Brahmamudi Serial Today Episode: నందు కిడ్నాప్‌ కేసు పరిష్కరిస్తానని తన బాబాయ్‌తో కలిసి నందు దుగ్గిరాల ఇంటికి వెళ్తుంది. అక్కడ రేఖ వాళ్లు సుభాష్‌, అపర్ణను అనుమానిస్తుంటే.. నందు ఎంటర్‌ అయి వాళ్లను సేవ్‌ చేస్తుంది.

Continues below advertisement

రేఖ: ఎవరు మీరు

కానిస్టేబుల్‌: పోలీస్‌ డ్రెస్‌ చూసి కూడా ఎవరు మీరు అని అడుగుతున్నారా..?

Continues below advertisement

రేఖ: తెలుసు కానీ మీరు ఎందుకు వచ్చారు

నందు: అదే మేడం కిడ్నాప్‌ కేసును అన్‌ అఫీసియల్‌గా ఎంక్వైరీ చేయమన్నారు కదా..? అందులో మేము స్పెషలిస్టులం అందుకే టీంతో వచ్చాము త్వరలోనే వెతికి పట్టేసుకుంటాము.. ఏంటి అందరూ మీలో మీరే అలా చూసుకుంటున్నారు.. ఏంటి… కొంపదీసి ఇంట్లోనే దొంగ దొరికాడా ఏంటి..? మీ ముఖాలు చూస్తుంటే.. ఏదో హాట్‌ టాఫిక్‌ నడుస్తున్నట్టు ఉంది. ఏంటి విషయం ఆ కిడ్నాప్‌ చేసింది ఎవరో తెలిసిందా..?

రేఖ: చూడండి మీరు బయట వెతకడం మానేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు

నందు: కథ ఇక్కడే మొదలైంది.. కదా..? ఐ మీన్‌ కిడ్నాప్‌ జరిగింది మీ సమక్షంలోనే కదా అందుకే ఇక్కడికి వచ్చాను. చూడండి మీరంతా కో ఆపరేట్‌ చేస్తే చాల మంచిది

భ్రమరాంబ: ఎవరికి మంచిది..?

నందు: మీ ఇందు కోసం మీరు కోపరేట్‌ చేస్తే త్వరగా పట్టేసుకుంటాం..

భ్రమరాంబ:  ఇక్కడ వెతికినా ఏమీ దొరకదు.. మీరెళ్లి బయట వెతకండి

నందు: మీరు భలే మాట్లాడుతున్నారు.. ఇంతకీ కిడ్నాప్‌ అయిన ఇందుకు మీరు ఏమవుతారు

భ్రమరాంబ: పిన్ని అవుతాను.

నందు: ఓ ఇందు ఫాథర్‌కు తమ్ముడి భార్య అన్నమాట.

శేషు: కాదమ్మ నా భార్య

నందు: మీరు ఈ ఇంటికి ఏమవుతారు

శేషు: నేనే కాదమ్మ నా భార్య కూడా ఏమీ అవదు..

నందు: అది సరే కానీ మొత్తం ఇన్మఫర్మేషన్‌ కావాలి

ఐశ్వర్య: అవన్నీ నీకెందుకు

నందు: ఇదేం పబ్బు కాదు ఊరికే ఉండటానికి.. కిడ్నాపర్లును పట్టుకోవాలంటే నేను ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండి సెట్‌ చేస్తాను..

రేఖ: భూషణ్‌ తనకు కావాల్సింది చూడు

భూషణ్‌  నందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాడు.

భ్రమరాంబ: ఇంత హడావిడి చేస్తున్నావు ఇంతకీ నీ పేరేంటి..?

నందు: (నా నిజం పేరు చెబితే గుర్తు పడతారేమో..?) అప్పు

అంటూ అబద్దం చెప్పగానే.. అపర్ణ, సుభాష్‌ షాక్‌ అవుతారు. ఇందును రూంలో బంధించిన బయట భోజనం చేస్తుంటారు రాజు, లక్కీ. ఇంతలో రాజు ఇంకో ప్లేట్‌లో అన్నం తీసుకెళ్తుంటే..

లక్కీ: ఒరేయ్‌ ఇందాకే తిన్నావు కదరా.. మరో రౌండా..?

రాజు: పాపంరా ఆ అమ్మాయి తను కూడా ఏమీ తినలేదు కదా..?

లక్కీ: అలాగే సార్‌ గుర్రం గుడ్డిదైనా దాన తప్పదంటారు.. కదా పెట్టు.. అయినా ఈ ఫుడ్డు తను తింటుంది అంటావా..?

రాజు: ఇప్పుడావిడ కోసం ఫైవ్‌స్టార్‌ భోజనం తీసుకురావాలా… పెట్టడం మన బాధ్యత పెడుతున్నాం అంతే తింటే తినని లేకపోతే లేదు.. ఆవిడ కోసం నువ్వు ఎక్కువగా ఆలోచించకు

లక్కీ: ఆవిడ కోసం ఎక్కువగా ఆలోచించేది నేను కాదురా..? నువ్వు ఆలోచిస్తున్నావు.. తిట్టేటప్పుడు బాగానే తిడుతున్నావు కానీ ఇప్పుడు మాత్రం తెగ ప్రేమ చూపిస్తున్నావు..

అంటుండగానే.. రాజు మాత్రం ఇందు కోసం లోపలికి అన్నం తీసుకెళ్తాడు. రాజును చూసి నిద్రపోతున్నట్టు నటిస్తుంది ఇందు. నటించింది చాలు భోజనం చేయ్‌ అని రాజు చెప్పగానే.. ఇందు భోజనం చేస్తుంది. వాటర్‌ అని అడగ్గానే.. లక్కీ వాటర్‌ బాటిల్‌ తో ఇందుకు తాగిస్తుంటాడు. అప్పుడే ఇందు లక్కీ మాస్క్‌ లాగేస్తుంది. లక్కీ భయంతో రాజు మాస్క్‌ లాగేస్తాడు.

రాజు: ఒరేయ్‌ నా మాస్క్‌ ఎందుకు లాగావురా..?

లక్కీ: నేను ఎవరో తెలిసిపోయాక నువ్వు తెలియకుండా ఉంటావా… మావ అందుకే లాగేశాను.

ఇందు: ఓరేయ్‌ లక్కీ మీరు ఇంతకు తెగించారా..? మీ పని చెప్తాను..

అంటూ ఇందు తిడుతుంటే.. రాజు, లక్కీ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇది కూడా ఒకందుకు మంచిదేలే అనుకుంటూ ఇందు హ్యాపీగా ఫీలవుతుంది. బయటకు వెళ్లిన రాజు రేఖకు ఫోన్‌ చేసి ఇందును కిడ్నాప్‌ చేసింది తామేనని కోటి రూపాయలు ఇస్తే ఇందును వదిలేస్తామని చెప్తాడు. అయితే రాజు కాల్‌ ట్రేస్‌ చేయడానికి నందు ట్రై చేస్తుంది కానీ కాల్ ట్రేస్‌ కాదు. అదే విషయం రాజుకు చెప్పాలని ఐశ్వర్య ఫోన్‌ చేస్తే రాజు ఫోన్‌ లిఫ్ట్‌ చేయడు. మరోవైపు స్వాతి భయపడుతుంది. తాము ఏర్పాటు చేసిన వాళ్లు కాకుండా వేరే వాళ్లు అక్కను కిడ్నాప్‌ చేశారా ఏంటి..? అని ఆందోళన చెందుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!