Brahmamudi Serial Today Episode: కళ్యాణ్‌, అప్పు లను నువ్వే ఇంటికి తీసుకురావాలని రాజ్‌, కావ్యకు చెప్తాడు. వాళ్లేమైనా నేను చెప్పినట్లు చేశారా? నేను వాళ్లను తీసుకురాను అంటుంది కావ్య. తర్వాత భోజనం చేద్దురుగాని రండి అటూ రాజ్‌ను పిలుస్తుంది. అయితే రాజ్‌ నేను తినను అంటూ మొండికేస్తాడు. దీంతో మీరు చెబితేనే వినని వాడు. నేను చెబితే వింటాడా? అయినా వాళ్లు  ఇంటికి వస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే ఇంటికి రాలేదు అంటుంది కావ్య.


రాజ్‌: నా తమ్ముడికి బయట బతకడం తెలియదు. ఎలా పని చేసుకోవాలో తెలియదు.


కావ్య: అయిపోయినదాని గురించి ఇప్పుడు మనం గొడవ పడటం అవసరమా? ఇంట్లో భోజనం చేయకుండా అంతా ఎదురుచూస్తున్నారు. రండి.


రాజ్‌: నా మాట నువ్వు విననప్పుడు నేనేందుకు నీ మాట వినాలి. నీ వంట నేనేందుకు తినాలి. నేను రాను.. నేను తినను.


 అంటూ రాజ్‌ వెళ్లిపోతాడు. మరోవైపు ఫ్రెండ్స్‌ రూంలో ఉన్న అప్పు, కళ్యాణ్‌ ఫ్రెండ్స్‌ తో కలిసి భోజనం చేస్తుంటారు. కళ్యాణ్‌ తన ఇంట్లో డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని భోజనం చేసింది గుర్తుచేసుకుని అప్పు బాధపడుతుంది. భోజనం తర్వాత ఫ్రెండ్స్‌ అందరూ సినిమాకు వెళ్తారు.


అప్పు: ఎంతో లగ్జరీగా బతికిన నిన్ను ఇలాంటి ఇరుకు గదిలోకి తీసుకురావడం నాకా చాలా బాధగా ఉంది.


కళ్యాణ్‌: నిజానికి అక్కడ అంతా ఉన్నా ఏదో లోటుగా ఉండేది. ఇప్పుడు నీతో కలిసి ఉంటే చాలా సంతోషంగా ఉంది.


అప్పు: అనామిక సరిగ్గా ఉంటే ఇదంతా జరిగేది కాదు.


కళ్యాణ్‌: అనామిక నన్నెప్పుడు ప్రేమించలేదు. నా డబ్బుకోసమే పెళ్లి చేసుకుంది. ఎప్పుడు నన్ను కించపరిచేది. కటువుగా మాట్లాడే నువ్వు నన్ను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదు. నాకు ఇంట్లో ఉన్నప్పుడు జైలులో ఉన్నట్లు ఉండేది. ఇప్పుడే నాకు స్వేచ్ఛ దొరికింది. ఇక మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం.


 అని అప్పు, కళ్యాణ్‌ ఫ్యూచర్‌ గురించి మాట్లాడుకుంటుంటారు. మరోవైపు బాగా ఆకలి వేయడంతో రాజ్‌ కడుపు పట్టుకుని కిందకు వస్తాడు. తినడానికి ఏదైనా ఉందా అని అపర్ణను అడుగుతాడు. అన్నం, కర్రీ ఉందని అపర్ణ  చెప్పగానే కావ్య వండింది తిననని అంటాడు రాజ్‌. ఇంతలో కావ్య వచ్చి నేను వడ్డించనా అని అడుగుతుంది.  


రాజ్‌: కావాలంటే పస్తులు ఉంటాను కానీ, నేను నువ్వు చేసిన అన్నం తినను.


అపర్ణ: కావ్య మీరేమైన గొడవ పడ్డారా?


కావ్య: కవిగారు వెళ్లిపోతుంటే నేను ఆపలేదని కోపంగా ఉన్నారు అత్తయ్యా..


అపర్ణ: వాడు ఆకలికి ఆగలేడు. వాడే మళ్లీ వస్తాడు. నువ్వు కంగారుపడకు. వాడు రానప్పుడే నాకు అర్థమైంది.


  అని అపర్ణ చెప్పగానే సరే అని కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు బెడ్‌పై పడుకోవడం అలవాటు ఉన్న కల్యాణ్‌కు కిందపడుకోవడం కష్టంగా ఉంటుంది. అది గమనించిన అప్పు కష్టంగా ఉందా అని అడుగుతుంది. నువ్వు పక్కనే ఉన్నావుగా కష్టంగా ఏం లేదు అంటాడు కళ్యాణ్‌. మరోవైపు రుద్రాణి కోపంగా మందు తాగుతూ అపర్ణ, ఇందిరాదేవి అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. వాళ్లు నాకు ఆస్తి ఇవ్వడం కాదు. నేనే  మొత్తం ఆస్థి లాక్కుంటాను. అంటూ ఊగిపోతుంది రుద్రాణి. మరోవైపు ఆకలితో బాధపడుతూ రాజ్‌ కిచెన్‌లోకి వెళ్లి పాలు వేడి చేసుకుంటూ చేయి కాల్చుకుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.