Brahmamudi Serial Today April 15th:  ‘బ్రహ్మముడి’ సీరియల్:  తల్లి పేరుతో గుడిలో అన్నదానం చేస్తానన్న రాజ్‌ -  రాజ్‌ మాటలకు ఎమోషనల్‌ అయిన కావ్య  

Brahmamudi Today Episode:  కావ్యను ఎలాగైనా మాట్లాడాలని అన్నదానం గురించి రాజ్‌ చెప్పడంతో కావ్య ఎమోషనల్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Continues below advertisement

Brahmamudi Serial Today Episode: కావ్యను ఎలాగైనా కలిసి నిజం తెలుసుకోవాలనుకున్న రాజ్‌ ఫోన్‌ చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. కావ్య  మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పగానే.. తాను కూడా మార్కెట్‌ కే వెళ్తున్నానని.. కూరగాయలు కొనడంలో నాకు హెల్ప్‌ చేయాలని అడుగుతాడు. కావ్య సరే అంటుంది. మార్కెట్‌ కు మీరు ముందు వస్తే వెయిట్‌ చేయండి.. నేను ముందు వస్తే వెయిట్‌ చేస్తాను అని ఫోన్‌ కట్‌ చేస్తాడు. తర్వాత ఇద్దరూ మార్కెట్‌లో కలుసుకుంటారు.

Continues below advertisement

రాజ్‌: ఏంటి కళావతి గారు ముందే వచ్చేశారు. ఈ షాపు మీ ఇంటికి చాలా దగ్గర కదా..

కావ్య: అవును బలే కనిపెట్టారు.. అయినా మా డ్రైవర్‌కు కొంచెం స్పీడెక్కువ.. అవును  ఈ షాపు మీ ఇంటికి కొద్దిగా దూరం కదా

రాజ్‌:  భలే కనిపెట్టారే ఎలా..?

కావ్య: ఈ మధ్యన  నాకో తెలివైన వ్యక్తి పరిచయం అయ్యారు. ఆయన తెలివిలో కొంచెం నాకు వచ్చింది.

రాజ్‌: అవునా ఇంతకీ ఎవరతను..?

కావ్య: రామ్‌ అని ఒక వ్యక్తి ఉన్నాడులేండి.

రాజ్‌:  ఈవిడతో కాస్త జాగ్రత్తగా ఉండాలి.( మనసులో అనుకుంటాడు)

కావ్య: అవును మీ ఇంట్లో ఆడవాళ్లు రాకుండా అసలు కూరగాయలే కొనడం రాని మిమ్మల్ని ఎందుకు మార్కెట్‌కు పంపించారు

రాజ్: రేపు గుడిలో అన్నదానం ఉంది అందుకే మార్కెట్‌కు నేను రావాల్సి వచ్చింది.

కావ్య: అవునా.. అసలు రేపు స్పెషల్‌ ఏంటండి

రాజ్‌: నాకు చాలా స్పెషల్‌

కావ్య: అదే ఏం స్పెషల్‌ అండి

రాజ్‌: అది రేపు మా అమ్మ  పుట్టిన రోజు

కావ్య: మీ అమ్మగారిదా..?

 రాజ్‌:  అవునండి ప్రతి సంవత్సరం అమ్మ పుట్టినరోజుకు నేను గుడిలో అన్నదానం చేస్తాను. కావ్య: అమ్మంటే మీ అమ్మేనా..?

రాజ్:  అవును.. అన్నదానం చేయడం నాకు చాలా ఇష్టం అండి

కావ్య:  ఈయనకు నిజంగానే గతం గుర్తు లేదా..? లేక గతం మర్చిపోయినట్టు నాతో ఫ్రాంక్‌ చేస్తున్నారా..? (అని మనసులో అనుకుంటుంది) ఏవండి మీ అమ్మగారు..

రాజ్‌ : నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయారండి.. ఆవిడ జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం అన్నదానం  చేస్తుంటాను

కావ్య: ఈయనకు నిజంగానే గతం గుర్తు లేదు ( మనసులో అనుకుంటుంది) అవును  అన్నదానానికి ఏమేం కూరగాయలు కావాలో మీకు తెలుసా అండి.

రాజ్‌: తెలియదు కళావతి గారు అందుకేగా మిమ్మల్ని హెల్ఫ్‌ అడిగింది.

కావ్య: అయితే నేను చెప్తాను ఉండండి..

 అంటూ కావ్య లిస్ట్‌ చెప్తుంటే.. రాజ్‌ ఈవిడ ఎక్కువ కొనేస్తుంది. ఎలాగైనా ఆపాలి అని రేపు వంటలు కూడా మీరే చేయాలి అని రాజ్‌ రిక్వెస్ట్‌ చేస్తాడు. నేను ఒక్కదాన్ని చేయలేను అంటుంది కావ్య. నేను హెల్ప్‌ చేస్తాను అంటాడు రాజ్‌. దీంతో కావ్య సరే అంటుంది. తర్వాత కూరగాయలు పార్శిల్‌ పంపిస్తామని షాప్‌ అతను చెప్పగానే రాజ్‌, కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంటికి వెళ్లిన రాజ్‌ ను యామిని కన్ఫీజ్‌ చేయాలనుకుంటుంది.

వైదేహి: ఏవండి ఇంట్లో కూరగాయలు అయిపోయాయి మార్కెట్‌కు వెళ్లి తీసుకురండి..

వైదేహి భర్త: బయట ఎండలు మండిపోతున్నాయి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టుకో..

వైదేహి: ఆన్‌లైన్‌లో అయితే ఫ్రెష్‌గా రావండి

యామిని: ఎందుకు మమ్మీ టెన్షన్‌ బావ ఉన్నాడుగా తీసుకొస్తాడులే.. బావ నువ్వు కూరగాయలు తీసుకురాలేదా.?

రాజ్: నేను కూరగాయలు తీసుకురావడం ఏంటి..?

యామిని: నువ్వు కూరగాయల షాపుకు వెళ్లావు కదా అందుకే అడుగుతున్నాను

రాజ్‌:  నేను కూరగాయల షాపుకు వెళ్లానని నీకెలా తెలుసు..? నేను ఎక్కడికి వెళ్లేది ఎలా తెలస్తుంది నీకు.

అంటూ రాజ్‌ కోపంగా అడిగే సరికి యామిని కంగారుపడుతూ.. ఫ్రెండును కలిసి వస్తుంటే నువ్వు అక్కడే కనిపించావు అందుకే అడిగాను అంటుంది. నేను అక్కడ ఫ్రెండును కలవడానికి వెళ్లాను అని రాజ్‌ చెప్పి లోపలికి వెళ్లిపోతాడు. మరోవైపు కావ్య షర్ట్‌ మీద ప్లవర్‌ వేస్తూ.. రాజ్‌ను గుర్తు చేసుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌  అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Continues below advertisement
Sponsored Links by Taboola