Brahmamudi Serial Today Episode: రాజ్‌ గురించి అపర్ణకు చెప్పాలనుకుంటుంది అప్పు. అయితే కావ్యను అడిగి చెబితే బాగుంటుందని ఆలోచిస్తూ గార్డెన్‌లో ఉంటుంది. ఇంతలో కావ్య వచ్చి ఎందుకు ఇక్కడున్నావు ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది.

అప్పు: పెద్దత్తయ్య గారి పరిస్తితి ఏం బాగా లేదు అక్క.. ఏం తినడం లేదు. తాగడం లేదు. చివరకు మంచినీళ్లు కూడా తాగడం లేదు. ఇలాగే వదిలేస్తే ఏమై పోతారోనని భయంగా ఉంది అక్క

కావ్య: తెలుసు అప్పు.. కానీ ఏం చేస్తం.. అత్తయ్య సమస్యకు పరిష్కారం ఆయన ఒక్కరే ఆయన్ని తిరిగి తీసుకురావడానికి ఇంకా టైం పడుతుంది

అప్పు: కానీ అంత వరకు ఆవిడను అలాగే వదిలేయలేము కదా..? అత్తయ్య అలా బాధపడుతుంటే బావ బతికే ఉన్నాడన్న నిజం చెప్పేద్దామని నిన్ను అడక్కుండా చెప్పలేకపోయాను అక్క. రేపు అత్తయ్య పుట్టినరోజు అంట ప్రతి సంవత్సరం గుడిలో అన్నదానం చేసేవారంట. అదే విషయం ప్రకాషం అంకుల్‌ అడిగితే నా కొడుకు లేకుండా నాకు ఏ పుట్టిన రోజు అక్కర్లేదు అని రూంలోకి వెళ్లిపోయారు.

అని అప్పు చెప్పగానే అత్తయ్యతో నేను మాట్లాడతాను అంటూ కావ్య వెళ్లిపోతుంది. అపర్ణ రూంలోకి వెళ్లిన కావ్య.. అపర్ణను ఓదారుస్తుంది. రోజు రోజుకు ఎదుకిలా తయారవుతున్నారని ప్రశ్నిస్తుంది.

అపర్ణ: నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు కావ్య

కావ్య: భోజనం చేస్తే ఆ ఓపిక వస్తుంది అత్తయ్య

అపర్ణ: కన్న కొడుకు ఈ లోకానికే దూరం అయ్యాక వాడు చేసిన పనులను చూసి ఏ తల్లైన సంబరపడిపోతుందా..?

కావ్య:  అత్తయ్యా ఆయన లేరని ఎవరు చెప్పారు. రారని ఎందుకు అనుకుంటున్నారు. ఆయన బతికే ఉన్నారని తిరిగి వస్తారని  నేను ఎంత చెప్పినా మీరందరూ ఎందుకు నమ్మడం లేదు.

అపర్ణ:  ఎలా నమ్మమంటావే.. వాడు నీకు మాత్రమే కనిపిస్తూ ఈ ఇంట్లో ఎవరికీ కనిపించడం లేదంటే ఎలా నమ్మమంటావు. వాడి మీద ప్రేమతో వాడు బతికే ఉన్నాడన్న భ్రమలో మాట్లాడుతున్నావో లేక మాకు ధైర్యం చెప్పడానికి ఇలా మాట్లాడుతున్నావో అసలు నీ మానసిక పరిస్థితి ఏంటో కూడా నాకు అర్థం కావడం లేదు కావ్య

కావ్య: అంటే నేను పిచ్చి దానిలా కనిపిస్తున్నానా..? అత్తయ్యా

అపర్ణ:  అలాగే కనిపిస్తున్నావు. నిజంగా వాడు బతికే ఉంటే ఇంటికి ఎందుకు రావడం లేదు. తన కన్న వాళ్లను కూడా కాదని ఎక్కడో బయట బతకాల్సిన అవసరం ఏముంది చెప్పు.. చెప్పలేవు కదా..? నీ మాటే కాదు చివరికి ఆ దేవుడే వచ్చి చెప్పినా నేను కళ్లారా చూడకుండా నమ్మను. నిజంగా వాడు బతికే ఉంటే ఈ తల్లికి దూరంగా ఒక్క క్షణం కూడా ఉండడు.. కానీ ఎందుకు రాలేదు.. చెప్పు కావ్య ఎందుకు రాలేదు చెప్పు

కావ్య:  ఎందుకంటే ఆయన గతం మర్చిపోయారు అత్తయ్యా..

అపర్ణ:  ఏంటే నువ్వు మాట్లాడేది నిజం చెప్పవే

కావ్య:  అత్తయ్యా నేను ఎప్పుడైనా అబద్దం చెప్పానా..?

అని కావ్య యాక్సిడెంట్‌ జరిగిన తర్వాత యామిని రాజ్‌ను తీసుకెళ్లడం. డాక్టర్‌ రాజ్‌ కండీషన్‌ చెప్పడం. రోడ్డు తను పడిపోతే రాజ్‌ కాపాడటం అంతా చెప్తుంది కావ్య. దీంతో అపర్ణ షాక్‌ అవుతుంది. వెంటనే నేను రాజ్‌ను చూడాలని పట్టుబడుతుంది.

కావ్య: ఇప్పుడు వద్దులే అత్తయ్యా తర్వాత చూద్దురు..

అపర్ణ: నాకు అర్థమైంది కావ్య. నన్ను ఓదార్చడానికి నువ్వు ఈ కట్టు కథ చెప్తున్నావు కదూ

కావ్య: అదేం లేదు అత్తయ్యా మీరు నాకో మాట ఇస్తే నేను మీకు ఆయన్ని రేపే చూపిస్తాను.

అపర్ణ: ఏం మాట కావాలి అడుగు కావ్య..

కావ్య:  మీరు ఆయనతో గతం గురించి మాట్లాడను అని మాటిస్తేనే చూపిస్తాను.

అని కావ్య అడగ్గానే.. అపర్ణ సరే అంటుంది. దీంతో కావ్య కూడా రేపే మీకు ఆయన్ని చూపిస్తాను అంటుంది. తర్వాత రాజ్‌ను ఎలా ఒప్పించి అపర్ణకు చూపించాలి అని ఆలోచిస్తూ.. దేవుడా నువ్వే నాకో దారి చూపించాలి అని మొక్కగానే.. రాజ్‌, కావ్యకు ఫోన్‌ చేస్తాడు. ఎక్కడున్నావని అడుగుతాడు. ఇంట్లోనే ఉన్నానని.. వెజిటేబుల్‌ మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్తుంది. రాజ్‌ కూడా మా ఆంటీ ఇప్పుడే నన్ను మార్కెట్‌కు వెళ్లి వెజిటేబుల్స్‌ తీసుకురమ్మంది అని చెప్తాడు. కావ్యను మీరు ఏ మార్కెట్‌కు వెళ్తున్నారు అని అడగ్గానే కావ్య అడ్రస్‌ చెప్తుంది. నేను కూడా అదే మార్కెట్‌కు వస్తున్నాను అంటాడు రాజ్‌. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!