Ammayi garu Serial Today Episode : సూర్య ప్రతాప్ ఫ్యామిలీ మొత్తం కిడ్నాప్ అయినట్లు టీవీలో చూసి విరూపాక్షి షాక్ అయి పెద్దగా అరుస్తుంది. రాజుతో పాటు అందరూ అక్కడికి వస్తారు. విషయం తెలుసుకొని షాక్ అయిపోతారు. మావోయిస్టులు బాంబ్‌లతో దాడి చేశారని చెప్పడంతో ఇంటిళ్లపాది ఏడుస్తారు. రూప, సూర్యలకు ఏమైనా అయ్యుంటుందా అని విరూపాక్షి ఏడుస్తుంది.
రూపని, సూర్యప్రతాప్‌ని మావోయిస్టులు బంధించారని చెప్పడంతో గుండె ఆగినంత పని అయిపోతుంది. మరోవైపు సూర్యప్రతాప్ వాళ్లు పరుగులు తీస్తుంటారు. మావోయిస్టులుగా ఉన్న గౌతమ్, రేణుక, శ్వేతలు వాళ్లపై బాంబులు, గన్‌లతో దాడి చేస్తుంటారు. కాల్పులు జరుపుతుంటారు. రాజు రూపకి కాల్ చేస్తుంటాడు. రూప కాల్ లిఫ్ట్ చేసి భయంగా ఉందని ఏడుస్తుంది. చంపేసేలా ఉన్నారని నువ్వు రావొద్దని అంటుంది. ఇంతలో ఫోన్ కట్ అయిపోతుంది. అప్పలనాయుడు రాజుని వెళ్లమని కాపాడమని చెప్తాడు. విరూపాక్షి వెళ్లొద్దని ఏవో డిమాండ్‌లు ఉంటాయి వెళ్లొద్దని చెప్తుంది. నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అంటే అక్కడ ఉన్నది నా ప్రాణమే అంటాడు. ముత్యాలు, అప్పలనాయుడు మాత్రం వెళ్లి నీ ప్రాణాన్ని కాపాడుకో అంటారు. రాజు పరుగున బయల్దేరుతాడు. రాజుకి ఏమైనా అయితే ఎలా అని విరూపాక్షి ముత్యాలుకు తిడుతుంది.
సూర్యప్రతాప్ వాళ్ల మీద బాంబుల దాడి జరుగుతుంది. మావోయిస్టులుగా ఉన్న వాళ్లంతా సూర్యప్రతాప్, రూపలను చుట్టుముడతారు. విజయాంబిక వాళ్లు కావాలనే మమల్ని ఏం చేయొద్దని యాక్టింగ్ చేస్తారు. ఎవరు ఎవరు అని సూర్యప్రతాప్ అంటాడు. రూప మీకు ఏం కావాలి అంటే మీ నాన్న ప్రాణం కావాలి అంటాడు. మీలాంటి అసమర్థ సీఎం రాష్ట్రానికి ఉండకూడదని అంటారు. మా నాన్న బదులు నా ప్రాణం తీసుకోమని రూప అంటుంది. రూపని చంపడానికి రేణుక, శ్వేతలు సిద్ధపడతారు. నన్ను చంపండి అంటే నన్ను చంపండి అని సూర్యప్రతాప్, రూపలు అంటారు. ఇద్దరినీ చంపేస్తామని అంటారు. సూర్యప్రతాప్ వాళ్లకి మీ డిమాండ్‌లు చెప్పమని అంటాడు. వేసేయ్ మని జీవన్ సైగ చేస్తాడు. నా కూతురిని కాపాడుకోలేకపోతున్నాను అని సూర్యప్రతాప్ ఏడుస్తాడు. కూతుర్ని పట్టుకొని ఏడుస్తాడు. రూపని కాల్చాలని గౌతమ్ బులెట్ కాల్చగానే రాజు అడ్డు వస్తాడు. దాంతో బులెట్‌ని రాజు గుండెలుకు తగులుతుంది. రాజు పడిపోతాడు. సూర్యప్రతాప్, రూపలు ఎంత పిలిచినా రాజు లేవడు. పోలీసులు వచ్చి మావోయిస్టులుగా ఉన్న వాళ్లని తరిమేస్తాడు.
ఇక సూర్యప్రతాప్, రూపల్ని రాజు కాపాడినట్లు న్యూస్ రావడంతో అందరూ సంతోషిస్తారు. ఇక రాజుని మావోయిస్టులు కాల్చేశారని చెప్పడంతో ముత్యాలు, అప్పలనాయుడు పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తారు. అందరూ హాస్పిటల్‌కి పరుగులు తీస్తారు. ఇంతలో విరూపాక్షి వాళ్లని ఆపుతుంది. మీరు హాస్పిటల్‌కి వెళ్లొద్దని అంటుంది. అప్పలనాయుడు, ముత్యాలు మేం వెళ్లకపోతే ఎలా అమ్మగారు అని ఏడుస్తారు. అయినా సరే వెళ్లొద్దని విరూపాక్షి అంటుంది. నా మీద గౌరవం ఉంటే వెళ్లొద్దని కాదు కూడదు అంటే మీ ఇష్టం అని అంటుంది. దాంతో ముత్యాలు, అప్పలనాయుడు ఏడుస్తు ఉండిపోతారు.
రాజుని హాస్పిటల్‌కి తీసుకొస్తారు. రూప ఏడుస్తుంది. సూర్యప్రతాప్ కూతురితో రాజుకి ఏం కాదు అని ధైర్యం చెప్తాడు. డాక్టర్లు రాజుకి తగిలిన బులెట్ తీస్తారు. ప్రమాదం తప్పిందని డాక్టర్ చెప్తాడు. రూప రాజుని చూడటానికి వెళ్తుంది. రాజు చేయి పట్టుకొని రూప ఏడుస్తుంది. రూప అప్పలనాయుడికి కాల్ చేస్తే విరూపాక్షి ఫోన్ లిఫ్ట్ చేయొద్దని చెప్తుంది. అప్పలనాయుడు వాళ్లు షాక్ అయి ఏడుస్తారు. రాజు దగ్గరకు సూర్యప్రతాప్ కూడా వస్తాడు. ఇక రూప నేను ఇక్కడే ఉంటాను అంటే సూర్యప్రతాప్ వదిలి వెళ్లలేను అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.