Ammayi garu Serial Today Episode జీవన్ జైలులో నుంచి ఇదంతా చేస్తున్నాడు అంటే మన ఇంట్లో జరిగింది అంతా ఎవరో చేరవేస్తున్నారని సుమ, చంద్ర అంటారు. విజయాంబిక తమ మీదకు అంతా వస్తుంది అని కొడుకుతో చెప్పడంతో దీపక్ వెంటనే విషయం మార్చేస్తా అని ఇదంతా పంతులు వల్లే జరిగింది అని డైవర్ట్ చేసేస్తాడు.
రుక్మిణి, చైతన్యల పెళ్లికి ముహూర్తం కాసేపట్లో ఉందని అంత వరకు రెస్ట్ తీసుకోండి అని పంతులు అనడంతో విరూపాక్షి రుక్మిణిగా ఉన్న రూప, రాజు, మందారం రూప గదికి వెళ్తారు. రాజు పెళ్లి ఆపాను నీ పెళ్లి కూడా ఆపుతాను రూప అని విరూపాక్షి అంటుంది. ఇక సడెన్‌గా ఎక్కడికి వెళ్లావ్ ఏమైంది అని రూప తల్లిని అడుగుతుంది. దాంతో విరూపాక్షి జరిగింది అంతా చెప్తుంది. కీర్తి దీప్తి అని జీవన్ మనిషి అని తెలుసుకున్న తాను దీప్తిని ఈడ్చుకుంటూ వస్తే ఎవరో తల మీద కొట్టి తనని ఒక చోట బంధించారని చెప్తుంది. ఎలా తప్పించుకున్నారని రాజు అడగటంతో నన్ను ఆనంద్ తప్పించాడని చెప్తుంది. రాజు వాళ్లు ఆనంద్‌నా అని షాక్ అవుతారు.
ఫ్లాష్ బ్యాక్‌లో విరూపాక్షిని జీవన్ మనుషులు తీసుకెళ్లడం ఆనంద్ చూస్తాడు. ఆ రౌడీలను చూసి తన తండ్రి ఆచూకి తెలుస్తుందని ఫాలో అయితే ఆనంద్‌కి విరూపాక్షి కనిపిస్తుంది. అమ్మగారిని కాపాడాలి అని వాళ్లని కొట్టి విరూపాక్షిని విడిపిస్తాడు. ఇద్దరూ తప్పించుకుంటారు. ఆనంద్ వస్తే మళ్లీ విజయాంబిక తప్పు దోవ పట్టిస్తుందని ఆనంద్ లోపలికి రాలేదని చెప్తుంది. ఇక గంటలో ఉన్న రూప పెళ్లిని ఎలా ఆపుతాం అని అనుకుంటారు.
విరూపాక్షి రాజు, రూపలతో మనం అంతా వెళ్లి చైతన్య తల్లిదండ్రులతో మాట్లాడుదామని వెళ్తారు. విజయాంబిక వాళ్లు కూడా చైతన్య వాళ్ల దగ్గరకు వస్తారు. విరూపాక్షి చైతన్య తల్లితో ఈ పెళ్లి జరగకూడదు అని చెప్తుంది. ఈ పెళ్లి జరిగితే మనం అందరం మోసపోతాం అని అంటుంది. చైతన్య తండ్రి విషయం సూటిగా చెప్పండి అంటాడు. దాంతో విరూపాక్షి రుక్మిణి రుక్మిణి కాదు రూప అని చెప్తుంది. విజయాంబిక, దీపక్‌లు ఆ మాటలు విని షాక్ అయిపోతారు. విజయాంబిక కొడుకుతో నేను చెప్పా కదా అది రుక్మిణి కాదని దాన్ని నా చేతులతో నేనే చిన్నప్పుడే చంపేశా అంటుంది. ఇదంతా నిరూపించాలి అంటే వీడియో తీయాలి అని దీపక్ వీడియో తీస్తాడు.
విరూపాక్షి వాళ్లతో ఈ రూప రాజు భార్య. మేం కొన్ని నిరూపించాల్సిన విషయాలు ఉండటం వల్ల రూప రుక్మిణిగా మారిందని చెప్తారు. ఈ పెళ్లి ఆపండి అని రాజు కూడా చెప్తాడు. ఇంతలో విజయాంబిక చప్పట్లు కొట్టుకొని వచ్చి విరూపాక్షి కథ సూపర్.. రూప నువ్వు కూడా అదరగొట్టేశావ్ మా అందరితో పాటు మీ నాన్నని కూడా వెర్రి వాడిని చేసేశావ్ అంటుంది. చైతన్యతో విజయాంబిక ఈ పెళ్లి చేసుకోమని అంటుంది. ఇక దీపక్ ఈ నిజం సూర్యప్రతాప్‌కి చెప్పాలని అంటాడు. విరూపాక్షి వద్దని నిజం తెలిస్తే సూర్య గుండె ఆగిపోతుందని అంటుంది. విజయాంబిక, దీపక్‌లు నిజం చెప్పేస్తాం అని వెళ్తుంటే రాజు, రూప, విరూపాక్షి బతిమాలుతారు. ఇంతలో మందారం వాళ్ల తల మీద కొట్టి రాజుకి ఫోన్ తీసుకోమని అంటుంది. తల్లీకొడుకుల్ని ఓ గదిలో బంధించేస్తారు.
ముహూర్తానికి టైం అయిందని సుమ, చంద్ర వచ్చి రుక్మిణిని తీసుకెళ్లిపోతారు. రూప బాధ పడుతూనే కూర్చొంటుంది. చైతన్యని పిలవడానికి వెళ్లిన చంద్ర అక్కడ ఓ లెటర్ చూస్తాడు. అన్నయ్యా అని పరుగులు పెడతాడు. చైతన్య కనిపించడం లేదని చెప్తాడు. రూప వాళ్లు చాలా సంతోషపడతారు. చైతన్య పెళ్లి ఆపేస్తానని తన తల్లిదండ్రులతో చెప్పి లెటర్ రాసి వెళ్లిపోదాం అని వెళ్లిపోతారు. రూప మనసులో మా పరిస్థితిని అర్థం చేసుకొని నా జీవితాన్ని నాకు ఇచ్చి వెళ్లిపోయావ్ నీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అనుకుంటుంది. ఒకే ముహూర్తంలో రెండు పెళ్లిళ్లు చేయాలి అనుకున్నా ఒకటి కూడా చేయలేకపోయాను అని సూర్యప్రతాప్ బాధ పడతాడు.
బంటీ తాతతో అయ్యో తాతయ్య మీరు రెండు పెళ్లిళ్లు చేయాలి అనుకోలేదు మా నాన్నకి రుక్మిణి అమ్మకి పెళ్లి చేయాలి అనుకున్నారు. ఇప్పుడు ఇద్దరి పెళ్లిళ్లు ఆగిపోయావి కదా మీకు అభ్యంతరం లేకపోతే మా నాన్నకి రుక్మిణి అమ్మని ఇచ్చి పెళ్లి చేయండి తాతయ్య అంటాడు. నాన్నని నేను ఒప్పిస్తా రుక్మిణి అమ్మని కూడా నేనే ఒప్పిస్తా అంటాడు. సూర్యప్రతాప్ రుక్మిణితో నువ్వు ప్రేమించిన వాడు నిన్ను మోసం చేస్తే నేను నమ్మిన వాడు నన్ను మోసం చేశాడు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: మహి కారుని ఆటోలా వాడేసుకున్న మధుమిత.. దేవా హోంమంత్రి.. శ్రియ ఎవరో తెలుసా!