Brahmamudi Serial Today Episode: కావ్య ప్రపోజల్‌కు బ్యాంకు వాళ్లు సరే అంటారు. ఇన్‌స్టాల్ మెంట్ ఎలా కడతారో చెప్పండి అని అడుగుతారు. దీంతో కావ్య ఐదు ఇన్‌స్టాల్ మెంట్లలో కడతామని మొదటిది ఈరోజే 20 కోట్లు చెల్లిస్తామని అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేయమని చెప్తుంది. దీంతో బ్యాంకు వాళ్లు సరేనని వెళ్లిపోతారు.
కావ్య: ఎంటలా చూస్తున్నారు..?
రాజ్: చాలా బాగా మాట్లాడావు. చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడావు. గుడ్ జాబ్, కీపిటప్
శృతి: ఏంటి మేడం రాబోయే 24 గంటల్లో ఏవైనా తుఫాను వస్తుందా..? అసలు రాజ్ సార్ ఏంటి ఇంతలా మారిపోయారు. మీరేదే మ్యాజిక్ చేశారు మేడం.
అంటూ శృతి అడగ్గానే సరే కానీ పని చూసుకో శృతి అంటుంది కావ్య. మరోవైపు ధాన్యలక్ష్మీ కాఫీ చేసుకుంటుంటే రుద్రాణి వస్తుంది.
రుద్రాణి: తాపీగా కాపీ చేసుకుంటున్నావా..? ధాన్యలక్ష్మీ.. పనిలో పనిగా టీ కూడా బాగా చేయడం నేర్చుకో ఎందుకంటే రేపోమాపో బయటకు వెళ్లి టీ కొట్టు పెట్టుకోవాలి కదా..?
ధాన్యలక్ష్మీ: రుద్రాణి మతిపోయిందా నీకు.. నేనేంటి టీ, కాఫీలు అమ్ముకోవడం ఏంటి..? ఏం మాట్లాడుతున్నావు నువ్వు
రుద్రాణి: నీకు ఇంకా అర్థం కాలేదా… అక్కడ రాజ్ ఇంట్లోనే కాదు ఆఫీసులో కూడా అడుగుపెట్టనివ్వను అని చాణక్య శపథం చేశాడు. ఇప్పుడు ఏమైంది. ఇంట్లోనే కాదు ఆఫీసుకు కూడా కావ్యను తీసుకుని వెళ్లాడు. నువ్వు ఇలాగే కళ్లు మూసుకుని ఉంటే ఆ కావ్యను ఈ ప్యాలెస్‌కు రాణిని చేస్తాడు.
అంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మీని మళ్లీ రెచ్చగొడుతుంది. ఆఫీసులో రాజ్ హ్యాపీగా ఉంటాడు. ఎదురుగా కావ్య కూర్చుని ఉంటుంది.
రాజ్: ఫస్ట్ టైం నా క్యాబిన్‌లోకి థర్డ్ పర్సన్ నా పర్మిషన్ లేకుండా వచ్చాడు. నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నాను. ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థం కాక తల పట్టుకున్నాను. నాకేం సంబంధ లేదు అంటే అవతల తాతయ్య మాట పోతుంది. ఎవరో ఒకరితో షేర్ చేసుకుంటే తప్పా నా బాధ తగ్గదు. అందుకే నీతో చెప్పాను. నేను ఆశించినట్టుగానే నువ్వు దీనికి సొల్యూషన్ చెప్పావు. నీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు.
కావ్య: మీరు నన్ను భార్యగా అంగీకరిస్తే నాకు థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఏదీ కాదు అసలు బయటి దానిలా బావిస్తే నాకు ఇంకా ఏదీ అవసరం లేదు.
రాజ్: మొత్తానికి బ్యాంకు సమస్య 20శాతం తగ్గిపోయింది. ఇంకా నెలా నెలా 4 నెలలు ఎలా కట్టాలి..?
కావ్య: ఏవండి ఒక్క నెల అని ఆలోచించకుండా 30 రోజులు అని ఆలోచిచండి పరిష్కారం మీకే దొరుకుతుంది.
అని కావ్య చెప్పగానే.. రాజ్ మేనేజర్‌ను పిలిచి ఈ రోజు నుంచి వర్క్ పాస్ట్ గా అవ్వాలి అని చెప్తాడు. స్వప్న ఫోన్ మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతుంటే రుద్రాణి, రాహల్ వచ్చి డబ్బులు కావాలని వచ్చి అడుగుతారు. స్వప్న ఇవ్వనని చెప్పగానే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మేము ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్తాము అని రుద్రాణి బెదిరిస్తుంది. స్వప్న డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంటే కావ్య వచ్చి ఆపుతుంది. ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నావు అక్కా అని అడుగుతుంది కావ్య. డబ్బులు ఇవ్వకపోతే ధాన్యలక్ష్మీకి చెప్తామని బెదిరించారు అని స్వప్న చెప్పగానే.. ఈ ఇంట్లో అందరికీ చెప్తున్నాను.
ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు ఇక నుంచి ఇంట్లోకి ఏం కావాలో నేను చూసుకుంటాను. డబ్బు అవసరం అయి ఎవరైనా అడిగితే తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చూపించాలి. కారులో పెట్రోల్ పోయించినా నాకు బిల్లు చూపించాలి అంటూ కావ్య ఆర్డర్ వేస్తుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మీ కోపంగా కావ్యను తిడతారు. ఎవరు ఏమనుకున్నా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా నాకు నిజంగా అనవసరం. ఈ రూల్స్‌ను స్టిక్ట్‌గా పాటించాలి ఇట్స్ మై ఆర్డర్ అంటుంది కావ్య. ఇక నుంచి నేను చెప్పిందే ఈ ఇంట్లో అమలవుతుంది. అర్థమైందా…? ఎనీ డౌట్స్ అని కావ్య అడగ్గానే ప్రకాష్ అబ్బే నో డౌట్స్ అంటాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!