Brahmamudi Serial Today Episode: రాజు బైక్‌ మీద వెళ్తున్న ఇందు దూరంలో కనిపించన ఐస్‌క్రీమ్‌ బండిని చూసి తనకు ఐస్‌క్రీమ్‌ కావాలని అడుగుతుంది. దీంతో రాజు బండి ఆపేసి తీసుకురావడానికి వెల్తుంటే.. డబ్బులు ఇచ్చి తెచ్చేది నాకు వద్దు దొంగతనం చేసిన ఐస్‌క్రీమ్‌ కావాలి అంటుంది. రాజు తిట్టగానే.. అయితే నేను ఇంటికి వెళ్లి ఆ డల్లాస్‌తో తేల్చుకుంటాను అని బెదిరిస్తుంది. దీంతో రాజు ఓకే అంటాడు. ఇద్దరూ కలిసి ఐస్‌ క్రీమ్ బండి దగ్గరకు వెళ్లి ఐస్‌క్రీమ్‌ కొట్టేసి దూరంగా వెళ్తారు.

Continues below advertisement

రాజు: ఇప్పుడు నీ డ్రీమ్‌ నిజం అయింది కదా..? అదే నీకు చిన్నప్పటి నుంచి దొంగతనం చేయాలని ఉండేది అన్నావు కదా అది ఇప్పుడు తీరిపోయింది కదా అంటున్నాను..

ఇందు: అవును అంతా తమరి దయ థాంక్యూ సో మచ్.. ఇదిగో ఇది నువ్వు తిను

Continues below advertisement

రాజు: నాకెందుకు ఇస్తున్నావు.. నువ్వు కదా దొంగతనం చేసి తినాలి అన్నావు

మరిన్ని ఆసక్తికరమైన వెబ్‌స్టోరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

ఇందు: అసలు నీ ప్రాబ్లమ్‌ ఏంటి..? నువ్వు ఐస్‌క్రీమ్‌ తీసుకోకపోతే పెద్ద గొడవ చేస్తాను. (రాజు ఐస్‌క్రీమ్‌ తీసుకుని ఫాస్ట్‌గా తినేస్తాడు.) నీకు ఇంకో ఐస్‌క్రీమ్‌ కావాలనిపిస్తుంది కదా..? రా వెళ్దాం ఇంకోటి కొట్టేద్దాం

రాజు: వద్దు నాకేం వద్దు..ఇవాళ నన్ను ఇరికించాలని ప్లాన్‌ చేసినట్టు ఉన్నావు.. నేను రాను

ఇందు: అయితే నేను ఇంటికి వెళ్లి ఓనరుతో ( డల్లాస్‌) తేల్చుకుంటాను

రాజు: సరే వెళ్దాం పద

ఇద్దరూ మళ్లీ ఐస్‌ క్రీమ్‌ బండి దగ్గరకు వెళ్తారు.

ఐస్‌క్రీమ్‌ బండి ఓనరు: ఈ ఐస్‌క్రీమ్‌ ఎక్కడిది.. నాతో కొనలేదు కదా..?

రాజు: ఏయ్‌ పక్క బండి దగ్గర కొన్నాంలేవయ్యా..

ఇందు: అబద్దం చెప్తున్నాడు.. ఇందాకే రెండు ఐస్‌క్రీములు నీ దగ్గరే కొట్టేశాడు.

రాజు: ఏయ్‌ నేను కొట్టేయడమేంటే..?

ఐస్‌క్రీమ్‌ బండి వాడు రాజును తిడుతుంటాడు. ఇంతలో ఇందు కోపంగా కొట్టేసిన ఐస్‌క్రీమ్‌ కు డబ్బులు ఇచ్చేయ్‌ అని రాజుకు చెప్పి బైక్‌ దగ్గరకు వెళ్లిపోతుంది. డబ్బులు ఇచ్చి రాజు దగ్గరకు వెళ్తాడు. ఇందు నవ్వుతుంటుంది

రాజు: నవ్వు ఆపుతావా..? ఏయ్‌ ఆపు

ఇందు: కోపంగా ఉంది కదా..? నిజం చెప్పానని ఫీల్‌ అయ్యావా..?

రాజు: లేదు.. కాలిపోతుంది. ఇంకా నేను దొంగనని, కిడ్నాపర్‌ అని మెడలో ఒక ట్యాగ్‌ వేయ్‌ అప్పుడు చాలా బాగుంటుంది.. నిన్ను చూస్తుంటే.. సరే నేను రెండు నిమిషాలు అలా పక్కకు వెళ్లి వస్తాను

ఇందు: సరే రెండు నిమిషాలు కాదు.. ఐదు నిమిషాలు అయినా వెళ్లి రా

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఈ లింక్‌ను ఫాలో అవ్వండి

రాజు పక్కకు వెళ్లి ఒక బీరు తీసుకుని కోక్‌ టిన్‌లో బీరు నింపి ఇందు చేత తాగించాలని అనుకుంటాడు. అనుకున్నట్టుగానే ఇందు దగ్గరకు వెళ్లి కోక్‌ లో ఉన్న బీరు తాగిస్తాడు. బీరు తాగిన ఇందు మత్తుగా రాజును హగ్‌ చేసుకుంటుంది. రాజు ఫీల్ అవుతాడు. ఇందు తాగిన మైకంతో అటూ ఇటూ తిరుగుతూ డాన్స్‌ చేస్తుంది. బెలూన్స్‌ కనిపిస్తే వెళ్లి తీసుకుని వాటితో ఎగిరి గంతులేస్తుంటుంది. రాజు వెనకాలే పరుగెడుతుంటాడు. మత్తుగా ఉందని ఇంటికి వెళ్దాం అంటుంది అనుకుంటే ఇలా చేస్తుందేంటి అని రాజు ఇరిటేట్‌ అవుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.