Brahmamudi Serial Today Episode:  : రాజ్‌ లేడని ఇప్పటికైనా నమ్మండని రాజ్ ను ఇంటికైనా తీసుకురండి లేకపోతే డెత్‌ సర్టిఫికేట్‌ అయినా తీసుకురండి అని రుద్రాని అడుగుతుంది. దీంతో కావ్య కోపంగా రుద్రాణిని తిట్టి వార్నింగ్‌ ఇస్తుంది. రెండు కోట్ల కోసం బతికున్న మనిషిని చంపేస్తావా.. ఆ రెండు కోట్లు 24 గంటల్లో నేను సెటిల్‌ చేస్తాను అంటూ వెళ్లిపోతుంది. కావ్య వెనకాలే బయటకు అపర్ణ వెళ్తుంది.


అపర్ణ: కావ్య అంత కాన్ఫిడెంట్‌గా ఆ రుద్రాణితో చాలెంజ్‌ చేశావు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావే


కావ్య: లేకపోతే ఆయన డెత్‌ సర్టిఫికెట్‌ అడుగుతుందా..? వయసులో పెద్దది అని ఊరుకున్నాను అత్తయ్యా లేకపోతే చెంపలు పగులగొట్టేదాన్ని


అపర్ణ: దాని సంగతి నేను చూసుకుంటాను కానీ ముందు ఇప్పుడు వచ్చిన సమస్య గురించి ఏం ఆలోచించావు. రాజ్‌ వచ్చి కాంట్రాక్ట్‌ పూర్తి చేయడానికి అసలు వాడికి గతం గుర్తు లేదు కదా..? అలాంటప్పుడు రేపటి లోపు వాళ్లకు రెండు కోట్లు ఎలా ఇస్తావు


కావ్య: వాళ్లకు రెండు కోట్లు ఇవ్వడానికి ఆయన రావాల్సిన అవసరం లేదు అత్తయ్యా..? నా పేరు మీద పవర్‌ ఆప్‌ అటార్ని ఉంటే చాలు పెండింగ్‌లో ఉన్న పనులన్నీ నేను పూర్తి చేస్తాను.


అపర్ణ: అయితే నీ ఆలోచన బాగానే ఉంది. కానీ అలా జరగాలన్నా నీ పేరు మీద పవర్‌ ఆప్‌ అటార్ని ఇస్తున్నట్టుగా రాజ్‌ సంతకం చేయాలి కదా..? ఇప్పుడు వాడికి వాడి పేరే గుర్తుకు లేదు అలాంటప్పుడు వాడు సంతకం ఎలా చేస్తాడు


కావ్య: ఏం చేయాలో తెలియడం లేదు అత్తయ్యా.. ఆయన్ని కలవమని చెప్పాను. కలిశాక ఈ సమస్యను ఏదో రకంగా పరిష్కరిస్తాను


అపర్ణ:  ఏం చేస్తావో ఏమో నాకేమో కాళ్లు చేతులు ఆడటం లేదు. వాడు ఉన్నట్టు ఒప్పుకోలేమూ.. అలాగని వీళ్లు అడిగినట్టు సర్టిఫికెట్‌ తీసుకురాలేము


కావ్య:  అత్తయ్యా నేను ఒక విషయాన్ని బలంగా నమ్ముతాను. మన వైపు న్యాయం ఉన్నప్పుడు ఎటు వెళ్లాలో దిక్కుతోచనప్పుడు ఈ పంచభూతాలు మనకు తోడుగా నిలబడి మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి.


అంటూ కావ్య వెళ్లిపోతుంది. వెళ్తూ రాజ్‌కు ఫోన్‌ చేసి కలవాలని కాఫీ షాపులో ఉంటానని చెప్తుంది. రాజ్‌ కావ్యను కలిసేందుకు బయలుదేరి వెళ్తుంటాడు. ఇంతలో హాల్లో వైదేహి పంతులును పిలిపించి పెళ్లికి ముహూర్తం చూస్తుంటారు.


యామిని ఫాథర్‌: అమ్మా యామిని ఒక మాట బాబుతో కూడా చెబితే బాగుంటుంది.


యామిని: ఎందుకు డాడీ అంత టెన్షన్‌ హాస్పిటల్‌ లోనే ఒప్పుకున్నాడు కదా..? మళ్లీ ఇప్పుడు కొత్తగా చెప్పడం ఏంటి..?


యామిని ఫాథర్‌:  ఎందుకైనా మంచిది ఒక మాట చెబితే బాగుంటుంది (రాజ్‌ బయటకు వెళ్తుంటే) బాబు నీ గురించే అనుకుంటున్నాము నువ్వే వచ్చావు రా వచ్చి కూర్చో


రాజ్‌: నేనొక చిన్న పని మీద వెళ్తున్నాను. ఏంటి విషయం చెప్పండి.


వైదేహి: ఏం లేదు అల్లుడుగారు పెళ్లికి మీ ఇద్దరి జాతకాలు చూపించి మంచి ముహూర్తం పెట్టుకుంటే పని అయిపోతుంది కదా అని పంతులు గారిని పిలిపించాం. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదా


రాజ్‌: టైం అవుతుంది. ( మనసులో అనుకుని) పెద్దవాళ్లు మీరు ఉన్నారు కదా..? మీరు ఎలా అంటే అలానే మీరు కానిచ్చేయండి


అంటూ రాజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత పంతులు రెండు నెలల తర్వాత ముహూర్తం ఉందని చెప్తాడు. అంత లాంగ్‌ వద్దని త్వరగా ఏదైనా ముహూర్తం ఉంటే చెప్పమని యామిని అడుగుతుంది. దీంతో వైదేహి మంచి ముహూర్తంలో పెళ్లి జరిగితే బాగుంటుంది రెండు నెలలో ఉన్న ముహూర్తమే ఫిక్స్‌ చేయండి అని చెప్తుంది. మరోవైపు కావ్య కోసం రాజ్‌ కాఫీ షాప్‌ కు వెళ్తాడు.


రాజ్‌: ఏంటండి ఎందుకు డల్లుగా కూర్చున్నారు..


కావ్య: అవునండి.. నేను చేసిన చిన్న మిస్టేక్‌ వల్ల నా జాబ్‌ పోయే పరిస్థితి వచ్చింది.


రాజ్‌: అవునా.. ఏం చేశారు.


కావ్య: మా బాస్‌ సైన్‌ చేసిన ఇచ్చిన డాక్యుమెంట్స్‌ నేను పోగొట్టాను. ఆయన ఇప్పుడు ఫారిన్‌లో ఉన్నారు. ఆయన వచ్చే లోపే  ఆ డాక్యుమెంట్స్‌ తో డీల్‌ పూర్తి చేయాలి.


అంటూ బాధగా మీరే ఎలాగైనా నాకు హెల్ప్‌ చేయాలి. సేమ్‌ డాక్యుమెంట్స్‌ రెడీ చేశాను. మీరే ఎలాగైనా మా బాస్‌లా సంతకం చేయాలి అని అడుగుతుంది. దీంతో రాజ్‌ ఫోర్జరీ నేను చేయలేను అంటూ వెళ్లిపోతాడు. కావ్య నేనే ఎలాగోలా చేసుకుంటాను అనుకుంటుంది. కావ్య నకిలీ డాక్యుమెంట్స్‌ తో అందరినీ మోసం చేస్తుందని రుద్రాణి ఇంట్లో వాళ్ల ముందు చెప్తుంది. కావ్య రెడీ చేసిన డాక్యుమెంట్స్‌ ప్రింట్స్‌ ఇంట్లో వాళ్లకు చూపిస్తుంది. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో కావ్య రాగానే.. రుద్రాణి కావ్యను నిలదీస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌  అయిపోతుంది.


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!