Brahmamudi Serial Today Episode: రాజ్, కావ్యతో కలసి అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోవడం రుద్రాణి తెలుసుకుంటుంది. అటు కావ్య కూడా బుక్ తీసుకుని ఇంగ్లీష్ నేర్చుకోవడం చూస్తుంది. దీంతో వీళ్లిద్దరూ ఆస్తిని మొత్తం డాలర్ల రూపంలోకి మార్చుకుని విదేశాలకు చెక్కేయాలనుకుంటున్నారు అనుకుంటుంది. డౌటుగా కావ్య దగ్గరకు వెళ్తుంది.
రుద్రాణి: ఈ టెన్షెస్ చదవడం చాలు కానీ నాకో డౌటు ఉంది క్లారిటీ ఇస్తావా.. అసలు నువ్వేం చేస్తున్నావు.. ..
కావ్య: మీటింగ్ లలో మాట్లాడాలి అంటే ఇగ్లీష్ రావాలి కదా..?
రుద్రాణి: ఈ బుక్ చదివి ఇంగ్లీష్ నేర్చుకుంటావా
కావ్య: ఈ బుక్కులో ఎన్నో కొత్త విషయాలు ఉన్నాయి.
రుద్రాణి: కన్ఫం రూపాయలలో ఉన్న ఆస్థిని డాలర్లలోకి మార్చి విదేశాలకు చెక్కేస్తున్నారు
అని రుద్రాణి మనసులో అనుకుంటూ అక్కడి నుంచి పరుగున ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్తుంది.
రుద్రాణి: ధాన్యలక్ష్మీ నువ్వు ఇక్కడు ఉన్నావా..? నీకో ముఖ్యమైన విషయం చెప్పలి..
ధాన్యలక్ష్మీ: ఈ ఇంట్లో చీమ చిటుక్కుమన్నా నువ్వు దాన్ని ముఖ్యమైన విషయంగానే చెప్తావు కదా..?
రుద్రాణి: ఈ చిన్నచూపే వద్దన్నది
ధాన్యలక్ష్మీ: ఇందులో చిన్నచూపు ఏముంది. ఇంతకీ ఏం మోసుకొచ్చావో చెప్పు.
రుద్రాణి: మోసుకురాలేదు. నువ్వు షాక్ అయ్యే వార్తను నా చెవులారా విని.. కళ్లారా చూసి చేతులారా తీసుకొచ్చాను
ధాన్యలక్ష్మీ: ఏం విషయం అది
రుద్రాణి: ఇన్నాళ్లు రాజ్, కావ్య ఈ ఆస్థిని ఏం చేస్తున్నారో అన్న సందేహంతో ఉన్నాం కదా.. దానికి ఈరోజు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఆస్థిని మొత్తం కరిగించేసి డాలర్ల రూపంలోకి మార్చేశారు
అంటూ మొత్తం చెప్తుంది రుద్రాణి..
ధాన్యలక్ష్మీ: వాళ్లు ఏం మాట్లాడుకున్నా..? నువ్వు అర్థం చేసుకున్నదే మోసుకొచ్చి నాకు చెప్తావు. నన్ను బకరాను చేస్తావు. నన్ను ఎక్కువగా రెచ్చగొట్టే పనులు చేయకుండా వేరే పనులు ఉంటే చేసుకో
అని ధాన్యలక్ష్మీ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడానికి సతీష్ ఫోన్ చేస్తాడు. ఎక్కడికి రావాలని రాజ్‌ను అడుగుతాడు. ఇంటికి రమ్మని రాజ్ చెప్తాడు. మనం ఇంట్లో ఉండము కదా డాక్యుమెంట్స్ ఎవరిస్తారు అని కావ్య అడుగుతుంది. స్వప్నకు ఇచ్చి వెళ్దాం తను ఇస్తుంది అని రాజ్ చెప్తాడు. సరేనని ఆఫీసుకు వెళ్తూ కావ్య, స్వప్నకు డాక్యుమెంట్స్ ఇస్తుంది. మరోవైపు పాట రాసుకుని కళ్యాణ్ రైటర్ దగ్గరకు వెళ్తాడు. సాంగ్ చూసిన రైటర్ కళ్యాణ్‌ను మెచ్చుకుంటాడు. సాంగ్ బాగుందని చెప్తుంటాడు. ఇంతలో మ్యూజిక్ డైరెక్టర్ వస్తాడు. రైటర్ కళ్యాణ్ రాసిన సాంగ్ అతనికి ఇస్తాడు.
మ్యూజిక్ డైరెక్టర్: సాంగ్ బాగుంది సార్ .. ఇది మీరు రాసిందేనా..? ఎందుకంటే మీ శైలికి భిన్నంగా ఉంది.
రైటర్: నేనే రాశాను యూత్ కోసం నా స్టైల్ మార్చాను
మ్యూజిక్ డైరెక్టర్: సార్ అంతా బాగుంది కానీ ఇందులో ఎద లోతుల్లో అనే పదాన్ని మారిస్తే ఎలా ఉంటుంది.
రైటర్: అది అలాగే ఉండాలి సార్.. లేదంటే అర్థమే మారిపోతుంది.
మ్యూజిక్ డైరెక్టర్: సార్ ఇక నేను వెళ్తాను..
అని చెప్పగానే సరే అంటూ రైటర్ ఇంట్లోకి వెళ్లిపోతాడు. కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరకు వెళ్లి సార్ మీరు చెప్పింది నిజమే అక్కడ ఎద లోతుల్లో కాకుండా హృదయపు లోతుల్లో అటే బాగుంటుంది అని చెప్తాడు. ఈ సాంగ్ కూడా బాగా రాశావు. ఇది నువ్వు రాసిందే అని నాకు తెలుసు. త్వరలోనే మనం కలిసి పని చేద్దాం అని చెప్పి వెళ్లిపోతాడు మ్యూజిక్ డైరెక్టర్. మరోవైపు ఆఫీసుకు వెళ్తున్న రాజ్‌కు ఎస్సై ఫోన్ చేసి ఆ మర్డర్ చేసిన వాడు వాడిన బైక్ నెంబర్ ఫేక్ ఇక వాడిని పట్టుకోవడం కొంచెం కష్టమే అని చెప్తాడు. ఇంతటితో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!