Ammayi garu Serial Today Episode విరూపాక్షి జరిగింది తలచుకొని ఏడుస్తుంటే రూప, రాజులు వెళ్తారు. నాన్న తిట్టాడు అని ఏడుస్తున్నావా అమ్మా అని రూప అడిగితే ఈ పాతికేళ్లలో నేను ఎదురైన ప్రతీ సారీ సూర్య నన్ను తిడుతూనే ఉన్నాడు.. తిట్టాడు అని బాధ పడటం లేదు ఇలా అయినా మాట్లాడుతున్నాడని అనుకున్నాను అని అంటుంది. 

కోమలికి అశోక్ కాల్ చేస్తూనే ఉంటాడు.. కోమలి కట్ చేస్తూనే ఉంటుంది. రాజు వాళ్లు తన ఫోన్ ట్రాప్ చేసుంటారు. కాల్ కట్ చేస్తే ఏదైనా ప్రాబ్లమ్ అయిపోతుందని అనుకుంటాడు ఏం చేయాలా అని కోమలి అనుకుంటుంది. విరూపాక్షి కోమలి గురించి ఎలా తెలుస్తుంది.. ఉన్న అవకాశం పోయింది అని ఏడుస్తుంది. దానికి రాజు కోమలి బాయ్‌ ఫ్రెండ్ అశోక్ ఉన్నాడు వాడిని తీసుకొస్తే అన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయని రాజు అంటాడు. ఆ అశోక్ కోమలి కోసం వస్తాడు కచ్చితంగా నాకు దొరికిపోతాడని రాజు అంటాడు. రాజు, రూప ఇద్దరూ విరూపాక్షికి ధైర్యం చెప్తారు.

విరూపాక్షి ఏడుస్తూ ప్రతీ రోజు రేపటి రోజున సూర్య కోసం దండం పెట్టుకునే దాన్ని. రేపు సూర్యని తీసుకెళ్లాలి అనుకున్నా ఇప్పుడు ఆ అవకాశమే లేదు అని ఏడుస్తూ వెళ్లిపోతుంది. దాంతో రూప రేపు అమ్మానాన్నల పెళ్లి రోజు కోమలి విషయంలో పడి ఆ విషయమే మర్చిపోయా.. ఎలా అయినా రేపు సెలబ్రేట్ చేయాలి అని ఏం చేయాలా అని రూప ఆలోచించి రాజుకి ఓ ఐడియా చెప్తుంది. 

కోమలిని చూసి మన ప్లాన్ వర్కౌట్ చేద్దాం అని కోమలి వినేలా.. రేపు కోమలికి చెక్ పెడతా రాజు.. రేపు అమ్మానాన్నల పెళ్లిరోజుని రేపు రాత్రి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తా. ఈ విషయం కోమలికి తెలీదు కాబట్టి కోమలి మీద నాన్నకి అనుమానం వస్తుంది నా మీద కోపం తగ్గిపోతుంది అని అంటుంది. రాజు తెగ నటించేస్తూ ఈ విషయం కోమలికి తెలీకూడదు అమ్మగారు.. కోమలి వినేస్తే తను ప్లాన్ చేసి మార్కులు కొట్టేస్తుంది అని అంటాడు. కోమలికి ఆ ఛాన్స్ ఇవ్వొద్దు ఫంక్షన్‌ చాలా గ్రాండ్‌గా చేద్దాం అని అంటుంది. కోమలి విని మీరు రేపు నైట్ ఫంక్షన్ చేసుకోండి రేపు ఉదయమే నేను అందర్ని పిలిచి సెలబ్రేట్ చేస్తా అని అనుకుంటుంది. 

రాజు రూపతో మీ ప్లాన్ సక్సెస్ అమ్మగారు.. రేపు ఫంక్షన్ జరుగుతుంది కుదిరితే కోమలికి తిట్లు అవుతాయి అని చెప్తాడు. ఆనంద్ వెళ్తూ దీపక్ తప్పించేశాడు ఈ సారి బలమైన సాక్ష్యాలు తీసుకెళ్లాలి అనుకుంటాడు. ఇంతలో దీపక్ ఎదురు వస్తాడు. ఆనంద్‌తో కోమలిని తీసుకొచ్చిందే నేనురా కోమలిని కాపాడకుండా ఎలా ఉంటాను అని అంటాడు. ఆనంద్ దీపక్‌తో రేపు కోమలి ఊరి వారిని తీసుకొస్తా.. తన కాలేజ్ యాజమాన్యాన్ని తీసుకొస్తా అప్పుడెలా ఆపుతావో చూస్తా అంటాడు. 

దీపక్ ఆనంద్‌తో మీ నాన్న రాఘవ నా దగ్గర ఉన్నాడు. ఆరోజు వాడిని కిడ్నాప్ చేసింది నేను ఈ రోజు నిన్ను కిడ్నాప్ చేస్తుంది నేనే అని ఆనంద్‌ని రాఘవని కట్టి పడేసిన దగ్గరే కట్టేస్తారు. రూప వేసిన వలలో పడిపోయిన కోమలి ఉదయమే ఇంటిని అలంకరించేసి అందర్ని పిలిచి డెకరేషన్ చేయించేస్తుంది. చంద్ర, సుమలకు అమ్మానాన్నల పెళ్లి రోజు కదా అందుకే ఇదంతా చేస్తున్నా అంటుంది. రాజు రూపలు మొత్తం చూస్తుంటారు. 

కోమలి సూర్యప్రతాప్‌ దగ్గరకు వెళ్తుంది. మీకో సర్‌ఫ్రైజ్ ప్లాన్ చేశా నాన్న మీరు ఫ్రెస్ అయి ఈ బట్టలు కట్టుకొని రండి అని కొత్త బట్టలు ఇస్తుంది. బంటితో చంద్ర రూప అమ్మ మీ అమ్మానాన్నల పెళ్లి రోజు చేస్తుందని చెప్పడం దీపక్, విజయాంబిక విని షాక్ అయిపోతారు. మనం వాళ్లని విడదీయాలి అనుకుంటే ఈ పిచ్చిది ఇలా చేస్తుంది ఏంటా అనుకుంటారు.  మందారం మనసులో కోమలికి ఈ రోజు మూడిందని అనుకుంటుంది. 

కోమలి విరూపాక్షి దగ్గరకు వెళ్లి అమ్మా హ్యాపీ యానివర్సిరీ అమ్మా నీకు నాన్నకి పెళ్లి రోజు జరిపిస్తున్నా త్వరగా ఈ కొట్ట బట్టలు కట్టుకొని రా అమ్మా అంటుంది. రాజు, రూపలు రాగానే మీరు షాక్ అయిపోతున్నారా.. ఇప్పుడు నేను మార్కులు కొట్టేస్తా.. నైట్ మీరు మాట్లాడుకున్నది అంతా నేను  వినేశా అని అంటుంది. రూప, రాజులు షాక్ అయినట్లు ఎక్స్‌ ప్రెషన్స్ ఇస్తారు. విరూపాక్షి రూపతో మా పెళ్లి రోజుని అది చేయడం ఏంటి అని అంటే దానికి రూప నాన్నకి మన మీద కోపంతో మనం ఏం చేసినా ఒప్పుకోరని కోమలికి గేలం వేశాం అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.