Brahmamudi Serial Today Episode: రాజ్ చేత స్మగుల్ గోల్డ్ బిజినెస్ చేయించాలని శాండిని రాజ్ ఆఫీసుకు పంపిస్తాడు రాహుల్. అయితే రాజ్ కోపంగా శాండీని తిడతాడు.
రాజ్: నేను ఎప్పుడూ లాభాల కోసం బిజినెస్ చేయలేదురా..? జనం కంపెనీ మీద పెంచుకున్న అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి బిజినెస్ చేశాను. అలాంటిది నా కంపెనీకే వచ్చి నా ముందుకే వచ్చి స్మగుల్ గోల్డ్ కొనమనడానికి ఎంత ధైర్యంరా నీకు ఇంకొక సెకండ్ ఇక్కడు ఉన్నావంటే నెక్ట్స్ సెకన్ జైళ్లో ఉంటావు..
శాండీ: సార్ ఇదే మీ ఆఖరి నిర్ణయమా..?
రాజ్: ముందు బయటికి పోరా
అంటూ తిట్టి శాండీని ఆఫీసులోంచి బయటకు వెళ్లగొడతాడు రాజ్. మరోవైపు రూంలో రెడీ అవుతున్న రాహుల్ దగ్గరకు పాపను తీసుకుని స్వప్న వచ్చి ఏం చేస్తున్నావు రాహుల్ అని అడుగుతుంది.
రాహుల్: కనిపించడం లేదా రెడీ అవుతున్నాను
స్పప్న: ఏంటి రాహుల్ ఏం మాట్లాడుతున్నావు
రాహుల్: అదే స్వప్న రెడీ అవుతున్నాను
స్వప్న: నువ్వు ఆఫీసుకు వెళ్తున్నావా..? రాహుల్
రాహుల్: లేదు ఎందుకు అలా అడుగుతున్నావు
స్వప్న: ఏం లేదు పాపను కాస్త రెడీ చేయ్ నేను ఇప్పుడే వస్తాను
అంటూ పాపను రాహుల్‌కు ఇచ్చి వెళ్లిపోతుంది స్వప్న. పాప ఏడుస్తుంది.
రాహుల్: ఏంటే ఇప్పుడు నేను నిన్ను రెడీ చేయాలా..? మంచివాడిగా ఉండటం కన్నా నటించడం చాలా కష్టం
ఇంతలో శాండీ ఫోన్ చేస్తాడు.
రాహుల్: హలో శాండీ ఏమైంది
శాండీ: రాహుల్ నువ్వు చెప్పినట్టే రాజ్ దగ్గరకు వెళ్లాను. ప్రపోజల్ పెట్టాను
రాహుల్: మరి ఏమన్నాడు రాజ్
శాండీ: ఏమంటాడు తిట్టిన తిట్టు తిట్టకుండా రిజెక్ట్ చేశాడు.
రాహుల్: ఎక్స్‌ఫెక్ట్ చేసిందే కదా శుభం
శాండీ: అన్ని తెలిసి కూడా నన్ను ఎందుకు రాజ్ దగ్గరకు పంపించావు
రాహుల్: నేను నీ దగ్గర దొంగ బంగారం కొనాలి కదా..? నేను నీకు కోటి రూపాయల బిజినెస్ ఇవ్వాలి కదా శాండి
శాండీ: బిజినెస్ ఇస్తున్నావు.. బాగుంది. కానీ ఇలా ఎందుకు రాజ్ దగ్గరకు పంపించడం
రాహుల్: ఇలా అడిగావు బాగుంది. స్మగుల్ గోల్డ్ కొనమని నువ్వు రాజ్ దగ్గరకు వెళ్లావు.. అదంతా సీసీటీవీలో రికార్డు అయింది. అది నాకు కావాలి. టైం వచ్చినప్పుడు నువ్వు రాజ్‌కు బంగారం అమ్మినట్టుగా సాక్ష్యం చెప్పాలి
శాండీ: నేను నాలుగు రోజులు జైళ్లో రెస్ట్ తీసుకోవాలి అంతేగా
రాహుల్: నిన్ను బయటకు తీసుకురావడానికి నేను ఉన్నాను కదా శాండీ
శాండీ: ఇంత బిజినెస్ ఇస్తున్నావు.. నీ కోసం ఆ మాత్రం చేయలేనా..? అయిన ఇది మనకు కామనే కదా రాహుల్
రాహుల్: ఓకే శాండీ
అంటూ కాల్ కట్ చేసి తిరిగి చూస్తే పక్కనే స్వప్న కోపంగా చూస్తూ ఉంటుంది. నిజం తెలిసిందా అని రాహుల్ భయపడుతూ.. ఏంటి స్వప్న అలా చూస్తున్నావు అని అడుగుతాడు. పాపను రెడీ చేయమన్నాను.. కానీ ఇంకా చేయలేదు అంటుంది దీంతో రాహుల్ హమ్మయ్య అనుకుంటాడు. మరోవైపు అపర్ణ, కావ్య, ఇందిరాదేవి గుడికి వెళ్లి పంతులును కలిసి జరిగిన విషయం చెప్తారు.
పంతులు: శాస్త్రంలో పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. కానీ అమ్మాయి ఇప్పుడు గర్భిణీ తన చేతుల మీదుగా ఏ పరిహారం చేసే వీలులేదు
ఇందిరాదేవి: మరి ఎలా పంతులు గారు సమస్య ఉందని తెలిసి ఇలా మౌనంగా భరించాల్సిందేనా..?
అపర్ణ: ఏ పరిహారం చేయకుండా పరిస్థితులను తట్టుకునేది ఎలా పంతులు గారు
పంతులు: హోమాలు, యాగాలు సాధ్యం కాదు కానీ ప్రతి నిత్యం ఇంట్లో దేవుడికి దీపాలు వెలిగించండి.. ఈ కుంకుమ పెట్టుకోండి.. ప్రతినిత్యం స్వామివారి అష్టోత్తరం పారాయణ చేయండి.. అంతా దైవేశ్చ
అని పంతులు చెప్పగానే వాళ్లు సరే అంటూ వెళ్లిపోతారు. తర్వాత రుద్రాణి కూతురు రేఖ ఎంట్రీ ఇస్తుంది. కూతురును ఎందుకొచ్చావని రుద్రాణి తిడుతుంది. అయినా వినకుండా ఇంట్లోకి వెళ్లిపోతుంది. రేఖ వచ్చిందని స్వప్న వెళ్లి రాహుల్‌కు చెప్తుంది. రాహుల్ కిందకు వచ్చి రేఖను తిడతాడు. అందరూ రేఖను సమర్థిస్తారు. ఇంతలో ఆఫీసు నుంచి వచ్చిన రాజ్ కు ఇక నుంచి కావ్య ఆఫీసుకు రాదని గుడిలో పంతులు చెప్పింది చెప్తారు. అయితే తాను కూడా ఆఫీసుకు వెళ్లనని చెప్తాడు రాహుల్. అపర్ణ, ధాన్యలక్ష్మీ ఇద్దరూ కలిసి సుభాష్, ప్రకాష్ లను ఆఫీసుకు వెళ్లమని చెప్తారు. తర్వాత రుద్రాణి, రేఖను బయటకు తీసుకెళ్లి తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!