Brahmamudi Serial Today Episode:  దుగ్గిరాల ఇంటికి వచ్చిన కనకాన్ని రుద్రాణి, ధాన్యలక్ష్మీ తమ మాటలతో ఇబ్బంది పెడతారు. దీంతో వారి తరపున అపూర్వ, ఇందిరాదేవి ఇద్దరూ కనకానికి సారీ చెప్తారు. మా ఇంటికి ఓదార్చడానికి వచ్చిన నిన్ను వాళ్లు అవమానించడం సిగ్గు చేటు అంటూ ఇందిరాదేవి ఏడుస్తూ బాధపడుతుంది. అందరూ ఇందిరాదేవిని ఓదారుస్తారు. మరోవైపు ఆఫీసులో రాజ్‌ మాట్లాడుతుంటాడు.


రాజ్‌: జగదీష్‌ గారి కాంట్రాక్ట్‌ కంప్లీట్ కాగానే మేనేజర్‌ను ఆయన దగ్గరకు వెళ్లి చెక్‌ కలెక్ట్‌ చేసుకోమని చెప్పు. ఆయన మా తాతగారి ఫ్రెండ్‌. ఆయన్ని ఆఫీసుకు పిలిపించవద్దు


ఇద్దరు వ్యక్తులు పర్మిషన్‌ లేకుండా రాజ్‌ చాంబర్‌లోకి వస్తారు.


రాజ్‌:  ఏయ్‌ ఎవరు మీరు లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్‌ తీసుకుని రావాలని తెలియదా..?


వ్యక్తి: సార్‌ మేము బ్యాంకు నుంచి వస్తున్నాము.. రాజ్‌ అంటే మీరేనా..?


వ్యక్తి 2: మీ తాతయ్యగారు మా బ్యాంకులో వంద కోట్లకు ష్యూరిటీ పెట్టారు


రాజ్‌: ఎవరో అనుకుని ఎవరి దగ్గరకు వచ్చారో తెలుసుకుని మాట్లాడండి.


వ్యక్తి: సీతారామయ్య అంటే మీ తాతయ్యే కదా..?


రాజ్‌: అవును మా తాతయ్యే..


వ్యక్తి: ఎంబీ కంపెనీ కి స్టార్ట్‌ చేసినప్పుడు మీ తాతగారు వంద కోట్లకు ష్యూరిటీ ఉన్నారు. ఇప్పుడు వంద కోట్లు కడతారా..? లేకపోతే మీ ఆస్థులు జప్తు చేయమంటారా..?


రాజ్‌: నాకు కొంచెం టైం కావాలి. మీరు ఇప్పుడు వచ్చి వంద కోట్లు అడిగితే ఎలా..?


వ్యక్తి: అలా అయితే ఈ పేపర్స్‌ మీద సంతకం చేయండి. అప్పుడు మీకు పది రోజుల టైం ఇస్తాడు. లేదంటే ఇప్పుడే మీ ఆస్తులు జప్తు చేస్తాము.


రాజ్‌ పీఏ: సార్‌ ఒక్క నిమిషం పక్కకు వస్తారా..?


అని పిలవగానే రాజ్‌ పక్కకు వెళ్తాడు. ఇప్పుడు మీ ఆస్థులు మొత్తం కావ్య మేడం పేరు మీద ఉన్నాయి. కాబట్టి ఆ ష్యూరిటీకీ మీకు ఏ సంబంధం లేదని చెప్పండి సార్‌ అని చెప్పగానే రాజ్‌  పీఏను తిడతాడు. అలా చేస్తే మా తాతయ్య పరువు పోతుందని బయటకు వచ్చి బ్యాంక వాళ్ల ఇచ్చిన పేపర్స్‌ మీద సైన్‌ చేస్తాడు.  మనవడు అంటే ఆస్థులనే కాదు తాతయ్యగారి విలువను కూడా కాపాడతారని ప్రూవ్‌ చేశారు. అంటూ బ్యాంకు వాళ్లు వెళ్లిపోతారు. పీఏ కూడా రాజ్‌ను మెచ్చుకుంటాడు. మీలాంటి వాళ్లను ఈరోజుల్లోనే నేను ఎక్కడూ చూడలేదంటాడు. దీంతో మీ మీద మరింత రెస్పెక్ట్‌ పెరిగింది అని చెప్తాడు. సుభాష్‌ లాప్‌టాప్ లో ఏదో వర్క్‌ చేసుకుంటుంటే రుద్రాణి వస్తుంది.


రుద్రాణి: అన్నయ్యా నేను ఎప్పుడూ మిమ్మల్ని ఆడపడుచు డబ్బులు ఇవ్వమని వేధించలేదు.


సుభాస్‌: ఇప్పుడు ఎంత కావాలి నీకు


రుద్రాణి: నువ్వు చాలా గ్రేట్‌ అన్నయ్యా భలే అర్థం చేసుకున్నావు. నాకు రెండు లక్షలు కావాలి అన్నయ్య.


సుభాష్: చూడు రుద్రాణి ఇప్పుడు నేను ఇంటి పెద్దనే కానీ డబ్బులు ఇచ్చే అధికారం నాకు లేదు. ఆ అధికారం కావ్యకే ఉంది.


రుద్రాణి: అంటే ఇప్పుడు నేను ఆ కావ్యను అడుక్కోవాలా..?


రాహుల్‌: మమ్మీకి నేను చెప్తాను మీరు వెళ్లండి మామయ్య.


రుద్రాణి: ఏంట్రా నువ్వు నాకు చెప్తావా..?  


రాహుల్‌:  ఆవేశం అనర్థాలకు దారి తీస్తుంది. వచ్చే డబ్బులు కూడా రాకుండా చేస్తుంది


రుద్రాణి: అందుకని చేతులు కట్టుకుని ఆ గుమ్మడి కాయ ముఖం దాని ముందు నిలబడి డబ్బులు కావాలి అని అడగమంటావా..?


రాహుల్‌:  అలా ఎలా నిన్ను అడగనిస్తాను మామ్‌.


అని రాహుల్‌ తను ఎలా కావ్యను డబ్బులు అడగాలో చెప్తాడు. దీంతో రుద్రాణి, రాహుల్‌ను మెచ్చుకుంటుంది. తర్వాత అక్కడి నుంచి గార్డెన్‌లో ఉన్న కావ్య దగ్గరకు వెళ్లి డబ్బులు అడుగుతుంది. ఎందుకని కావ్య అడగ్గానే ధాన్యలక్ష్మీ వచ్చి కావ్యను తిడుతుంది. దీంతో కావ్య రెండు లక్షలు తీసుకొచ్చి రుద్రాణికి ఇస్తుంది. ఇక వంద కోట్లు ఎలా కట్టాలా అని ఆలోచిస్తూ రాజ్‌ ఆఫీసు నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్లిపోతాడు. డ్రైవర్‌ వెనక కారు తీసుకుని పిలుస్తూ వస్తున్నా వినిపించుకోకుండా వెళ్లిపోతుంటాడు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!