Brahmamudi Serial Today Episode: కిచెన్‌లో వంట చేస్తున్న ఇందును ఇంటి ఓనరు చూసి షాక్‌ అవుతాడు. ఎవరీ అమ్మాయి అని అడగ్గానే.. లక్కీ, రాజు కలిసి నాటకం ఆడతారు. ఇక్కడ అమ్మాయి ఎవరూ లేరు అంకుల్‌ అని చెప్తారు.. మీకు మందు బాగా ఎక్కిందని అంటారు. ఓనరు మాత్రం ఇందును చూస్తూ.. ఇక్కడ కత్తి లాంటి అమ్మాయిన పెట్టుకుని లేదంటారేంట్రా అని తిడుతుంటే.. ఇందు కోపంగా ఓనరును కొడుతుంది. ఓనరు కింద పడిపోగానే.. ఇందును పక్కకు పంపిస్తారు. ఓనరు లేచే లోపు లక్కీ చీర కట్టుకుని కనిపిస్తాడు.

Continues below advertisement

ఓనరు: ఇందాకా అమ్మాయిలా కనిపించిన నువ్వు ఇప్పుడు లక్కీలాగే ఉన్నావు..

లక్కీ: నేను నాలా ఉండక మరెలా ఉంటాను సార్‌

Continues below advertisement

రాజు: మీరు అడిగిన వంటలన్నీ చేస్తున్నాను మీరు వెళ్లి చిల్‌ అవ్వండి సార్‌

ఓనరు వెళ్లి ఫుల్లుగా తాగి పడిపోతాడు.

రాజు: వీడేంటిరా చిల్లి చికెన్‌ అన్నాడు ఇలా పడిపోయాడు

లక్కీ: ఎందుకైనా మంచిదని ఓ నాలుగు పెగ్గులు రా తాగించాను మావ

రాజు: నువ్వు ఈ మధ్య  బుర్ర వాడుతున్నావురా

ఇందు వస్తుంది.

ఇందు: ఇంతకీ నేను అడిగింది ఏం చేశావు

రాజు: ఏం అడిగారు

ఇందు: వంట చేస్తే నాకు గోలీ సోడ ఇప్పించాలని అడిగాను కదా

రాజు: గోలీ సొడ కాదు కదా గోలీ లేని సోడా కూడా ఈ చుట్టు పక్కల ఎక్కడా కనిపించలేదు

ఇందు: ఏరుదాటే వరకు ఓడ మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టు నాతో బండెడు చాకిరీ చేయించుకున్నారు నన్ను కాసేపు చెఫ్‌ను చేసి రకరకాల వంటలు చేయించుకున్నారు. ఇంత చేసినా కనీసం గోలీ సొడ తీసుకురాలేకపోయారు.. నేనేమైనా మణులు అడిగానా.? మాణిక్యాలు అడిగానా..? అసలు నీ లాంటి మనిషిని అడిగాను చూడు నాది బుద్ది తక్కువ

రాజు వెనక నుంచి గోలీ సొడ తీసి ఇస్తాడు. గోలీ సోడ చూడగానే.. ఇందు సంతోషిస్తుంది.

ఇందు: రెండు తీసుకొచ్చావా..? ఎందుకు..?

రాజు:  డబుల్‌ ధమాకా.. అవును ఇంతకీ నన్ను ఏమన్నావు.. విశ్వాసం లేని వాణ్నా..?

ఇందు: అన్ని పట్టించుకుంటావా ఏంటి… అవును రెండు ఎందుకు తీసుకొచ్చావు..

రాజు: తమరికి ముందే తలతిక్క ఒకటి తాగాక మరొకటి కావాలని అడిగితే మళ్లీ బయటకు వెళ్లి తీసుకురాలేను కదా

సోడా తాగుతూ ఇందు రాజుకు థాంక్స్‌ చెప్తుంది.

ఇందు: ఎప్పుడో చిన్నప్పుడు తాగాను.. మళ్లీ నీ వల్ల ఇప్పుడు తాగుతున్నాను.. ఒకే తాగేది అయిపోయింది కదా నన్ను బయటకు తీసుకెళ్లు.

రాజు: అసలు నీ కాళ్లు చేతులు కట్టేసి రూంలో పడేయకుండా ఫ్రీగా వదిలేసినందుకా ఇదంతా అడుగుతున్నావు అసలు తీసుకెళ్లను

ఇందు: నువ్వు నన్ను బయటకు తీసుకెళ్లకపోతే నేను గొడవ చేస్తాను..

రాజు: ఏంటి నన్నే బెదిరిస్తున్నావా..? తీసుకెళ్లను

ఇందు గట్టిగా అరుస్తూ.. ఇంటి ఓనరును పిలుస్తుంది. రాజు వెంటనే ఆపమని రిక్వెస్ట్ చేసి ఇందును బయటకు తీసుకెళ్తాడు. రాజు ఇంట్లో చలపతి, లక్ష్మీ, రాజు గురించి ఆలోచిస్తుంటే అప్పుడే నందు వెళ్తుంది. నందును చూసిన చలపతి షాక్‌ అవుతాడు. ఎవరు కావాలని అడిగితే వెంకట్‌ కోసం వచ్చానని చెప్తుంది. చలపతి షాక్‌ అవుతాడు. నా పెద్దకొడుకు కోసం అమ్మాయిలు వస్తారేమో అనుకుంటే చిన్న కొడుకు కోసం అమ్మాయి వచ్చింది.. బాగా ఇంప్రూవ్‌ అయ్యాడు నా చిన్న కొడుకు అనగానే.. నందు కోపంగా మేమిద్దరం జస్ట్‌ ఫ్రెండ్స్‌ అంతే అంటూ నందు పైకి వెళ్తుంది. పైన వెంకట్‌ యాపిల్‌ జ్యూస్‌ తాగుతూ కుక్కబొమ్మను పక్కన పెట్టుకుని దేవదాసులా ఫీలవుతుంటే.. నందు చూసి తిట్టి రోజాను మర్చిపో అంటూ కన్వీన్స్‌ చేస్తుంది. మరోవైపు ఇందును బయటకు తీసుకెళ్లిన రాజుతో ఇందు ఐస్‌క్రీమ్‌ కావాలని అడగుతుంది. దీంతో రాజు కోపంగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!