Brahmamudi Serial Today Episode: అప్పు హాల్లో కూర్చుని బాధపడుతుంటే అందరూ ఓదారుస్తుంటారు. ఇంతలో అక్కడికి ధాన్యలక్ష్మీ వస్తుంది. ధాన్యలక్ష్మీని అందరూ కోపంగా శత్రువులా చూస్తుంటారు. దీంతో ధాన్యలక్ష్మీ షాక్‌ అవుతుంది.

Continues below advertisement

ధాన్యలక్ష్మీ: అందరూ కూడబలుక్కున్నట్టు ఎందుకు అలా చూస్తున్నారు.. మీరేం నన్ను శత్రువులా చూడనక్కర్లేదు.. నా కోడలితో నేను ఒక విషయం మాట్లాడాలి

ఇందిరాదేవి: అంటే మమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మంటావా..? నీ కోడలితో అంత రహస్యం ఏముంది మాట్లాడటానికి

Continues below advertisement

ధాన్యలక్ష్మీ: అంత లేదు.. మీరు ఎవ్వరూ వెళ్లాల్సిన అవసరం లేదు. నా కోడలితో నేను మాట్లాడే విషయం మీరందరూ వినాలి

ప్రకాష్‌: ఇంకా ఏం చెప్పాలో ఇంకా ఏముంది చెప్పడానికి కోడలిని ఉద్యోగం వద్దన్నావు.. ఇంట్లోనే ఉండాలి అన్నావు. నీ మాట నెగ్గించుకున్నావు.. అది చాలదా..?

ధాన్యలక్ష్మీ: అది కాదు నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే..

అప్పు: నన్ను క్షమించండి అత్తయ్యా నా వైపు తప్పు జరిగింది. నాకు మీకన్నా మీ మాట కన్నా ఏది ముఖ్యం కాదు

ధాన్యలక్ష్మీ: నీ మనసు తెలిసిన దాన్ని.. ఆ మనసు ఏం ఆలోచిస్తుందో.. దేని కోసం పరితపిస్తుందో నాకు తెలియదా..?

అప్పు: చెప్తున్నాను కదా అత్తయ్యా నాకు అన్నింటికన్నా.. మీ మాటే ముఖ్యం

ధాన్యలక్ష్మీ: నాకు తెలుసు నీకు నా మాటే ముఖ్యం అని కానీ వాటితో పాటు నువ్వు నమ్మిన వృత్తి నువ్వు ఇష్టపడిన ఉద్యోగం కూడా నీకు ఎంత ఇష్టమో నాకు అర్తం అయింది. నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. నిన్ను బాధపెట్టి నేనేం సాధిస్తాను. నీకు ఇష్టమైన ఉద్యోగం మాన్పించి నేను ఏం కూడబెట్టుకుంటాను. ఎంత పట్టుదల లేకపోతే అంతటి కేసును చేధిస్తావు.. ఎంత నిజాయితీ లేకపోతే ఆ బిడ్డను తల్లికి చేరుస్తావు చెప్పు.. ఆ తల్లి వచ్చి నీ గొప్పదనం గురించి చెప్తుంటే.. నీకే కాదు నువ్వు నా కోడలివి అయినందుకు నేను గర్వపడ్డాను.. వృత్తి పట్ల అంత బాధ్యత ఉన్న నీ కాళ్లకు నేనెందుకు సంకెళ్లు వేయాలి. నేనెందుకు నీ గౌరవాన్ని తగ్గించాలి. అందుకే నువ్వు ఉద్యోగం మానేయక్కర్లేదు. నువ్వు అనుకున్నది చేయ్‌ నీ ఇష్ట ప్రకారమే ఉండు కానీ..

ప్రకాష్‌: ఆ కానీ అన్నావా..? మళ్లీ ఏదో మెలిక పెడతావు.. ఏంటో చెప్పు..

ధాన్యలక్ష్మీ: అదేం కాదు నా కొడలు డెలివరీ అయ్యేదాకా ఇల్లు కదలకుండా ఉంటే నాకంతే చాలు

 అప్పు: థాంక్స్‌ అత్తయ్యా.. థాంక్యూ వెరీమచ్‌.. మీరు చెప్పినట్టే నాకు డెలివరీ అయ్యి బిడ్డను మీ చేతులో పెట్టేదాకా నేను ఎక్కడికి వెళ్లను

ధాన్యలక్ష్మీ: ఇప్పుడు నీకు ఆనందమే కదా

ప్రకాష్‌: మా ఆనందం గురించి తర్వాత కానీ ధాన్యం నువ్వేంటే ఇంతటి శుభవార్త కూడా ఇంత సీరియస్‌గా రివీల్‌ చేశావు

ఇందిరాదేవి: మామూలుగా కాదురా బాంబు పేల్చినట్టే చెప్పింది

కళ్యాన్‌: ఏదో ఒకటి నాన్నమ్మ మా అమ్మ ఒప్పుకుంది. ఐయామ్‌ ఫుల్‌ హ్యాపీ

ప్రకాష్‌: అమ్మ అప్పు మీ అత్తయ్య గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక నీ ఇష్టం వచ్చినట్టు డ్యూటీ చేయ్‌

అప్పు: లేదు మామయ్య అత్తయ్య నా ఆశలను గుర్తించారు. నేను అత్తయ్య మాటకు గౌరవం ఇవ్వాలి.. ఇస్తాను కూడా.. డెలివరీ అయ్యేంత వరకు డ్యూటీ చేయను..

అపర్ణ: చూశారా అత్తయ్యా కోడలి మాటను అత్త కాదనలేదు.. అత్త మాటను కోడలి కాదనదట ఇక మనమేనా పరాయి వాళ్లం

కావ్య: అత్తయ్య గారు మన ఇంట్లో పరాయి వాళ్లు ఎవ్వరూ ఉండరు.. అందరూ చిన్నత్తయ్యకు భయపడేవాళ్లే..

ప్రకాష్‌:  అమ్మా కావ్య నేను దాని మొగుణ్ని అమ్మా నేను భయపడను..

(ధాన్యలక్ష్మీ కోపంగా చూస్తుంది.) జోక్‌ చేశాను.. ధాన్యం జోక్‌ చేశాను అంతే 

అనగానే అందరూ నవ్వుకుంటారు. ఇక రాహుల్ తన కంపెనీలో నష్టాలు వస్తున్నాయని రాజ్‌ కంటే ముందే వాళ్ల డిజైన్స్‌ మార్కెట్‌లోకి వెళ్లాలి అని చెప్తాడు. మేనేజర్ సరే అంటాడు. తర్వాత కాలం గడిచిపోతుంది. కావ్య, అప్పులకు నెలలు నిండుతాయి. అందరూ హ్యాపీగా ఉన్న టైంలో రాజ్‌ కంపెనీకి విపరీతమైన లాభాలు వస్తాయి. రాహుల్ మాత్రం నష్టాలు చూస్తుంటాడు. ఇంట్లో అందరూ రాజ్‌ను చూసి నేర్చుకోమని చెప్తారు. దీంతో రుద్రాణి ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!