Ammayi garu Serial Today Episode విరూపాక్షి, సూర్యప్రతాప్‌లను వదిలేసి అందరూ గుడికి వెళ్లిపోతారు. విరూపాక్షితో రూప నాన్నతో ఏదో ఒకటి మాట్లాడు అని చెప్తుంది. విరూపాక్షి సూర్యప్రతాప్‌తో కాఫీ తీసుకొస్తా అని అంటుంది. సూర్యప్రతాప్ ఏం అంటాడా అని మొత్తం ఫోన్‌లో చూస్తున్న రాజు, రూప, చంద్ర, సుమ, మందారం చూస్తుంటారు.
సూర్యప్రతాప్ కాఫీ వద్దని అంటాడు. ప్రతీ రోజు ఈ టైంకి తాగుతావ్ కదా నేను తీసుకొస్తా అని విరూపాక్షి వెళ్తుంది. రూప చూస్తూ అమ్మ కాఫీ ఇస్తే ఏం జరుగుతుందో అని రాజుతో చెప్తుంది. ఏం కాదులే అని రాజుతో పాటు అందరూ అంటారు. విజయాంబిక, దీపక్, కోమలిలు ఏదో జరుగుతుంది అని అనుకుంటారు. కోమలి అశోక్ గురించి మొక్కుతా అని వెళ్లిపోతుంది. విరూపాక్షి వెళ్లి కాఫీ ఇస్తుంది. సూర్యప్రతాప్ ఏం చేస్తాడా అని అందరూ టెన్షన్‌గా చూస్తారు. అందరి అంచనాలు తారుమారు చేస్తూ సూర్యప్రతాప్ విరూపాక్షి ఇచ్చిన కాఫీ తీసుకుంటాడు. రూప వాళ్లు చాలా సంతోషపడతారు. సూర్యప్రతాప్ తాగడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీలవుతారు. విరూపాక్షి ఆనందానికి అయితే అవథులే ఉండవు..వెనక్కి తిరిగి పొంగిపోతుంది. సూర్యప్రతాప్ విరూపాక్షిని చూస్తాడు. కాఫీ బాగుందా సూర్య అని విరూపాక్షి అడిగితే ఊ అని సూర్యప్రతాప్ అంటాడు.
టిఫెన్ ఏం చేయమంటావ్ సూర్య అని విరూపాక్షి అడుగుతుంది. వద్దు అని సూర్యప్రతాప్ అంటే నేను చేస్తే తినవా.. నన్ను నీ భార్యగా అనుకోవద్దు ఓ పనిమనిషిగా అనుకో అని అంటే ఈ మాటలే వద్దు అని సూర్యప్రతాప్ అనడంతో అయితే టిఫెన్ చేస్తా అని విరూపాక్షి గదికి వెళ్లి వేడి వేడి దోసెలు చేస్తుంది. రూప వాళ్లు నవ్వుకుంటూ ప్లాన్ సూపర్ అనుకుంటారు. విజయాంబిక, దీపక్‌లు చూసి రేయ్ దీపక్ వీళ్లు ఏదో చేస్తున్నారురా అని అని అనుకుంటారు. ఇక్కడేం చేస్తున్నారు అని అడిగితే సినిమా చూస్తున్నాం అని రూప అంటుంది. మేం చూస్తాం అంటుంది. సినిమా అయిపోయింది దర్శనానికి వెళ్దాం పదండి అని చంద్ర అంటాడు. వీళ్ల మాటలకు చెప్పే దానికి ఏం సంబంధం లేదురా ఎందుకో చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్లని హ్యాపీగా ఉండనివ్వకూడదు అని అంటుంది.
చంద్ర పూజ చేద్దాం అని అందర్ని గుడిలోకి తీసుకెళ్తాడు. తల్లీదండ్రులది, చిన్నాన్న పిన్నిది పేర్లు చెప్తుంది. రాజు రూపల పేర్లు చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. రాజు బావ భార్య పేరు రూప కదా. అందుకే చెప్పా.. ఎప్పటికైనా రూపనే రాజు బావ భార్య అని అంటుంది. సుమ కోమలితో నీ పేరు మీద మీ అక్క పూజ చేయిస్తుంది నువ్వు మొక్కుకో అని అంటుంది. విజయాంబిక రూప వాళ్లు సంతోషంగా ఉండకూడదు అని రాఘవ చనిపోవాలని తల్లీకొడుకులు కోరుకుంటారు. రాజు వాళ్లంతా సూర్యప్రతాప్, విరూపాక్షి కలవాలని కోరుకుంటారు. రూపని చూసిన కోమలి మీ ఇద్దరూ ఇంత సంతోషంగా ఉండటం నాకు ఇష్టం లేదు అని రూపని రాజు పక్కనుంచి నెట్టేస్తుంది. రూపని చూసి కన్నెగరేస్తుంది. రూప బాధపడటం చూసిన మందారం పంతులు శతకోపం పెట్టే టైంకి మందారం పిన్నుతో కోమలి కాలి మీద గుచ్చేస్తుంది. దాంతో కోమలి కింద ఒంగడంతో రూప, రాజులకు పంతులు దీవిస్తారు. కోమలి హర్ట్ అయి వెళ్లిపోతుంది. నా ఇంటికి వచ్చి నాకు వార్నింగ్ ఇస్తావా ఎక్కువ చేస్తే రూప 2.0 చూపిస్తా అంటుంది. దాంతో కోమలి నేను తలచుకుంటే రేపే నీకు రాజుని దూరం చేస్తా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.