Brahmamudi Serial Today Episode: చాటింగ్‌ చేసుకుంటుండగా రాజ్‌ ఒకసారి కలుద్దామా అని అడుగుతాడు. కావ్య సరే అంటుంది. రాజ్‌ నుంచి రిప్లై రాకపోయే సరికి కావ్య ఆందోళన పడుతుంది. ఇంతలో రాజ్‌ మణికొండలో కలుద్దామని అడ్రస్ చెప్తాడు. కావ్య హ్యాపీగా ఫీలవుతుంది. యామిని కోపంగా వాళ్ల డాడీని చూస్తుంది.

యామిని: ఏంటి డాడీ ఇది నా లైఫ్‌ను ఏం చేయాలనుకుంటున్నావు. నేను ఎలాంటి క్రిటికల్‌ సిచ్యుయేషన్‌ నుంచి బయటపడ్డానో తెలిసి కూడా నాకే ద్రోహం చేయాలనుకున్నావా?

యామిని ఫాథర్‌: నేను నీ తండ్రిని బేబీ నేను నీకు ద్రోహం చేస్తానా..?

యామిని: మరి నువ్వు చేసింది ఏంటి..? రామ్‌ అడగ్గానే కావ్య గురించి ఎందుకు చెప్పాలనుకున్నావు..

యామిని ఫాథర్‌: రాజ్‌ అలా అడగ్గానే..

యామిని: రాజ్‌ కాదు రామ్‌ గుర్తు పెట్టుకో డాడీ రాజ్‌ కాదు రామ్‌..

యామిని ఫాథర్‌: అదే బేబీ అబ్బాయి వచ్చి అలా బాధ పడుతుంటే.. నాకేదో తప్ప చేసిన ఫీలింగ్‌ వచ్చింది. భార్యాభర్తలను విడదీయడం పాపం అనిపించింది. తనకు గతం గుర్తుకు లేకపోయినా.. కావ్యను చూడగానే.. తెలిసిన మనిషిలా ఫీలవుతున్నాడు అంటే తన భార్యను ఎంతలా ప్రేమించి ఉండాలి.. అందుకే గిల్టీగా అనిపించి..

యామిని: నిజం చెప్పాలనుకున్నావు.. రామ్‌ కళ్లలో ప్రేమను చూశావు. మరి నా అణువణువులోనూ రామ్‌ మీద పెంచుకున్న ప్రేమ ఉంది కదా డాడీ..అది నీకు కనిపించలేదా..? ఇన్నేళ్లుగా తన జ్ఞాపకాలతో బతుకుతూ తను లేకపోతే జీవితమే లేదనుకుని చావడానికి కూడా సిద్దపడ్డాను. అది నీకు కనిపంచడం లేదా..?  రామ్‌ కోసం నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలియదా..? డాడీ నా ప్రేమను అర్థం చేసుకోకపోయినా.. నా రామ్ ను నా నుండి దూరం చేయాలని చూసినా వాళ్లను నేను క్షమించను

అంటూ కత్తి తీసుకుని వాళ్ల డాడీ వైపు వెళ్తుంది.

వైదేహి: బేబీ ఏం చేస్తున్నావు.. ఆయన మీ నాన్నా..

యామిని: కంగారు పడకు మమ్మీ.. కన్నతండ్రిని చంపేంత  శాడిజం నాలో లేదు. కానీ రామ్‌ లేకపోతే మాత్రం నన్ను చంపుకునేందుకు అసలు వెనకాడను.

అని చెప్తూ కత్తితో పొడుచుకోబోతుంటే.. వైదేహి, వాళ్ల డాడీ అడ్డుపడతారు. యామిని ఆపి నీ కన్నా మాకు ఏదీ ఎక్కువ కాదని చెప్తారు. రామ్‌తో పెళ్లి చేసే బాధ్యత నాదే అంటాడు. యామిని హ్యాపీగా వెళ్లిపోతుంది. మరుసటి రోజు కావ్య రెడీ అయి కిందకు వస్తుంది.

రుద్రాణి: రోజురోజుకు మీ కోడలు చాలా డెవలప్‌ అవుతుంది వదిన. హీరోయిన్ రేంజ్‌లో రెడీ అయింది.

ఇందిరాదేవి: ఏం కావ్య ఏదైనా ఫంక్షన్‌కు వెళ్తున్నావా..?

 రుద్రాణి: మా అమ్మ అడుగుతుంది కదా కావ్య.. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్తున్నావా..? బర్తుడే పార్టీకి వెళ్తున్నావా..?

 కావ్య:  ఏం లేదు అమ్మమ్మగారు ఆఫీసుకు వెళ్తున్నాను.

రుద్రాణి: వాహ్‌ మొగుడు ఉన్నప్పుడేమో ముష్టి చీరలు కట్టింది. ఇప్పుడేమో మోడ్రన్‌ లా తయారయింది. అవునులే నిన్ను అడిగే వారు ఎవరున్నారని.. అంతా నీ ఇష్టా రాజ్యమే కదా..? అయినా నాకెందుకులే అమ్మా.. అడగాల్సిన నీ అత్తా మామలే నోరు మెదపడం లేదు. నువ్వు ఎలా రెడీ అయితే మాకెందుకు చెప్పు.

 కావ్య: నేనేం చేసినా ఒక కారణం ఉంటుంది రుద్రాణి గారు. అత్తయ్యా ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను.. ఆయన వచ్చే వరకు ఆయన బాధ్యతలు కూడా నేనే చూసుకోవాలి అనుకున్నాను అందుకే ఈ రోజు నుంచి ఆఫీసుకు వెళ్లాలనుకుంటున్నాను.

ఇందిరాదేవి: మాకు కావాల్సింది అదే కావ్య.. నువ్వు హ్యాపీగా ఆఫీసుకు వెళ్లి రా

అని చెప్పగానే కావ్య వెళ్లిపోతుంది. రుద్రాణి కావ్యను తిడుతుంది. ఎవ్వరూ పట్టించుకోరు.  మరోవైపు కావ్యను కలిసేందుకు బయటకు వెళ్తున్న రాజ్‌ను వైదేహి ఆపి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. దీంతో రాజ్‌ చిన్న నాటకం ఆడి అక్కడి నుంచి బయట పడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!