Ammayi garu Serial Today Episode తల్లి విరూపాక్షి రావడంతో రూప ఎమోషనల్ అవుతుంది. తండ్రి తనని తన భర్తని విడదీశారని ఏడుస్తుంది. కూతురి గొంతు కోయడం న్యాయమా అని అంటుంది. దానికి విరూపాక్షి నేనేం తప్పు చేశానని మీ నాన్న నన్ను దూరం పెట్టారని అంటుంది. నన్ను దూరం చేయడానికి కారణం ఏం లేదు కానీ కేవలం మీ అత్తయ్య కారణంగా దూరం పెట్టారని అంటుంది.
విరూపాక్షి: నిన్ను రాజుని ఏ కారణంతో దూరం చేశారో అర్థం కావడం లేదు. ఒక్కోసారి మిమల్ని విడదీయడానికి ఆయన ఎవరని అనిపిస్తుంది.
రూప: చిన్నప్పటి నుంచి నాన్న కోసమే బతుకుతున్నా కానీ ఒక్క రాజు విషయంలో మాత్రం నాన్న మాట వినలేకపోతున్నా అమ్మ. అమ్మా నాకు రాజు కావాలి.
విరూపాక్షి: నీకు రాజు కావాలి అంటే నేను మీ నాన్న కలవాలి ఆ తర్వాతే నువ్వు రాజు కలవాలి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు రూప. ముందు నువ్వు రాజు కలవాలి. మీరు కలిసుంటే మమల్ని ఎప్పుడైనా కలుపుతారు అని మాకు నమ్మకం ఉంది. అన్నీ సర్దుకుంటాయి రూప.
రూప: నన్ను రాజుని కలుపమ్మా. ప్లీజ్
విరూపాక్షి: రూప నేనున్నాను కదా నేను చూసుకుంటాను.
రూప: విజయాంబిక అత్తయ్య ఏదేదో చేస్తుందమ్మా. నాటకాలు ఆడి నీ జీవితం నాశనం చేసినట్లే నా జీవితం నాశనం చేస్తుంది.
విరూపాక్షి: ఆ రాఘవ కనిపించే వరకు విజయాంబిక ఆటలు సాగుతాయి. అప్పటి వరకు నువ్వు సైటెంట్గా ఉండు.
గౌతమ్, విజయాంబిక ఇంటికి వస్తారు. తిరుపతి ప్రసాదం పద్మావతి తీసుకొచ్చిందని సూర్య ప్రతాప్ చేస్తాడు. దాంతో విజయాంబిక ఇంటికి విరూపాక్షి వచ్చిందా అని అనుకుంటుంది. ఇక సూర్యప్రతాప్ ఆఫీస్‌కి వెళ్తుండగా విజయాంబిక పడిపోయినట్లు నటిస్తుంది. అందరూ కంగారు పడతారు. నర్సుగా వచ్చిన పద్మావతిని పిలుస్తారు. పద్మావతి వచ్చి విజయాంబిక కాలు చూస్తుంది. ఆ టైంలో విజయాంబిక పద్మావతి మాస్క్ తీసేస్తుంది. దాంతో విరూపాక్షి అని అందరూ షాక్ అయిపోతారు.
సూర్యప్రతాప్: అంటే అప్పుడు నాకు కేర్ టేకర్‌గా ఉంది నువ్వా.
విజయాంబిక: ముమ్మాటికీ ఈ విరూపాక్షినే తమ్ముడు. నాకు తెలిసి ఆ రోజు నీ మీద విషప్రయోగం చేసింది కూడా తినే తమ్ముడు.
విరూపాక్షి: విజయాంబిక.
సూర్యప్రతాప్: ఎందుకు చేశావ్ ఇదంతా.
విజయాంబిక: ఇదంతా ఆ రాజు ప్లాన్ అయింటుంది తమ్ముడు.
విరూపాక్షి: అదేం లేదు సూర్య ఆ రోజు నీ పొజిషన్ చూసి దగ్గరుండి నీకు సేవలు చేయాలని అలా వచ్చాను.
సూర్యప్రతాప్ విరూపాక్షిని కొట్టడానికి చేయి ఎత్తితే రూప అడ్డుకుంటుంది. నా తల్లి వచ్చింది తన భర్తకి సేవ చేయడానికే కదా వచ్చింది. తన కూతురు ఆరోగ్యం బాలేదు కాబట్టి చూడటానికే కదా వచ్చింది అందులో తప్పు ఏముంది అని రూప అడుగుతుంది. ఇంతలో విజయాంబిక రూపని ఇలా రాజు, విరూపాక్షినే తయారు చేశారని అంటుంది. ఆడవాళ్లని కొట్టడం గురించి రూప తండ్రికి క్లాస్ ఇస్తుంది. తిరిగి కొట్టే అంత శక్తి ఉన్నా ఆడవాళ్లు నా భర్త, తండ్రి, అన్నాతమ్ముడు అని కొట్టినా ఏమీ అనుకోకుండా బరిస్తున్నారని అంటుంది. విజయాంబిక ఇంకా ఏదో తగిలించబోతే రూప చెప్పింది నిజమే అని సూర్యప్రతాప్ అంటాడు. విరూపాక్షితో నిజం చెప్పు అని తన మీద ఒట్టుపెట్టుకుంటాడు.
విరూపాక్షి: రాజు, రూప ఇద్దరూ కలిసే నన్ను నీ దగ్గరకు పంపించారు. నీ దగ్గర ఉన్నన్ని రోజులు నీ భార్యగా సేవలు చేయాలి అనుకున్నా అంతే.
సూర్య ప్రతాప్: భార్య ఆ మాటకు అర్థం నీకు తెలుసా. ఆ రాజు నీతో చేతులు కలిపి నా కూతురి జీవితం నాశనం చేయడమే కాకుండా నా జీవితం కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు.
రూప: నాన్న ఇది నా ప్లాన్.
విజయాంబిక: తమ్ముడు వాడు రూపని ఏదో మాయ చేశాడు.
సూర్యప్రతాప్: ఇంత వరకు నువ్వు చనిపోయావ్ అనుకున్నా ఇప్పుడు ఆ రాజు కూడా నా దృష్టిలో చనిపోయాడు.
విరూపాక్షి: సూర్య నేను వెళ్లిపోతా కానీ రాజుని రూపని విడదీయొద్దు.
సూర్యప్రతాప్: నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు.
రూప తల్లి దగ్గరకు వెళ్తుంటే సూర్యప్రతాప్ ఆపి ఈ నాన్న నీకు లేడు అనుకుంటే నువ్వు వెళ్లొచ్చని అంటే రూప ఆగిపోతుంది. దీంతో ఈ రోజు ఎపిసోడ్ పూర్తయిపోతుంది.