Ammayi garu Serial Today Episode రాఘవ కోలుకోవడంతో రూప, రాజులు హాస్పిటల్‌కి వెళ్లి సూర్యప్రతాప్‌ని కూడా రమ్మని చెప్తారు. రాజు సూర్యప్రతాప్‌ని రిసీవ్‌ చేసుకోవడానికి బయటకు వెళ్తాడు. రూప ఒక్కర్తే రాఘవ దగ్గర ఉంటుంది. విజయాంబిక, దీపక్‌లు బయట సెక్యూరిటీతో రాఘవ లేచాడు మా తమ్ముడు వచ్చి మిమల్ని మెచ్చుకుంటారు. అంత వరకు మీరు టీ తాగి రండి అనిపంపేస్తుంది.

విజయాంబిక, దీపక్‌లు రాఘవ దగ్గరకు వెళ్తారు. రూప విజయాంబిక, దీపక్‌ని చూసి షాక్ అవుతుంది. రాఘవ కూడా భయపడతాడు. విజయాంబిక రాఘవతో నేను ఏంటో తెలిసి కూడా నా గురించి చెప్పాలి అనుకున్నావ్ అంటే నీకు ఎన్ని గుండెలురా నీ గుండె కొట్టుకోకూడదు అనిఅంటుంది. దీపక్ తలుపు వేస్తాడు. రూప విజయాంబిక దగ్గరకు వచ్చి బయటకు వెళ్లమని అంటుంది. సెక్యూరిటీని రాజుని పిలుస్తుంది. దీపక్ రూపని పట్టుకుంటే విజయాంబిక దీపక్ దగ్గరకు వెళ్లి నేను దయ తలిస్తే బతికిన వాడిని నా మీదే ఎదురు తిరుగుతావాఅంటుంది. రాఘవ విజయాంబిక ఈ రోజు ఏది ఏమైనా నీ గురించి పెద్దయ్యగారికి చెప్తావిజయాంబికఅనిఅంటాడు. నన్నే పేరు పెట్టి పిలుస్తావాఅనివిజయాంబిక రాఘవని కొడుతుంది.

మరోవైపు సూర్యప్రతాప్, చంద్ర ప్రతాప్ హాస్పిటల్‌కి వస్తుంటారు. రూప విజయాంబిక మీద అరవడంతో విజయాంబిక రూప గొంతు పట్టుకొని నలిపేస్తుంది. తర్వాత రాఘవ దగ్గరకు వచ్చి రాఘవని చూసి కోపంగా నువ్వు బతకకూడదురాఅనిపిడికిలి బిగించి రాఘవ గుండె మీద గట్టిగా గుద్దేస్తుంది. రాఘవ ఊపిరి అందక అలా ఉండిపోతాడు. అప్పుడే రాజు, సూర్యప్రతాప్‌ వాళ్లు వస్తారు. విజయాంబిక ఏం తెలీనట్లు రాఘవ రాఘవఅని పిలుస్తుంది. రాజు వచ్చి విజయాంబికను పక్కకు నెట్టి రాఘవని లేపాలని చూస్తాడు. రాఘవ ఉలుకు పలుకు లేకుండా ఉండిపోతాడు. రాజు రూపని పిలిచినా రూప అలా ఉండిపోతుంది. ఏం మాట్లాడదు.. రుక్మిణి అని గట్టిగా రాజు అరుస్తాడు.

రాజు రూపతో ఇప్పటి వరకు మాట్లాడిన రాఘవ ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగితే అత్త రాఘవ గుండెల మీద కొట్టిందని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. నేను రాఘవని ఎందుకు కొడతానుఅని కవర్ చేయాలని చూస్తుంది. అత్త చెప్తుంది అబద్ధం అని అత్త రాఘవని కొట్టింది అని రూప చెప్తుంది. ఇంతలో డాక్టర్ వచ్చి చూసి రాఘవ మళ్లీ కోమాలోకి వెళ్లిపోయాడని చెప్తాడు. ఇదంతా అత్త వల్లే దీనికి కారణం వీళ్లిద్దరే నన్ను నమ్ము నాన్న అని రూప ఏడుస్తుంది. ఎందుకు అక్క రాఘవ ఎదురైన ప్రతీ సారి అడ్డు పడాలి అనిచూస్తున్నావ్.. రాఘవ చెప్పే నిజానికి నీకు సంబంధం ఏంటి అని చంద్ర అడుగుతాడు. నాకేం సంబంధం లేదు అనివిజయాంబిక అంటే మరి ఎందుకు నువ్వు హాస్పిటల్‌కి వచ్చావ్అని సూర్యప్రతాప్‌ అడుగుతారు. రాఘవ స్ఫ్రుహాలోకి వచ్చాడని నీకు ఎవరు చెప్పారు.. చూడు రాఘవకి నీకు ఎలాంటి సంబంధం లేదు ఇంకోసారి నువ్వు ఈ హాస్పిటల్‌లో కనిపించడానికి వీల్లేదు బయటకు పొండి అని సూర్యప్రతాప్‌ పంపేస్తాడు.

సూర్యప్రతాప్‌ వాళ్లు కూడా వెళ్లిపోతారు. విజయాంబిక చేసిన దానికి రూప ఏడుస్తుంది. మిమల్ని ఒంటరిగా వదిలేసి తప్పు చేశానని రాజు అంటాడు. అత్తయ్యని దీపక్‌ని అంత ఈజీగా వదలను రాజు ఎందుకురా రూపతో పెట్టుకున్నానా అన్నట్లు చేస్తానని అంటుంది. విరూపాక్షి కొంత మందిని తీసుకొని ఓ కంపెనీకి తీసుకెళ్లి వాళ్లు నెల నెలా మీ కంపెనీలో జమ చేస్తున్నారు వాళ్లు ఆటోలు కొనుక్కోవాలని అనుకుంటున్నారు.. ఆటోలు కొనుక్కునేందుకు డబ్బు సాయం చేయమని చెప్తుంది. తర్వాత వాళ్లు జమచేస్తారు అని సీఎం ఫండ్ కూడా వచ్చేలా చేస్తానని అంటుంది. ఆయన ఒకే అనిఅంటారు. దీపక్ కోమలితో జరిగిందిచెప్తాడు. దీపక్, కోమలి, విజయాంబికమీటింగ్పెడతారు. మీమామయ్యరాకముందేమనంవెళ్లాంకాబట్టితప్పించుకున్నాం.. లేదంటేమనపరిస్థితిఏంటాఅనివిజయాంబికఅంటుంది. మీమామయ్యవిరూపాక్షికిదగ్గరవుతున్నవిధానంచూస్తుంటేవిరూపాక్షితప్పుచేసిందనినమ్మడంలేదు.. ఇకరూపముందేరాఘవనికొట్టాంకాబట్టిరూపకూడామనల్నివదలనుఅనిఅంటుంది. దీంతోఇవాళ్టిఎపిసోడ్పూర్తయిపోతుంది.