Prema Entha Madhuram August 16th: అంజలి తన అన్నతో నువ్వు ఇలా చేస్తున్నావన్న సంగతి అమ్మ వాళ్లతో చెబుతాను అనటంతో.. మదన్ కోపంతో రగిలిపోతూ.. నువ్వు నీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు నేను కూడా ఇలాగే చేస్తాను.. నా జోలికి రావద్దు.. నీ హద్దులో నువ్వు ఉండు అంటూ గెట్ అవుట్ అని అరుస్తాడు. దాంతో అంజలి.. నీ మంచి గురించి చెబితే వినట్లేవు కదా అని దీని ఫలితం అనుభవిస్తావు.. ఆర్య సర్ చేతుల్లో మీ పతనం ఖాయమని అంటుంది.


ఇక మాన్సీ అదంతా చూశాక తనకు సీన్ మొత్తం అర్థం కావడంతో.. వర్ధన్ ఫ్యామిలీలో చాలానే జరుగుతున్నాయే.. చెప్తానని పొగరుగా అనుకుంటుంది. ఇక ఛాయాదేవి అంజలిని తమ వైపుకు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అని మదన్ తో అంటుంది. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు తమకు సపోర్టుగా ఉంటే మరింత ప్లేస్ అవుతుందని అంటుంది. అప్పుడే మాన్సీ హలో ఫ్రెండ్స్ అంటూ ఎంట్రీ చేస్తుంది.


ఇక ఛాయాదేవి నువ్వు నీరజ్ ఫస్ట్ భార్యవి కదా అంటుంది. దాంతో మాన్సీ అవును అని.. కానీ ఇప్పుడు మీతో చేతులు కలపడానికి వచ్చిన వర్ధన్ ఫ్యామిలీ శత్రువుని అంటుంది. జరిగిందంతా తనకు అర్థమైందని.. మీరు నాకు అవసరం అని.. నేను కూడా మీకు అవసరమే అని.. అంటుంది. ఇక మదన్ తనను నమ్మొచ్చు అని అనటంతో ఛాయాదేవి తనతో చేతులు కలుపుతుంది.


చీకటి పడటంతో ప్రీతివాళ్ళు అనుకోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే అను బాబుకి తీసుకొని రావటంతో సంతోషంగా దగ్గరికి తీసుకుంటారు. ఇక దేవుడి దయవల్ల బాబు దొరికాడు అనడంతో.. కాదు ఆర్య సార్ అని అంటుంది అను. అప్పుడే ఆర్య, జిండే అక్కడికి రావడంతో ఆర్య కు థాంక్స్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. దాంతో ఆర్య వద్దు అని నీకే కష్టం వచ్చినా మేమున్నాము అని ధైర్యం ఇస్తాడు.


వాళ్ళు అక్కడినుంచి వెళ్లగా అను వాళ్ళు లోపలికి వెళ్తారు. అను పాప గురించి అడగటంతో లోపల నిద్రపోతుందని అంటారు. రేష్మ ఇదంతా తన నిర్లక్ష్యం వల్ల జరిగింది అని బాధపడటంతో అలా ఏమీ కాదు అనుకోకుండా జరిగింది అని.. పెద్ద ప్రమాదం తప్పింది అని అంటుంది. ఆర్య సర్ వల్ల బాబు దక్కాడు అని అంటుంది. అప్పుడే ఛాయాదేవి ప్రీతి ఫోన్ కి ఫోన్ చేసి భానుకి ఇవ్వమని అంటుంది.


ఇక అను ఫోన్ తీసుకోగా.. కిడ్నాప్ అయినా నీ బిడ్డ తిరిగి నీ దగ్గరికి చేరుకున్నాడు కదా ఫుల్ సంతోషంగా ఉన్నావు అంటూ.. ఈ సందర్భంగా ఒక ఈవెంట్ చేసి పెట్టు అని అంటుంది. దాంతో అను ఎవరు నువ్వు అని ఏం ఈవెంట్ చేయాలి అనడంతో.. చావు ఈవెంట్ అని అంటుంది. ఆ మాట విని అను షాక్ అవుతుంది. ఆ ఈవెంట్ ఆర్య వర్ధన్ ఇంట్లో చేయాలి అనటంతో అను ఎవరు నువ్వు అంటూ కోపంగా అడుగుతుంది.


ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ నీకు అర్థం అవుతుందా అని అనటంతో అన్ని అర్థమయ్యే మాట్లాడుతున్నాను మిస్సెస్ అనురాధ ఆర్య వర్ధన్ అనటంతో అను మరింత షాక్ అవుతుంది. తను షైలాభాను మాట్లాడుతున్నాను అని అంటుంది. ఇంతకు ఎవరు నువ్వు అనటంతో ఛాయాదేవి అని అంటుంది. వర్ధన్ ఫ్యామిలీలో జరుగుతున్న డ్రామా అంత తెలుసు అని.. మీ బాబు అని తెలిసే కిడ్నాప్ చేయించాను అని..  మీ ఇద్దరితో ఒక ఆట ఆడుకున్నాను అని అంటుంది.


ఇక మీ ఇద్దరినీ అంతం చేసేదాకా ఈ ఆట కొనసాగుతూనే ఉంటుంది అని అంటుంది. వెంటనే అను.. ఆర్య సార్ జోలికి వస్తే బాగుండదు అని.. అడ్రస్ పోతుంది అని గట్టిగా చెబుతుంది. కానీ ఛాయాదేవి.. మీరు ప్రాణాలు వదిలే వరకు వదలను.. ఈ ఛాయాదేవిని ఎదురుకోవడానికి సిద్ధంగా ఉండండి అని ఫోన్ కట్ చేస్తుంది.


దాంతో అను షాక్ అయ్యి కుప్పకూలుతుంది. వెంటనే ప్రీతి వాళ్ళు ఎవరు ఫోన్ చేశారు అని కంగారుగా అడుగుతారు. ఏమీ లేదు అని అను వాళ్లకు నిజం చెప్పదు. ఇక ఆర్య ఛాయాదేవి మాట్లాడిన మాటలు తలుచుకుంటాడు. జిండే కూడా ఛాయాదేవి గురించి మాట్లాడుతాడు. వెంటనే శారదమ్మ తనకు అంత పంతం ఎందుకు అని.. అసలు ఏం పగ ఉంది అని..  తను ఎవరు అని టెన్షన్ పడుతుంది.


ఇక నీరజ్ తనది కూడా బిజినెస్ శత్రువేమో అని అంటాడు. ఇక ఆర్య తన మనసులో మదన్ తో చేతులు కలిపింది అంటే అన్ని విధాలుగా ప్లాన్ చేసిన తర్వాతే నా ఎదుట పడింది అని అనుకుంటాడు. అప్పుడే అంజలి ఇంట్లోకి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావమ్మ.. ఏం జరిగింది అని శారదమ్మ అడగడంతో..  మదన్ ను కలిసి వస్తున్నాను అని భయపడుతూ చెబుతుంది.


తను మనందరితో మారినట్లు ఉండి ఛాయాదేవితో చేతులు కలిపాడు అని.. తను చేసిన పనికి నేను మీ అందరిని క్షమాపణలు అడుగుతున్నాను అని చేతులు జోడించి సారీ చెబుతుంది. దాంతో శారదమ్మ అవన్నీ పట్టించుకోకని అంటుంది. ఆర్య కూడా.. నీ పైన నమ్మకం ఉంది.. నువ్వు ఎప్పుడు ఎవరికీ సారి చెప్పకు మనమంతా ఒక ఫ్యామిలీ అని అనటంతో థాంక్స్ చెబుతుంది అంజలి.


ఇంతకు ఆ ఛాయాదేవి ఎవరు అని ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది అని అడగటంతో.. అదే తెలుసుకోవాలి అని ఆర్య అంటాడు. జిండే కి తను ఎవరు తన గురించి తెలుసుకోమని వివరాలు తీసుకొని రమ్మంటాడు. ఆ వివరాలు చూస్తే తను ఎందుకు టార్గెట్ చేస్తుందో తెలుస్తుందని అంటాడు. ఇక అను నిద్రపోగా తనకు బాబును ఎత్తుకెళ్లిన దృశ్యం, ఛాయదేవి మాట్లాడిన మాటలు కలలోకి రావడంతో గట్టిగా నో అని అరిచి లెగుస్తుంది. అప్పుడే ప్రీతివాళ్ళు ఏం జరిగింది అని అనటంతో ఆర్య సర్, పిల్లలు అని భయపడుతుంది. దాంతో ఏమీ కాదు అని ధైర్యంగా ఉండమని ఆర్య సార్ ఉండగా నీకు ఏమి జరగదు అని అంటారు. కానీ తను ఆర్యకు ఏం జరుగుతుందో అని భయపడుతుంది.


also read : Guppedantha Manasu: ‘గుప్పెడంత మనసు’ ప్రోమో: పతనమవుతున్న DBST కాలేజ్, రిషిధారా ఎంట్రీతో కీలక మలుపు?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial