Ammayi garu Serial Today March 26th: అమ్మాయి గారు సీరియల్: రాజుని ఇంటికి తీసుకొచ్చిన సూర్య.. సీఎం పీఏ మాధవితో గేమ్ మొదలుపెట్టిన జీవన్!!
Ammayi garu Today Episode సూర్యప్రతాప్‌కి వశీకరణ మందు పెట్టమని జీవన్ మాధవి అలియాస్ రాధికకు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్‌తో పాటు రాజు ఇంటికి వస్తాడు. అన్నయ్య రాజుని అంగీకరించాడు అని చంద్ర ఇంట్లో వాళ్లతో చెప్తాడు. సుమ, మందారం అందరూ చాలా సంతోషిస్తారు. అదే మనసుతో పింకీ, గోపీలను క్షమిస్తే మాకు ఊరటగా ఉంటుందని సుమ అంటే ఆ రోజు త్వరలోనే వస్తుందని రూప అంటుంది. ఇక చంద్ర ఆ మాటలు ఇప్పుడు వద్దని రాజుని తీసుకొని వెళ్లమని రూపతో చెప్తాడు.
రాజు, రూపలు కలిసిపోవడంతో సంతోషంగా ఉందని మందారం అంటే విజయాంబిక, దీపక్‌లు రగిలిపోతారు. సీఎం పీఏ మాధవిని చంద్ర రాత్రి అయింది ఇంటికి వెళ్లిపోమని చెప్తాడు. రేపటి షెడ్యూల్ చెప్పి వెళ్తానని మాధవి చెప్పి విజయాంబిక వాళ్లకు సైగ చేస్తూ వెళ్తుంది. సూర్యప్రతాప్ విరూపాక్షి మాటలు తలచుకుంటాడు.
సూర్యప్రతాప్: పింకీ ప్రేమ విషయం అంగీకరించిన మాట వాస్తవమే కానీ ఆ ఇంటి మనిషిని పెళ్లి చేసుకొని ఒక బిడ్డ బాధ పడుతుంటే మరో బిడ్డను అదే ఇంటికి ఎలా పంపాలి. పింకీ సంతోషంగా ఉండాలి అనే కదా మరో సంబంధం చూశాం.
రూప: రాజు ఏదైతే ఏంటి నాన్న నిన్ను అంగీకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది.
సూర్యప్రతాప్: నా మాటకు విలువ లేకుండా చేసి పింకీని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసిన ఆ రాజుని జీవితంలో క్షమించకూడదు అనుకున్నా కానీ నా చేతే ఆ రాజుని ఇంటికి పిలిపించేలా చేశారు.
రాజు: పెద్దయ్య గారు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించలేదు అమ్మాయిగారు కనీసం మనస్ఫూర్తిగా నన్ను ఇంటికి రమ్మని పిలవకుండా చిన్నయ్యగారితో పిలిపించారు.
మాధవి: సీఎం గారు ఫ్రెస్టేషన్‌లో ఉన్నారు ఇప్పుడు నేను మాట్లాడటం కరెక్ట్ కాదు.
రాజు: నేను ఇక్కడ ఉంటే అక్కడ బంటీ ధైర్యంగా ఉండలేడు అమ్మాయిగారు. ఇంతకాలం అమ్మ దగ్గర లేకపోయినా నాన్న దగ్గర ఉండే వాడు. కానీ ఇప్పుడు నేను లేకపోతే ఉండలేడు.
రూప: బంటీ గురించి నాన్నకి చెప్దాం రాజు.
రాజు: బంటీని తీసుకొస్తే పెద్దయ్యగారు అంగీకరిస్తారు కానీ రాఘవ ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు రాఘవని ఏం చేయకుండా ఉన్నారు అంటే దానికి బంటీనే కారణం.
సూర్యప్రతాప్: రూప నేను మీకు నా మనసులో మాట చెప్పాలి అని వచ్చాను. నేను నా సొంత ప్రయోజనాల కోసం ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. కానీ ఆ విరూపాక్షి అలా కాదు. తను మాత్రం తను అనుకున్నది చేయాలి అనుకొనే మా పార్టీలో చేరింది. నేను ఓ ప్రజాప్రతినిధిగా ఆ జంట ప్రేమ అంగీకరిస్తే తను నిన్ను అంగీకరించేలా చేసింది. నేను నిన్ను తప్పని పరిస్థితిలో యాక్సెప్ట్ చేశా కానీ మనస్ఫూర్తిగా కాదు.
రాజు: నాకు తెలుసు పెద్దయ్యా.
విజయాంబిక: విరూపాక్షి ఇప్పుడు ఇంతకు మించి ఏం చేయగలదు తమ్ముడు. అలాంటి సభలో ఇలా చేసింది అంటే తన సంస్కారం ఏంటో తెలుస్తుంది.
రూప: అత్తయ్య మీరు సంస్కారం గురించి మాట్లాడొద్దు. మా నాన్న మిమల్ని ఇంటిలో ఉంచింది మీ సలహాల కోసమో మీ ఇంటి పెత్తనం కోసమో కాదు. మీ వల్ల మందారానికి ఏ హాని కలగకూడదు అని ఇంట్లో ఉండనిచ్చారు. మీ హద్దులు తెలుసుకొని ఎంతలో ఉండాలో అంతలో ఉంటే అందరికీ మంచిది.
విజయాంబిక: చూశావా తమ్ముడు మేం చేసిన చిన్న తప్పు వల్ల నేను అందరికీ ఎంత లోకువ అయిపోయానో.
సూర్యప్రతాప్: ఆపు నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. క్షమించరాని తప్పు కూడా కాదు.
మాధవి: సార్ నేను మీ ఫ్యామిలీ గురించి చాలా తెలుసుకున్నాను. మీ కూతురు మీ సేవకుడు రాజు వీళ్ల గురించి చాలా తెలుసుకున్నాను. గొప్పగా ఉంది సార్. మీ మాట దాటని కూతురు మీ మాట కోసం అడ్డంగా నిలబడిపోయే మీ పీఏ రాజు. ఈ ప్రపంచంలో ప్రాణంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని తల్లిదండ్రుల మాట కోసం దూరంగా ఉండే ఒక్క జంట కనిపిస్తుందా సార్. కానీ అలాంటి జంట మీ ఇంట్లో కనిపిస్తుంది సార్. రాజు గురించి విన్న తర్వాత నేను ఎలా నడుచుకోవాలో తెలిసింది సార్.
సూర్యప్రతాప్: ఆపు మాధవి నువ్వు సీఎంకి మాత్రమే పీఏవీ. ఈ సూర్యప్రతాప్‌కి కాదు. చూడండి ఎవరు ఎంతలో ఉండాలో తెలుసుకొని నడుచుకోండి. నాన్న అన్న మాటలకు బాధ పడొద్దని రూప రాజుతో చెప్తుంది. రాజు రాఘవ గురించి ఆలోచిస్తున్నా అని జీవనే రాఘవని దాచేసుంటాడని అనుకుంటారు. ఉగాది అందరం కలిసి చేసుకోవాల్సింది కానీ మనం ఇక్కడ అత్తయ్య వాళ్లు అక్కడ అని బాధ పడుతుంది.
జీవన్ మాధవిని కలుస్తాడు. మాధవి అసలు పేరు రాధిక జీవన్ పంపిన ఫేక్ పీఏ అసలైన పీఏ మాధవి స్థానంలో రాధిక వెళ్తుంది. విరూపాక్షితో జాగ్రత్తలు చెప్పిన జీవన్ రాధికకు వశీకరణ మూలికలు ఇచ్చి సూర్యప్రతాప్కి తినేలా చేయమని అప్పుడు ప్రజలు ప్రజలు అనే సూర్యప్రతాప్ మాధవి మాధవి అని నీ వెంట తిరుగుతాడని చెప్తాడు. ఉగాది పచ్చడిలో మూలికలు కలిపేయమని చెప్తాడు. ఎలా అయినా ఈ ప్రయత్నం ఫలించాలి అని చెప్తాడు. అంతేకాకుండా రేపు విరూపాక్షి సూర్యప్రతాప్ ఇంటికి వస్తుందని అప్పుడు ఏం చేయాలో చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: త్రిపుర అఖండ జ్యోతి దీక్ష నెరవేరిందా...? ఆమెకు ఎదురైన అడ్డంకులు ఏంటి..?