Brahmamudi Serial Today Episode: అర్ధరాత్రి కావ్యకు ఫోన్‌ చేసి మీరు చెప్పిన పొడుపుకథను కనుక్కున్నానని మీ అడ్రస్‌ కూడా తెలిసిందని చెప్తాడు రాజ్‌.. అవునా బలే కనుక్కున్నారు మీరు అంటుంది కావ్య. మీకు రేపు ఇంకో సర్ఫ్రైజ్‌ ఇస్తా అంటాడు రాజ్‌. నేరుగా మీ ఇంటికే వస్తాను అని చెప్తాడు. అయితే కావ్య మాత్రం మీరు ఎవరి ఇంటికి వెళ్తారో అక్కడ కుక్క ఉండకుండా ఉండాలి అని మనసులో అనుకుని సరే మీకోసం వేయి కళ్లతో ఎదరుచూస్తుంటాను అని చెప్తుంది కావ్య. వైదేహి వాళ్లు లాప్‌టాప్‌ లో ఏదో చూస్తుంటారు. యామిని వస్తుంది.

యామిని: ఏంటి మమ్మీ వెడ్డింగ్‌ కార్డు సెలెక్షన్‌ చేస్తున్నారా..?

వైదేహి:  అది చేయాల్సింది మేము కాదు. నువ్వు అల్లుడుగారు

యామిని: నాకు రామ్‌ను పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంట్‌ ఇవన్నీ నేను పట్టించుకోను. ఇదంతా మీకోసం మీ ఆనందం కోసం

యామిని ఫాథర్‌: ఇదంతా నీ ఆలోచన బేబీ రాజ్‌ మనసులో ఏమనుకుంటున్నాడో అది కూడా తెలుసుకోవాలి కదా

యామిని: డాడీ నీకు ఎన్ని సార్లు చెప్పాలి  రాజ్‌ కాదు రామ్‌

యామిని ఫాథర్‌: పేరు మారితే ఎలాంటి ప్రాబ్లమ్‌ లేదు బేబీ మనసు మారితేనే అసలు ప్రాబ్లమ్‌

యామిని: ఇప్పుడు ఏమైందని అంత టెన్షన్‌ పడుతున్నారు.

యామిని ఫాథర్‌: రామ్‌ గుడికి అని చెప్పి వెళ్లి వాళ్ల అమ్మను కలిశాడు. ఆ కావ్య పదే పదే రామ్‌ను కలుస్తుంది. ఇదంతా చూస్తుంటే.. నాకు ఈ పెళ్లి జరుగుతుందా అని అనుమానం కలుగుతుంది

యామిని:  నీకు ఆ అనుమానమే అక్కరలేదు డాడీ మా పెళ్లిని ఎవరూ ఆపలేరు.

వైదేహి: ఆ కావ్యను తక్కువ అంచనా వేయకు బేబీ

యామిని: అదే నన్ను తక్కువ అంచనా వేస్తుంది మమ్మీ.. నేను నేరుగా తనతో యుద్దం చేయాలని నన్ను రెచ్చగొట్టాలని చూస్తుంది. ఆవేశంలో నేను నిజం బయటపెట్టాలని చూస్తుంది.

యామిని ఫాథర్‌: కావ్య ఉద్దేశం నీ నుంచి నిజం చెప్పించడమే అయితే ఎప్పుడో చేసేది. తనకు కావాల్సింది అది కాదు. తన భర్తకు ఎటువంటి ప్రమాదం జరగకుండా గతాన్ని గుర్తు చేయడమే తనకు ముఖ్యం

యామిని: అది జరగని పని డాక్టర్‌ గారు చెప్పారు కదా డాడ్‌ అతనికి ఎప్పటికీ గతం గుర్తుకు రాదని

వైదేహి: మనం మన జాగ్రత్తలో ఉండాలి. అల్లుడు గారు కూడా ఈ పెళ్లి పనుల్లో ఇన్‌వాల్వ్‌ అయితేనే బాగుంటుంది. అలాగే ఆ కావ్య మీద కూడా ఒక కన్నేసి ఉంచు  

యామిని: దాని సంగతి నేను చూసుకుంటాను ముందు మీరు కార్డ్స్‌ ప్రింట్‌ వేయించండి

అంటూ యామిని వెళ్లిపోతుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ క్యారమ్స్‌ ఆడుతుంటారు. ఇంతలో రాజ్‌ కారు వేసుకుని వచ్చి ఇంటి ముందు ఆగుతాడు. నాకెందుకో ఈ ఇంటిని ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుందేంటి అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్తుంటాడు. బయట నుంచి రాజ్‌ రావడం గమనించిన కావ్య అప్పుకు సైగ చేస్తుంది. రాజ్‌ను చూసిన అప్పు షాక్‌ అవుతుంది. ఇంతలో కావ్య మెల్లగా అపర్ణకు చెప్తుంది. అపర్ణ బయటకు చూసి వీడేంటి ఇక్కడికి వస్తున్నాడు అని షాక్‌ అవుతుంది.

ఎలాగైనా మీరే అందరినీ లోపలికి తీసుకెళ్లండి అత్తయ్యా అని కావ్య చెప్పగానే.. అపర్ణ నాకు ఇక్కడ ఈ గేమ్‌ ఆడటం నచ్చడం లేదు అని ధాన్యలక్ష్మీ, ఇంద్రాదేవిని లోపలికి తీసుకెళ్తుంది. రుద్రాణి, రాహుల్‌, స్వప్నలను అప్పు పైకి పంపిస్తుంది. ఇంతలో రాజ్‌ ఇంట్లోకి వచ్చి కావ్యను చూసి చూశారా మీ అడ్రస్‌ కనిపెట్టాను అంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!