Brahmamudi Serial Today Episode: టిఫిన్‌ చేస్తూ అందరూ జూనియర్‌ స్వరాజ్‌ తెలివిని మెచ్చుకుంటుంటే.. ఇందిరాదేవి వచ్చి వాడు ఈ ఇంటి బిడ్డే కదా ఆ మాత్రం తెలివి ఉండదా అంటుంది. ఆ మాటలకు అందరూ షాక్‌ అవుతారు. అంటే అత్తయ్యకు వాడు ఫ్రెండ్‌.. అత్తయ్యకు ఫ్రెండ్‌ అంటే ఈ ఇంటి వాడే కదా అని కావ్య కవర్‌ చేస్తుంది.   

Continues below advertisement


రుద్రాణి: అమ్మ ఎందుకు వాడు ఈ ఇంటి బిడ్డ అంది


ఇందిరాదేవి: ఏంటి రుద్రాణి టిఫిన్‌ ఏమైనా నా ముఖంలో ఉందా..?  అలా చూస్తున్నావు తిను


రుద్రాణి: యా తింటున్న


స్వరాజ్‌: ఫ్రెండు నాకు దోశ కావాలి


అపర్ణ: సరే తిను దోశ.. ఎలా ఉంది..?


స్వరాజ్‌: నీలాగే సూపర్‌గా ఉంది ఫ్రెండు


ఇందిరాదేవి: అపర్ణ నువ్వలా వాడికి గోరు ముద్దులు తినిపిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది.


రుద్రాణి: కానీ నాకు మాత్రం తనను చూస్తుంటే చాలా జాలేస్తుంది.


ధాన్యలక్ష్మీ: అక్క మీద జాలేయడం ఏంటి రుద్రాణి


రుద్రాణి: జాలి వేయక ఇంకేం వేస్తుంది ధాన్యలక్ష్మీ. పాపం ఇంట్లో కోడలిని పెట్టుకుని కూడా ఇలా బయటి పిల్లల మీద ప్రేమ చూపిస్తే జాలి వేయక ఇంకేమనిపిస్తుంది. కన్నకూతురు ఎలాగూ ఇంటికి రాదు. కనీసం ఉన్న కొడుకు కోడలు అయినా సరిగ్గా ఉన్నారా అంటే అదీ లేదు. వేద మంత్రాల నడుమ తాళి కట్టించుకున్నా… వెయ్యి మంది ముందు సప్తపది తొక్కినా ఏ ఉపయోగం లేకుండా పోయింది. తాళి కట్టిన వాడికి భార్య ఎవరో గుర్తు లేదు. తాళి కట్టించుకున్న కావ్యకు రాజే తన భర్త అని చెప్పే చాన్స్‌  లేదు. పాపం ఒకరు అక్కడ, ఒకరు ఇక్కడ వనవాసంలో తప్పిపోయిన ఆ సీతారాముళ్లలా అయిపోయింది కావ్య, రాజ్‌ పరిస్థితి. ఇక వాళ్లిద్దరు ఒక్కటయ్యేది ఎప్పుడో వాళ్లకు పిల్లలు పుట్టోది ఎప్పుడో అని జాలి వేస్తుంది ధాన్యలక్ష్మీ


అంటూ రుద్రాణి వెటకారంగా మాట్లాడాగనే ఇందిరాదేవి వాళ్ల విషయం నీకెందుకు ముందు టిఫిన్‌ చేయి రద్రాణి అంటూ తిడుతుంది. తర్వాత అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. పైనుంచి వస్తున్న అప్పు నాటకం మొదలు పెడుతుంది. ఎవరో ఫోన్‌ చేసినట్టు ఆ బాబు ఇక్కడే ఉన్నాడు నేను తీసుకుని వస్తాను అని మాట్లాడుతూ కిందకు వస్తుంది.


అప్పు: బాబు వాళ్ల పేరెంట్స్‌ దొరికారంట అత్తయ్య గారు


రుద్రాణి: దొరికారా అంటే వాళ్లెవరో తెలిస్తే స్వరాజ్‌ ఎవరో తెలుసుకోవచ్చు( మనసులో అనుకుంటుంది)


అపర్ణ: ఏంటి అప్పు నువ్వనేది


అప్పు: అవును ఆంటీ ఇందాకా స్టేసన్‌ నుంచి ఫోన్‌ చేశారు. బాబు కనిపించడం లేదని ఎవరో పేరెంట్స్‌ స్వరాజ్‌ ఫోటో చూపించి మిస్సింగ్‌ కాంప్లైంట్‌ ఇచ్చారట


రుద్రాణి: మిస్సింగ్‌  కంప్లైంట్‌ ఇచ్చారంటే వాళ్ల డీటెయిల్స్‌ కూడా కంప్లైంట్‌లో మెన్సన్‌ చేస్తారు కదా


అప్పు: చేస్తారు రుద్రాణి గారు పేరెంట్స్‌ డీటెయిల్స్‌ లేకుండా బాబును ఎలా కన్‌ఫం చేస్తాం


రుద్రాణి: అవును అవును వీడు చెప్పిన దానికి  వాళ్లు చెప్పినదానికి మాచ్‌ అవ్వాలి కదా..? ఇంతకీ వాళ్లు ఎవరట.? వాళ్ల పేరేంటి..?


ఇందిరాదేవి: ఇప్పుడు వాళ్ల పేరెందుకు రుద్రాణి బాబు పేరెంట్స్‌ అని చెప్తుంది కదా..?


రుద్రాణి: ఇప్పుడు వాళ్లెవరో వచ్చి మావాడే అంటే ఇచ్చేస్తామా..? రేపు ఏదైనా ప్రాబ్లమ్‌ వస్తే ఎవరు రెస్పాన్స్‌బిలిటీ ఏంటి అప్పు వాళ్ల పేర్లు ఏంటి చెప్పు పేర్లు చెప్పడానికి ఎందుకు అంత సంకోచిస్తున్నావు  అంటే వీడు నిజంగానే బయటి వాడు కాదా ఏంటి..?


ధాన్యలక్ష్మీ: ఏంటి అప్పు వాళ్ల పేర్లు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు బాబు పేరెంట్స్‌ ఎవరో చెప్పు..


అప్పు: ఆలోచనేం లేదు అత్తయ్యా వాళ్ల పేర్లు సడన్‌గా స్ర్కైక్‌ కావడం లేదు ఆ గుర్తొచ్చింది బాబు వాళ్లు పేరెంట్స్‌ పేర్లు లక్ష్మీ రాకేష్‌ అంట.. అత్తయ్యగారు నేను స్టేషన్‌ కు వెళ్లినప్పుడు బాబును తీసుకెళ్తాను రెడీ  చేసి ఉంచండి


అని అప్పు చెప్పగానే అపర్ణ ఒప్పుకోదు. తాను వాళ్లతో మాట్లాడిన తర్వాతే పంపిస్తాను అంటుంది. దీంతో అప్పు రేవతికి ఫోన్‌ చేసి అపర్ణకు ఇస్తుంది. అపర్ణ మాట్లాడిన తర్వాత బాబును పంపడానికి ఒప్పుకుంటుంది. తర్వాత దేవుడి దగ్గర మొక్కుతున్న కావ్య వాంప్టింగ్స్‌ చేసుకుంటుంది. వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్‌ వస్తుంది. దీంతో కావ్య షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!