisement

రుద్రాణి: కానీ మీరు మాత్రం నా గురించి వాళ్లకు చెప్పకండి ఫ్లీజ్‌..

అని కంగారుగా గోడ చాటుకు వెళ్లిపోతుంది. గేటు దగ్గర సెక్యూరిటీ అప్పు, కళ్యాణ్‌లను ఆపేస్తుంది. ధర్మేంద్ర వాళ్లను పంపించండి అని చెప్పగానే అప్పు, కళ్యాణ్‌ లోపలికి వెళ్తారు.

ధర్మేంద్ర: ఎందుకొచ్చారు? ఇంకా మీకేం ఏం కావాలి..?

అప్పు: బిడ్డల మార్పు విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.. మీరొక మినిస్టర్ అయ్యుండి, బాధ్యత గల పదవిలో ఉండి ఇలా చేయొచ్చా..?

ధర్మేంద్ర: చూడండి అపూర్వ గారు.. నా వైపు తప్పు జరిగిందని మీ అక్కా బావకి క్షమాపణలు చెప్పాను.. ఇప్పుడు నా బిడ్డతో ఆనందంగా ఉన్నాను..

కళ్యాణ్‌: కానీ మాకు తెలియాల్సిన కొన్ని నిజాలు అలాగే ఉండిపోయాయి.

అప్పు: ఆపరేషన్ జరుగుతున్న మీ కూతురిని చంపితే మీ దగ్గరున్న మా ఇంటి పాప.. మీ దగ్గరే ఉండిపోతుందన్న ఆలోచనతో మీ పాపని చంపాలనుకున్న మీరు.. మళ్లీ అంతలోనే పాపని కాపాడుకోవాలని ఎందుకు అనుకున్నారు

ధర్మేంద్ర: నా తప్పు తెలుసుకున్నాను.. బిడ్డను చంపుకోవడానికి నా మనసు ఒప్పుకోలేదు. అందుకే సేవ్‌ చేయడానికి మళ్లీ హాస్పిటల్‌కు వచ్చాను.

అప్పు: మరి పరాయివాళ్ల బిడ్డను మార్చడానికి మీ మనసు ఎలా ఒప్పుకుంది?

ధర్మేంద్ర: నేను క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం..తర్వాత ఆలోచించాను.. నేరం అనిపించింది మనసు మార్చుకున్నాను. నా వల్ల తప్పు జరిగింది.. రాజ్, కావ్యల మంచితనం వల్ల అంతా మంచి జరిగింది

అప్పు: ఇప్పటికే మా ఫ్యామిలీలో ఎన్నో అనర్ధాలు జరిగాయి.. మా అక్క ఎన్నో కష్టాలు పడింది, పసిబిడ్డ కళ్లు తెరిచాక కూడా ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడాలని అనుకుంటున్నాము

ధర్మేంద్ర: నేను మనిషిని నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు..

అప్పు: మీ వల్ల రాదు అంటే.. ఇంకెవరి వల్ల అయినా వస్తుందా..? (ధర్మేంద్ర, రుద్రాణి షాక్‌ అవుతారు.)  మీకు డబ్బుంది పలుకుబడి ఉంది. మీరు అనుకుంటే పాపకి ఆపరేషన్ చేయించగలరు.. ఇంత అవకాశం ఉండి కూడా పరాయి వాళ్ల బిడ్డను మార్చాలన్నది మీ ఆలోచనేనా? మీకు ఎవరైనా సలహా ఇచ్చారా..?

ధర్మేంద్ర: చూడండి నాకు ఎవ్వరూ సలహా ఇవ్వలేదు.. ఇంతటి దుర్మార్గమైన ఆలోచన నాకే వచ్చింది

అప్పు: భార్యను ఇంత ప్రేమించే మీరు.. బిడ్డను కూడా అంతే ప్రేమిస్తారు.. అలాంటిది కడుపున పుట్టిన బిడ్డను చంపేంత ఆలోచన చేస్తారా..

ధర్మేంద్ర: కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తప్పవని అలాగే నేను ఆ తప్పుడు నిర్ణయం తీసుకున్నాను..

అప్పు:  అయితే పాపని చంపాలనుకున్నది, మళ్లీ మనసు మార్చుకుని కాపాడాలనుకున్నది మీరేనా..

ధర్మేంద్ర: నేనే అని చెప్తూనే ఉన్నాను కదా.. ఎన్నిసార్లు అడుగుతారు అదే ప్రశ్న

అంటూ మినిస్టర్‌ కొంచెం కసురుకోగానే.. సరే అంటూ కళ్యాణ్‌, అప్పులు బయటకు వెళ్తారు. కారు దగ్గరే నిలబడి ఏదో ఆలోచినస్తుంటారు. మరోవైపు లోపల దాచుకున్న రుద్రాణి, ధర్మేంద్ర దగ్గరకు వెళ్లి తన పేరు చెప్పనందుకు థాంక్స్‌ చెప్పి బయటకు వెళ్తుంది. అక్కడే కారులో ఉన్న కళ్యాణ్‌, అప్పులు రుద్రాణిని చూసి షాక్ అవుతారు. కారుతో రుద్రాణిని ఫాలో అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!