Brahmamudi Serial Today Episode:  కావ్యకు తన ప్రేమ విషయం చెప్పబోతున్న రాజ్‌ వెంటనే అక్కడికి వచ్చిన ప్రకాష్‌ను చూసి కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాజ్‌ వెళ్లిపోవడం ఆశ్చర్యంగా చూస్తాడు ప్రకాష్‌.

Continues below advertisement


ప్రకాష్‌: అదేంటి కావ్య మీరిద్దరూ భార్యభర్తలు కదా మరి వాడేంటి తప్పు చేసేవాడు దొరికిపోయినట్టు అలా వెళ్లిపోతున్నాడు. మీరిద్దరూ భార్యభర్తలం అనే విషయం మర్చిపోయాడా ఏంటి..?


కావ్య: ఆయన మర్చిపోవడం కాదు మామయ్య అసలు విషయం మీరు మర్చిపోయారు. ఇప్పుడు ఆయనకు గతం గుర్తు లేదు కదా..?


ప్రకాష్‌: ఓ అవును కదూ వాడు మర్చిపోయాడు అనుకున్నాను నేనే అసలు విషయం మర్చిపోయాను సారీ కావ్య


కావ్య: నాకు సారీ ఏమీ వద్దు కానీ మీరు మాత్రం ఆయన ముందు ఇలా మర్చిపోయి నిజం చెప్పారంటే కొంపలు అంటుకుంటాయి


ప్రకాష్‌: లేదులే అమ్మా ఇప్పటి నుంచి బాగా గుర్తు పెట్టుకుంటాను


అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అపర్ణ రూంలో పడుకోవడానికి వచ్చిన జూనియర్‌ తనకు కథ చెబితే నిద్రపోతాను అంటాడు సరేనని అపర్ణ కథ చెప్తుండగానే జూనియర్‌ నిద్రపోతాడు. కథ చెప్తూ అపర్ణ కూడా నిద్రపోతుంది. తర్వాతి రోజు జూనియర్‌ స్వరాజ్‌ చెట్లకు నీళ్లు పడుతుంటే రుద్రాణి చూస్తుంది.


రుద్రాణి: అసలు వీడు ఎవడై ఉంటాడు. నిజంగానే ఆ పిల్లాడు గుడిలో తప్పిపోయి వదినకు కనిపించాడా..? లేకపోతే ఏదైనా గూడుపుఠాణీ జరిగిందా..? ఒకవేళ వదిన చెప్పినట్టు గుళ్లోనే తప్పిపోయి ఉంటే అప్పుడే అక్కడే గుడి ధర్మకర్తలకు కానీ పోలీసులకు కానీ అప్పజెప్పేవాళ్లు కదా..? ఇంటికి తీసుకురావడం ఏంటి..? పైగా వాడేదో ఇంటి వారసుడు అయినట్టు వాడి మీద అంత ప్రేమ చూపించడం ఏంటి..? ఇంకా వీణ్ని ఇంట్లోనే పెట్టుకోవడం ఏంటి.? ముందు వాణ్ని మచ్చిక చేసుకుని వాడెవడో తెలుసుకోవాలి. వాడి చుట్టుపక్కల ఇప్పుడెవ్వరూ లేరు ఇదే కరెక్ట్‌ టైం వాడెవడో వాడితోనే చెప్పించాలి


అనుకుంటూ దగ్గరకు వెళ్లి స్వరాజ్‌ను చూస్తుంటుంది.


స్వరాజ్‌: ఏంటలా గుడ్లగూడలా చూస్తున్నావు విషయం ఏంటో చెప్పు


రుద్రాణి:  వీడు నాలాగే స్ర్టైట్‌ ఫార్వర్డ్‌ అనుకుంటా డైరెక్టుగా పాయింట్‌కు వచ్చేశాడు (మనసులో అనుకుంటుంది)


స్వరాజ్‌:  ఏంటి అంటే ఏం పలకవేంటి


రుద్రాణి: ఏం చేస్తున్నావు ఇక్కడ


స్వరాజ్‌: అంత పెద్ద కళ్లు ఉన్నాయి కదా కనిపించడం లేదా..? మొక్కలకు ఆకలేస్తే నీళ్లు పడుతున్నాను


రుద్రాణి: ఏంటి మొక్కలకు ఆకలి వేస్తుందా..? వీడేదో అమాయకుడు అనుకున్నాను కానీ తెలివైన వాడిలాగే ఉన్నాడు. ఎలాగైనా వీడి గురించి తెలుసుకోవాలి


అనుకుంటూ చాక్లెట్‌ చూపిస్తుంది. నిజం చెప్తే ఇది ఇస్తానని ఆశ చూపెడుతుంది. సరే చెప్తానని రాజ్‌ చాక్లెట్‌ తీసుకుని నిజం చెప్పడు దీంతో రుద్రాణి కోపంగా స్వరాజ్‌ను బెదిరిస్తుంది. అప్పుడే అపర్ణ వచ్చి రుద్రాణిని తిట్టి రాజ్‌ను తీసుకుని వెళ్లిపోతుంది. కావ్య రూంలో రెడీ అవుతుంటే ఇందిరాదేవి వచ్చి ఎందుకు రెడీ అవుతున్నావని అడుగుతుంది. దీంతో రాజ్‌ ఇవాళ ప్రపోజ్‌ చేయబోతున్నాడని చెప్తుంది. ఇంతలో అక్కడికి అపర్ణ జూనియర్‌ వస్తారు. విషయం తెలుసుకుని అందరూ హ్యపీగా ఫీలవుతారు. మరోవైపు కళ్యాణ్‌కు అప్పు నిజం చెప్పగానే షాక్ అవుతాడు. పెద్దమ్మకు నిజం తెలిస్తే మన పరిస్థితి ఏంటని భయపడతాడు. మరుసటి రోజు అందరూ టిఫిన్‌ చేస్తుండగా స్వరాజ్‌ అల్లరి చేస్తుంటాడు. అందరూ నవ్వుకుంటారు. ఇంతలో ఇందిరాదేవి వచ్చి వాడు ఈ  ఇంటి వాడే కదా అంటుంది అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!