Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ పెళ్లి రోజు వేడుకకు ఒప్పుకుంటాడు. విరూపాక్షి, సూర్యప్రతాప్ ఇద్దరూ కేక్ కటింగ్‌కు వస్తారు. బంటి సూర్యప్రతాప్‌కి గిఫ్ట్ ఇస్తానని ఓ చార్ట్ ఇస్తాడు. సూర్యప్రతాప్, రూప, రాజు, విరూపాక్షి, బంటీ కలిసి ఉన్న స్కెచ్ బంటీ ఇస్తాడు. రూప బంటీకి అది ఇవ్వమని అంటాడు.
విరూపాక్షి డ్రాయింగ్ చూసిన సూర్యప్రతాప్కి కోపం వచ్చినా తర్వాత బంటీ, రూప, రాజుల్ని చూసి హ్యాపీగా ఫీలవుతాడు. బాగుందని బంటీకి చెప్తాడు. తర్వాత బంటీ విరూపాక్షికి ఇస్తాడు. చాలా బాగుందని విరూపాక్షి మురిసిపోతుంది. బంటీ అందరికీ చూపిస్తాడు. మరోవైపు అశోక్ గెటప్ మార్చుకొని ఫంక్షన్‌కి రావడం కోమలిని చూసి పక్కకి వెళ్లి నిల్చొంటాడు. కోమలి షాక్ అవుతుంది. కోమలి చేయి పట్టుకొని పక్కకి లాక్కెళ్తాడు.
అశోక్ కోమలితో కోము కోమలి నువ్వు బాగానే ఉన్నావా ఏమైంది అని అడుగుతాడు. ఎందుకు వచ్చావ్ అంటే నువ్వు ఫోన్ మాట్లాడటం లేదు అని భయంగా ఉందని అంటాడు. రాజుకి నీ మీద అనుమానం ఉంది.. ఆనంద్ కూడా మొత్తం చెప్పేశాడని నా ఫోన్ ట్యాప్ చేసుంటారని విజయాంబిక నీతో మాట్లాడొద్దని చెప్పిందని అంటుంది.
కేక్ కటింగ్‌కి అంతా ఏర్పాటు చేస్తారు. కోమలి లేదు ఏంటని విజయాంబిక, దీపక్ అనుకొని వెతకడానికి వెళ్తారు. కోమలి, అశోక్ మాట్లాడటం చూసి అక్కడికి వెళ్తారు. అశోక్ని చూసి షాక్ అవుతారు. రాజు కేక్ తీసుకొచ్చి పెడతాడు. రూప రాజుతో రాజు బావ ఈ సెలబ్రేషన్స్ ఇలా జరుగుతున్నాయంటే రూపక్కే కారణం తనకి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి కానీ తను ఎక్కడా కనిపించడం లేదని అంటుంది. దాంతో రాజు నేను పిలిచి వస్తానని అంటాడు.
దీపక్ అశోక్తో నువ్వు ఇక్కడికి రావడం ప్రమాదం కదా అంటే నా గురించి మీరేం టెన్షన్ పడకండి నేను నన్ను చూసుకుంటా అని అంటే విజయాంబిక లాగి పెట్టి కొట్టి ఏమనుకుంటున్నావ్రా.. దొరికితే నిన్ను చంపేయడమే కాదు మమల్ని చంపేస్తారు. ఇంకోసారి కోమలికి కాల్ చేసినా ఈ ఇంటి వైపు వచ్చినా చంపేస్తా అంటుంది. అశోక్‌ని వెళ్లిపోమనని చెప్తుంది. ఇంతలో రాజు అటువైపు రావడం దీపక్ చూసి తల్లికి చెప్తాడు. మనం దొరికిపోయాం ఇప్పుడే చేద్దాం అని కోమలి అంటుంది. రాజు వచ్చే సరికి అశోక్ దాక్కుంటాడు.
రాజు కోమలితో ఏంటి అంత కంగారు పడుతున్నావ్.. నీకు ఓ మాట చెప్పాలి నీ వల్లే ఈ ఫంక్షన్ జరుగుతుంది అందుకు థ్యాంక్స్ కానీ ఇంకో మాట.. వీళ్లు నిన్ను తెచ్చినట్లే ఇంతకు ముందు చాలా మందిని తీసుకొచ్చారు.. వాళ్లంతా శిక్ష అనుభవిస్తున్నారు. నీకు ఇంతకంటే పెద్ద శిక్షే పడుతుంది. అమ్మగారికి పెద్దయ్యగారిని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విడదీయలేరు. ఈ రోజు ఎలా అయినా ఇద్దరినీ కలిపి చూపిస్తా అని కేక్ కటింగ్‌కి పిలుస్తాడు. సూర్యప్రతాప్, విరూపాక్షి ఇద్దరూ కేక్ కట్ చేస్తారు. విరూపాక్షి సూర్యప్రతాప్ చేయి పట్టుకున్నా సూర్యప్రతాప్ ఏం అనడు. కేక్ ఒకరికి ఒకరు తినిపించుకోండి అని బంటీ చెప్పడంతో విరూపాక్షి సూర్యప్రతాప్‌కి కేక్ అందిస్తే సూర్యప్రతాప్ అయిష్టంగానే తింటాడు. రూప చాలా హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.