Brahmamudi Serial Today Episode: ఫంక్షన్‌ కు వచ్చిన అతిథులకు అందరికీ నిమ్మరసం పుల్లుగా తాగించి తాము చికెన్‌ పుల్లుగా తినాలని లక్కీ ప్లాన్‌ చేస్తాడు. అలాగే అందరికీ మాటలు చెబుతూ నిమ్మరసం తాగిస్తాడు.

Continues below advertisement

లక్కీ: రేయ్‌ ఇక ఎవ్వరూ కూడా ఎక్కువగా చికెన్‌ తినరు మన కోసం దాచుకోవవచ్చు

నందు: అంత లేదు ఎవ్వరికైనా కప్పు చికెన్‌ మాత్రమే అయినా మీరు తీసుకొచ్చిన చికెన్‌ను వీళ్లకు సరిపెట్టడమే ఎక్కువ ఇంకా పక్కకు పెడతాడంట ఏం మనిషివి నువ్వు

Continues below advertisement

లక్కీ: ఇప్పుడు నేను ఏమన్నాను అని అలా అంటున్నావు. ఓరేయ్‌ మామ నేను ఉండనురా వెళ్లిపోతాను

నందు: వెళితే వెళ్లు  ఎవరిని బెదిరిస్తున్నావు

లక్కీ: నాకు ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. మీరే ఫంక్షన్‌ చేసుకోండి.. ఆ ఒక్క కప్పు చికెన్‌ మీరే తినండి..మావా నేను  వెళ్తున్నానురా.. అరేయ్‌ మామ నీవు కూడా నేను వెళ్లిపోతుంటే ఉండమని అనడం లేదు..

రాజు: రేయ్‌ సైలెంట్‌గా ఉండు

లక్కీ: చూశారా..? మా వాడు ఉండమన్నాడు కాబట్టి ఉండిపోతున్నాను.. అరేయ్‌ మామ ఆకలి దంచేస్తుందిరా భోజనాలు స్టార్ట్‌ చేద్దామా..?

ఇందు: ఇంకొంచెం ఓపిక పట్టు

అటుండగానే.. వెంకట్‌ దండలు తీసుకొస్తాడు. ఆ దండులు మార్చుకోమని చలపతి, లక్ష్మీలకు ఇస్తుంది ఇందు. దండలు మార్చుకున్న తర్వాత స్వీట్లు తింటారు. తర్వాత అందరూ విష్‌ చేస్తారు.

ఇందు: అంకుల్‌ మీకు పెళ్లై 25 సంవత్సరాలు అయింది కదా..? ఈ ఇరవై అయిదు సంవత్సరాల్లో ఒకరికొకరు సాగించిన మీ జీవిత ప్రయాణం గురించి మాతో షేర్‌ చేసుకోండి

చలపతి: ఏం చెప్పాలమ్మా..? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి..? ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు..

లక్ష్మీ: ఈ మేడం గారు చెప్పే వరకు ఊరుకునేలా లేరు.. అందరూ మనవాళ్లే కదా చెప్పండి

అనగానే.. చలపతి మొదలుపెడతాడు. లక్ష్మీ తన జీవితం గురించి చెప్పడం మొదలుపెడుతుంది. అందరూ ఆసక్తిగా వింటుంటారు. చలపతి తన కొడుకుల గురించి చెప్తూ ఎమోషనల్‌ అవుతాడు. దీంతో ఇందు ఏడుస్తుంది.

నందు: అక్కా ఏమైందక్కా నువ్వు ఏడుస్తున్నావేంటి...?

ఇందు: ఏం లేదు.. మా అమ్మానాన్న గుర్తుకు వచ్చారు. ఒకవేళ వాళ్లు ఉండి ఉంటే చాలా బాగుండేది

నందు: నా జీవితం కూడా బాగుండేది

ఇందు: ఏంటి అంటున్నావు..?

నందు: ఏం లేదు అక్కా వాళ్లు ఉండి ఉంటే అంటున్నావు వాళ్లు లేరా..?

ఇందు: లేరు చనిపోయారు. నేను పెద్దింట్లో అందరి మధ్య ఉంటాను. కానీ మా అమ్మానాన్న లేని లోటు ప్రతిక్షణం నాకు తెలుస్తుంది

నందు: ( మనసులో) అవునక్కా వాళ్లు ఉండి ఉంటే మన లైఫ్‌ వేరేలా ఉండేది

ఇందు: అవును మీ అమ్మానాన్న ఏం చేస్తుంటారు

నందు: నాకు అమ్మానాన్న లేరు బాబాయ్‌ మాత్రమే ఉన్నారు.. మనం తెలిసో తెలియకో ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం

అని చెప్తూ నందు ఎమోషనల్‌ అవుతుంది. తర్వాత అందరికీ పిలిచి భోజనాలు రెడీ చేస్తారు. అందరూ భోజనం చేస్తుంటారు. అందులోంచి ఒకరు ఈ వంటలు చేసిన అమ్మాయి చూడముచ్చటగా ఉంది. ఈ అమ్మాయిని రాజుకిచ్చి పెళ్లి చేసేయండి అంటారు. దీంతో రాజు, ఇందు షాక్‌ అవుతారు. అందరూ భోజనం చేసి వెళ్లిపోతుంటే.. రాజు, లక్కీ కలిసి ఖర్చు చేసిన దానికంటే డబుల్‌ చదివింపులుగా వసూలు చేయాలని చూస్తారు. ఇందు వచ్చి తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!