Brahmamudi Telugu Serial Today Episode:  డైనింగ్‌ టేబుల్‌ దగ్గర తినకుండా కూర్చున్న ధాన్యలక్ష్మిని అపర్ణ ఏమైందని అడుగుతుంది. కళ్యాణ్‌ పెళ్లి విషయంలో పంతులు గారు చెప్పిన విషయం గురించే ఆలోచిస్తున్నారేమో అంటుంది కనకం.


ధాన్యలక్ష్మి: అవును.. కళ్యాణ్‌ ఇష్టపడ్డాడు కదా అని ఏమీ ఆలోచించకుండా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ ఇలాంటి దోషం ఉంటే ఇంటి పెద్దకు గండం అన్నారు. వాళ్ల కాపురం కూడా నిలబడదు అన్నారు. ఇన్ని అనర్థాలు చూసే బదులు ఈ పెళ్లి ఆపేయడమే మంచిది అనిపిస్తుంది.


కనకం: అవును లెండి. పెళ్లంటే నూరేళ్ల పంటలా ఉండాలి కానీ నట్టింట్లో మంటలా ఉంటే ఎలా?


అనగానే కళ్యాణ్‌ లేచి వెళ్లిపోతుంటే రాజ్‌, కావ్య ఆపుతారు. రాజ్‌ ఈ పంచాంగాల మీద నాకు నమ్మకం లేదు. పెద్దవాళ్ల కోసం మౌనంగా ఉన్నాను. నువ్వు హర్ట్‌ అవ్వాల్సిందేమీ లేదు అంటాడు.


కావ్య: అలాగైతే నాకు మీ అన్నయ్యకు ఏం చూడకుండానే పెళ్లి చేశారు. మేమిద్దరం ఇప్పుడు సంతోషంగా లేమా?


అంటూ కావ్య నచ్చజెప్పుతుంటే అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు.


రుద్రాణి: మీరు సంతోషంగా ఉన్నారా? హ్యాపీగా కాపురం చేసుకుంటున్నారా? ఈ మిరాకిల్‌ ఎప్పుడు జరిగిందబ్బా..


కావ్య:  ఏంటండి ఏం మాట్లాడరు అసలే మీ అత్తకు అనుమానాలెక్కువ? ఆవిడ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదని తెలసు కదా? నిజం చెప్పండి మీరు నామీద చూపించే ప్రేమ, ఆపేక్ష, అనురాగం, అభిమానం, ఆత్మీయత, ఆప్యాయత, అనుకూలత ఇవన్నీ నాలుగు గోడల మధ్యే చూపిస్తుంటే నలుగురికి అనుమానం వస్తుందని నేను చెప్తుంటే మీరు పట్టించుకోలేదు.


అని కావ్య చెప్తుంటే రాజ్‌ షాకింగ్‌ గా చూస్తుండి పోతాడు. కొద్ది రోజుల క్రితం కావ్య తాను కూడా నటించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో మీకు త్వరలోనే చూపిస్తానని చెప్పిన మాటలు రాజ్‌ గుర్తు చేసుకుంటాడు. అందరూ కలిసి కళ్యాణ్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. దీంతో కళ్యాణ్‌ కూల్‌ అవుతాడు. బెడ్‌ రూంలో ఉన్న కావ్య దగ్గరకు కోపంగా వస్తాడు రాజ్‌. ఎంటీ అంత కోపంగా ఉన్నారు అని అడుగుతుంది కావ్య. నిన్ను హనిమూన్‌కు తీసుకెళ్తానని నేనెప్పుడు చెప్పాను అంటూ గద్దిస్తాడు. కళ్యాణ్‌ కోసం తాతయ్య సంతోషంగా ఉండాలని ఆ మాటలు చెప్పానని కావ్య చెప్తుంది. దీంతో రాజ్‌ కూల్‌ అవుతాడు. రూంలో రెడీ అవుతున్న స్వప్న దగ్గరకు జూస్ తీసుకొచ్చి ఇస్తుంది కనకం. స్వప్నను రూంలోంచి బయటకు రావొద్దని చెప్పి వెళ్తుంది. మొక్కలు తీసుకుని వచ్చిన అప్పును ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండమని రిక్వెస్ట్‌ చేస్తాడు కళ్యాణ్‌. సరే అని ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు.  లోపల హోమం జరుగుతుంటుంది.


అపర్ణ: ఈ ఇంట్లో పెళ్లి అంటే చాలు ఒక అరిష్టం మొదలవుతుంది. మనింట్లో జరిగే ఆఖరి పెళ్లి వీడిదే.. ఘనంగా జరిపించాలనుకుంటే ఈ జాతకదోషం ఒకటి  అడ్డు పడింది.


సుభాష్‌: ఈ హోమం పూర్తయితే ఆ దోషమేదో పోతుంది కదా


అపర్ణ: ఎక్కడండి మళ్లీ ఏదో మొక్క నాటాలంటా.. అది పచ్చగా ఉండాలంట. వాడిపోతే ఈ పెళ్లి జరగదు అంటున్నారు. వాడు అనామిక మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ గండం కూడా గట్టెక్కితే చాలు కళ్యాణ్‌ కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరగాలి.


అని సుబాష్‌, అపర్ణ మాట్లాడుకుంటుటే పక్కనే నిలబడి వాళ్ల మాటలు వింటున్న కనకం జాతక దోషం కన్నా మందు మీ ఇంట్లో కనకం అనే గ్రహణం ప్రవేశించింది వదినగారు అది చచ్చినా వదలదు. అని మనసులో అనుకుంటుంది. ఇంతలో పంతులు హోమం అయిపోయింది. మొక్క నాటాలని బయటికి తీసుకెళ్లి కళ్యాణ్‌, అనామికలతో మొక్క నాటిస్తాడు. మొక్క నాటిన కళ్యాణ్‌ ఇక దోషం పోయినట్లేనా అని అడుగుతాడు. లేదని మొక్క రేపు ఉదయం వరకు పచ్చగా ఉంటేనే దోషం పోయినట్లు, మొక్క కానీ వాడిపోయిందంటే మీకు ఇక జన్మలో పెళ్లి చేయకూడదని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు.


కళ్యాణ్‌: నువ్వేం టెన్షన్‌ పడకు అనామిక. మన ప్రేమ నిజమే అయితే ఆ దేవుడే మన పెళ్లి చేస్తాడు.


కానీ ఈ కనకం ఆ పని జరగనివ్వదు కదా బాబు అని మనసులో అనుకుంటుంది.


ధాన్యలక్ష్మీ: నాకు అదే టెన్షన్‌గా ఉంది నా కొడుకు కోరుకున్నది జరగాలి దేవుడా?


కనకం: భగవంతుడు అనుకున్నదే జరుగుతుంది వదిన గారు.


రుద్రాణి: ఆ నోటికి మంచి మాటలు రావా?


కనకం: మీతోనే ఉంటున్నాను కదా సావాస దోషం అంటుకున్నట్లుంది.


అని చెప్పగానే అందరూ పదండి లోపలికి వెళ్దాం అంటూ వెళ్తారు. కనకం  నిమ్మ మొక్కను పరిశీలనగా చూస్తుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ అయిపోతుంది.