Brahmamudi Serial Today Episode: నందు, వెంకట్‌ తాము ఉన్న ఇంటి వైపు రావడం చూసిన లక్కీ, రాజు భయంతో లోపలికి వెళ్లి డోర్స్‌ క్లోజ్‌ చేసుకుని కూర్చుని ఉంటారు. ఇంతలో నందు వచ్చి డోర్‌ కొడుతుంది.

Continues below advertisement

లక్కీ: మావ అంతా అయిపోయిందిరా ఇక మనం దొరికేసినట్టే

రాజు: ఓరేయ్‌ నువ్వు కంగారు పడకు నీ భయమే మనల్ని పట్టించేలా ఉంది నేను మేనేజ్‌ చేస్తాను నువ్వు చూస్తూ ఉండు

Continues below advertisement

బయట డోర్‌ దగ్గర నిలబడిన వెంకట్‌కు ఎవరో ఫోన్‌ చేసి రోజా గురించి చెప్తుంటే ఫోన్‌ మట్లాడుతూ పక్కకు వెళ్లిపోతాడు వెంకట్‌. అప్పుడే డోర్‌ తీస్తాడు రాజు.

లక్కీ: హమ్మయ్య మీ తమ్ముడు లేడు మావ

రాజు: నువ్వు నోర్మూయ్‌ రా

నందు: ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు

రాజు: అంటే ఎవరో తెలియని అమ్మాయి ఇలా గుమ్మం ముందు నిలబడితే ఎవరా అని మాట్లాడుకుంటున్నాము

నందు: మీలో మీరు మాట్లాడితే ఎలా తెలుస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూశానే

లక్కీ: అయ్యో మర్చిపోయారా..? మేడం ఆరోజు మేము నగలు తాకట్టు పెట్టబోతుంటే మీరు కొంతమంది రౌడీలను తీసుకొచ్చారు

నందు: ఎస్‌ గుర్తుకు వచ్చింది.

రాజు: ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చారు మేడం

నందు: ఒక అమ్మాయిని కిడ్నాప్‌ చేశారు. ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చాను.

రాజు: ఆ అమ్మాయి ఎవరు మేడం ఫోటో ఏమైనా ఉందా..?

నందు: ఉంది.. ఇదిగో ఈ అమ్మాయి

అంటూ ఇందు ఫోటో చూపించగానే.. రాజు, లక్కీ షాక్‌ అవుతారు.

నందు: ఈ అమ్మాయినే ఎవరో కిడ్నాప్‌ చేశారు

లక్కీ: అమ్మో కిడ్నాపా..? కిడ్నాప్‌ అంటే సినిమాల్లో చూడటమే కానీ నిజంగా ఇప్పుడే వింటున్నాము

నందు: మీకు ఒక వేళ ఇన్మఫర్మేషన్‌ వస్తే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి చెప్పండి. ఈ అమ్మాయి మీకు తెలుసు కదా..?

రాజు: అంటే అప్పుడెప్పుడో రోడ్డు మీద చిన్న గొడవ పడింది మేడం మాతో

నందు: సరే సరే ఈ అమ్మాయి గురించి తెలిస్తే మాకు ఇన్మఫర్మేషన్‌ ఇవ్వండి.

అంటూ నందు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. బయటకు వెళ్లిన నందుకు వెంకట్‌ ఎదురుగా వచ్చి నా గర్లఫ్రెండ్‌ దొరికింది అని చెప్తాడు.

నందు: దొరికిందా..? ఎలా దొరికింది..?

వెంకట్‌: దొరికింది అంటే తను ఎక్కడ ఉందో తెలిసిపోయింది అని..

నందు: తెలిసిందా..? ఎక్కడ ఉంది

వెంకట్‌: బంజారాహిల్స్‌లో ఒక రెస్టారెంట్‌లో ఉంది

నందు: అని నీ గర్ల్‌ఫ్రెండ్‌ చెప్పిందా

వెంకట్‌: కాదు నా ఫ్రెండ్‌ చెప్పాడు.. ఫ్లీజ్‌ నందు వెళ్దాం పద

అని వెంకట్‌, నందును తీసుకుని బంజారాహిల్స్‌ వెళ్తాడు. అక్కడ రోజా వేరే వ్యక్తికి ప్రపోజ్‌ చేస్తూ ఉండటం వెంకట్‌, నందు చూస్తారు. నందు వెటకారంగా మాట్లాడుతుంది. వెంకట్‌ రోజా దగ్గరకు వెళ్లి తిడతాడు. రోజా కూడా వెంకట్‌ను తిట్టి వెళ్లిపోతుంది. వెంకట్‌ను నందు ఓదారుస్తుంది. మరవైపు రాజు మొబైల్‌ తీసుకుని స్వాతికి ఫోన్‌ చేయబోతుంది ఇందు. అంతా గమనించిన రాజు సెల్‌ ఫోన్‌ లాక్కుని ఇందుని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు ఇందు కోసం అపర్ణ బాధపడుతుంటే.. స్వాతి ఓదారుస్తుంది. నందు వచ్చి ఎలాగైనా అక్కను కనిపెడతానని నువ్వు బాధపడొద్దని అపర్ణకు ధైర్యం చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!