Brahmamudi Serial Today Episode: ఇందు కిడ్నాప్‌ విషయంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటారు. ఇంట్లో వాళ్లే ఎవరో ఈ పని చేసి ఉండాలని.. లేదంటే కిడ్నాపర్లకు హెల్ప్‌ చేసి ఉండొచ్చని అనుమానిస్తారు.

Continues below advertisement

స్వాతి: ( మనసులో) తెలిసే కదా అక్క తనను తాను కిడ్నాప్‌ చేసుకుంది. ఈ విషయం తెలిస్తే రేఖ ఆంటీ గుండె ఆగిపోతుందేమో..?

పోలీస్‌: మీరు ఫాంహౌస్‌లో బర్తుడే పార్టీ చేయాలని ఎప్పుడు అనుకున్నారు

Continues below advertisement

రేఖ: నిన్ననే  అనుకున్నాం సార్‌

పోలీస్‌: వాట్‌ నిన్నే అనుకున్నారా..?

శేషు: ఏంటి సార్‌ నిన్న ఏమైనా రాహుకాలం, యమగండం లాంటివి ఏమైనా ఉన్నాయా

పోలీస్‌: నోనో నా ఉద్దేశం అది కాదు. మీరు డిసైడ్‌ అయి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు. కానీ ఆ కిడ్నాపర్లు అక్కడకి వచ్చి కిడ్నాప్‌ చేయడంలోనే అనుమానం ఉంది

ఐశ్వర్య: ( మనసులో.. అమ్మో అటు తిరిగి ఇటు తిరిగి నేను ఇరుక్కునేలా ఉన్నాను.) అది కాదు సార్‌ మనకు ముఖ్యం అసలు ఎవరు కిడ్నాప్‌ చేశారు. ఎందుకు కిడ్నాప్‌ చేశారు అనేది తెలుసుకోవాలి

పోలీస్: అలా తెలియాలంటే ఇందు గారు కిడ్నాప్‌ అయిన విషయం పబ్లిక్‌ గా తెలియాలి

అపర్ణ: వెంటనే అలా చేయండి సార్‌ నా మనవరాలి క్షేమమే మాకు ముఖ్యం

పోలీస్: అలాగే వెంటనే చేస్తాం.. మీరు ఒకసారి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి కంఫ్లైంట్‌ ఇవ్వండి

రేఖ: నో కంప్లైంట్‌ ఇవ్వడం కుదరదు సార్‌. కంప్లైంట్‌ ఇస్తే ప్రాబ్లం అవుతుంది

పోలీస్‌: కంప్లైంట్‌ ఇవ్వకుండా మేము దీన్ని హ్యాండిల్‌ చేయలేం మేడం

రేఖ: నేను అసలు కంప్లైంట్‌ ఇవ్వను

అపర్ణ: ఎందుకు కంప్లైంట్‌ ఇవ్వవు..

రేఖ: ఇలాంటి విషయాలు పబ్లిష్‌ అయితే కంపెనీలో చాలా ప్రాబ్లమ్స్‌ వస్తాయి. కంపెనీ షేర్స్‌ పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మీరు సీక్రెట్‌గా వెతకండి

పోలీస్‌: సరే మేడం

అని చెప్పి వెళ్లిపోగానే.. స్వాతి హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటుంది. ఆఫీసియల్‌గా కంప్లైంట్‌ ఇవ్వలేదు కాబట్టి ఇందు అక్కకు తగినంత టైం దొరుకుతుంది. ఏదో ఒక ప్లాన్‌ చేస్తుంది అని మనసులో అనుకుంటుంది.

తర్వాత రూంలోకి వెళ్లిన అపర్ణను ఇందు గురించి ఏమైనా తెలిసిందా..? పోలీసులు ఏమంటున్నారు అంటూ  సుభాష్‌ ఆత్రుతగా అడుగుతాడు.

అపర్ణ: ఎలా తెలుస్తుందండి.. ఆ రేఖ పోలీసులకు కంప్లైంట్‌ ఇవ్వకుండా వెతకమని చెప్తుంది. ఇలా అయితే పోలీసులు ఎలా వెతుకుతారు. అనవసరంగా మనమే ఇందును ప్రమాదంలో పడేసినట్టు అయింది

సుభాష్‌: చ దేవుడు అనేవాడే లేడు.. మనం ఇంత చేసినా కూడా మనకు పరిస్థితులు అనుకూలించడం లేదు..

అపర్ణ: దేవుడిని తిట్టడం కన్నా ఆయన మీదే భారం వేస్తే బాగుంటుందండి..

అంటూ సుబాష్‌ను ఓదారుస్తుంది అపర్ణ.  ఇందును రూంలో బంధించిన రాజు బయట కూర్చుని కోటి రూపాయలు రాబోతున్నాయని కలలు కంటుంటాడు. అప్పుడే వాళ్ల నాన్న ఫోన్‌ చేసి రెండు రోజుల నుంచి ఇంటికి రావడం లేదు మళ్లీ ఏం ఘనకార్యం చేస్తున్నావు అంటూ తిడతాడు. దీంతో రాజు సాహు పని మీదే తిరుగుతున్నాను పని అయ్యాక వస్తానని ఫోన్‌ కట్‌ చేస్తాడు. ఇక రేఖ బర్తుడే పార్టీ సీసీటీవీ పుటేజీ చూసి ఇదంతా కావాలనే నాటకం ఆడారని భూషణ్‌కు చెప్తుంది. భూషణ్‌ కోపంగా లోపలికి వెళ్లి సుభాష్‌ను బయటకు ఈడ్చుకొస్తాడు. దీంతో అపర్ణ వచ్చి ఏంటి రేఖ ఇది అంటూ అడగడంతో మీరంతా కలిసే కిడ్నాప్‌ డ్రామా ఆడతారా..? అంటూ రేఖ తిట్టగానే.. అపర్ణ, సుభాస్‌ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!