Brahmamudi Serial Today Episode:  కావ్యను టార్గె్‌ట్‌ చేసిన రుద్రాణికి బుద్ది చెప్పాలని స్వప్న ఆలోచిస్తుంది.  ఎలాగైనా రుద్రాణిని కూడా ఇంట్లో వాళ్ల ముందు పిచ్చి దాన్ని చేయాలనుకుంటుంది. ఇంతలో అప్పు వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అక్కా అని అడుగుతుంది.


స్వప్న: రుద్రాణి గురించి ఆలోచిస్తున్నాను


అప్పు: ఆవిడ గురించి ఆలోచించడం వదిలేయ్‌ అక్కా..


స్వప్న: వదిలేసే ప్రసక్తే లేదు. కావ్యను పిచ్చి దాన్ని చేయాలని చూస్తున్న మా అత్తను కూడా మనం పిచ్చిదాన్ని చేయాలి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా గట్టిగా బుద్ది చెప్పాలి


 అప్పు:  నువ్వు చెప్పింది కరెక్టే అక్కా.. మీ అత్త, కావ్య అక్కను తిడుతుంటే నాకు అలాగే అనిపిస్తుంది కానీ ఇంట్లో పెద్దొళ్లు ఉన్నారుగా వాళ్లే ఏమీ అనలేదు మనం ఏం చేస్తాం చెప్పు


స్వప్న: రాహుల్‌ను ముందు బయటకు పంపిస్తే.. ఈవిడ ఒక్కదానితో ఓ ఆట ఆడుకోవచ్చు ఎలాగైనా రాహుల్‌ను బయటకు పంపిస్తాను


అని చెప్తూ రాహుల్‌కు వేరే నెంబర్‌ నుంచి కాల్ చేసి టీనాలా మాట్లాడి రాహుల్ బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది స్వప్న. మరోవైపు రాజ్‌ ఒక్కడే కూర్చుని కావ్య గురించి ఆలోచిస్తుంటాడు. కావ్యకు హాయ్‌ అని మెసేజ్‌ చేస్తాడు. కావ్య కూడా హాయ్‌ అని రిప్లై ఇస్తుంది.


రాజ్‌: నేను హాయ్‌ అని పెట్టగానే.. తను కూడా హాయ్‌ అని పెట్టిందంటే నా మీద తనకు ఏం కోపం లేదన్నమాట. ( అని మనసులో అనుకుంటాడు)  నేను ఏమైనా మిమ్మల్ని బాధపెట్టానా..


 కావ్య:  అయ్యో అలా ఏమీ లేదండి ఎందుకు అలా అనుకుంటున్నారు


 రాజ్‌: మరి ఎందుకు కాఫీ షాపు నుంచి సడెన్‌గా వెళ్లిపోయారు.


 కావ్య: అయ్యో నేను ఇంకో క్షణం అక్కడే ఉంటే బాధతో మీతో నిజం చెప్పేదాన్ని అందుకే వచ్చేశానండి (అని మనసులో అనుకుని) నాకు కొంచెం హెడేక్‌ గా ఉన్నది అందుకే వచ్చేశాను.


అని కావ్య మెసేజ్‌ చేయగానే.. రాజ్‌ వెంటనే కాల్ చేస్తాడు.


రాజ్‌: ఏంటండి హెడేక్‌ గా ఉంటే నాకు చెప్పాలి కదండి.. ఇంతకీ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు


కావ్య: ఇంట్లో ఉన్నాను


 రాజ్‌:  మీ అడ్రస్‌ పెట్టండి నేను వస్తాను.


 కావ్య: మీరు ఇంత ప్రేమ చూపించకండి నేను నిజం చెప్పేస్తాను ( అని మనసులో అనుకుని) ఇందాకే టాబ్లెట్‌ వేసుకున్నాను కొంచెం తగ్గింది


 రాజ్‌:  నేను కెఫేలో నిజమే చెప్పాను కళావతి గారు. నాకు మీరు బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుందండి. కళావతి గారు నేను నిజంగా మీకు తెలియదా..?


 కావ్య:  అమ్మమ్మ పిలుస్తుంది నేను తర్వాత కాల్ చేస్తాను


అని కావ్య ఫోన్‌ కట్‌ చేస్తుంది. రాజ్‌ పక్కన యామిని వచ్చి నిలబడి ఉంటుంది. రాజ్‌ షాక్‌ అవుతాడు. యామిని మొత్తం విందేమోనని మనసులో కంగారు పడతాడు.


రాజ్‌: ఏంటి అంత సైలెంట్‌గా వచ్చావు. సడెన్‌గా నిన్ను చూసే సరికి భయపడ్డాను తెలుసా..?


యామిని:  నీ దగ్గరకు రావడానికి కూడా నేను పర్మిసన్‌ తీసుకోవాలా బావ


రాజ్‌:  పర్మిషన్‌ అవసరం లేదు. నన్ను భయపెట్టకుండా పిలిస్తే చాలు


 యామిని:  నీకు హెల్త్‌ బాగాలేదు కాబట్టి నువ్వు ఒంటరిగా వెళితే ఏమౌతుందోనని నా భయం బావ


రాజ్‌: నాకు గతం గుర్తు లేదు కానీ నేనేం చిన్న పిల్లాడిని కాదు కదా


అని రాజ్‌ తిట్టగానే.. సరేలే బావ నీకో గిఫ్ట్‌ తీసుకొచ్చాను అంటూ కారు కీస్‌ రాజ్‌ చేతిలో పెడుతుంది. ఇది నీకే అని చెప్పి వెళ్లిపోతుంది.  మరోవైపు సుభాష్‌, కావ్య దగ్గరకు వెళ్లి ఇకనైనా రాజ్‌ ఉన్నాడన్న భ్రమలోంచి బయటకు రమ్మని చెప్తాడు. అందరూ నిన్ను పిచ్చిదానిలా చూస్తున్నారంటాడు. దీంతో కావ్య మీరు కూడా రుద్రాణి మాటలు నమ్ముతున్నారా..? మామయ్య అంటూ నిజం ఏంటో నాకు తెలుసు అంటుంది. అయితే నిజం తెలిస్తే రాజ్‌ ఎక్కడున్నాడో చెప్పు అంటూ నిలదీస్తాడు. కావ్య మౌనంగా చూస్తుంది.   ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!