Ammayi garu Serial Today Episode మందారం ఇచ్చిన పాలు ఫస్ట్‌నైట్ గదిలో రూప, రాజులు తాగేస్తారు. తర్వాత ఇద్దరూ ఫస్ట్‌నైట్ వద్దనుకొని చెరో వైపు తిరిగి పడుకుంటారు. కానీ మందారం కలిపిన పౌడర్ ఫలితంగా ఇద్దరూ చలి అనుకొని ఒకరిని పట్టుకొని ఒకరు పడుకుంటారు. ఉదయం ఇద్దరూ నిద్ర లేచి తమకు ఫస్ట్ నైట్ అయిపోయిందని బిత్తర పోతారు. ఇలా ఎలా జరిగింది అనుకొని కంగారుపడతారు. మనకు తెలీకుండానే ఇలా అయిపోయిందేంటి అనుకొని టెన్షన్ పడతారు. అయిందేదో అయిపోయింది ఇక ఇలాంటివి వద్దని రూప చెప్తుంది. దీని గురించి ఇక్కడే మర్చిపోదాం అంటుంది.
మందారం విరూపాక్షికి కాల్ చేసి ప్లాన్ సక్సెస్ అయిందని చెప్తుంది. దీపక్, విజయాంబికలు ఆ మాటలు విని మందారాన్ని అంత ఈజీగా వదలకూడదని సమయం చూసి మందారం అంతు చూడాలని అనుకుంటారు. ఇక ముత్యాలు ఇంట్లో అందరూ చాలా సంతోషపడతారు. మందారం వల్లే అంతా సాధ్యమైందని అనుకుంటారు. అందరికీ స్వీట్ చేస్తానని విరూపాక్షి వెళ్తుంది. జీవన్, గౌతమ్, శ్వేతలు మాట్లాడుకుంటారు. మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయితే ఓకే లేదంటే సూర్యప్రతాప్ ఉంచడని జీవన్ అంటే అంతా మా చిన్న మామయ్య చూసుకుంటాడని గౌతమ్ అంటాడు. ఇక వార్తల్లో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రకటించాయని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది.
అది చూసి సూర్యప్రతాప్ ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోతారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని రాజు అంటాడు. విరూపాక్షి, ముత్యాలు వాళ్లు కూడా న్యూస్ చూసి బిత్తరపోతారు. ఇదేంటి అని అనుకుంటారు. గౌతమ్ చిన్నాన్నగా పోసాని రెచ్చిపోతాడు. సీఎం వేస్ట్ అని ఆయన అర్హుడు కాదని మీడియాలో రెచ్చిపోతాడు. గౌతమ్ వాళ్లు చూసి సంతోషపడతారు. సీఎంని వ్యతిరేకించి సొంత పార్టీ ఎమ్మెల్యేలే సంతకాలు పెట్టారని చెప్తారు. దాంతో సూర్యప్రతాప్ మరీ షాక్ అయిపోతాడు. ఏదో పొరపాటు జరిగిందని ఎమ్మెల్యేలతో మాట్లాడుదామని చంద్ర చెప్తాడు. ఇక రాజు అయితే ఇదంతా జీవన్ పనే అయింటుందని అంటాడు. పింకీ కూడా అవునని వాడు మీ పెద్దనాన్నని సీఎం పదవి నుంచి దించేస్తానని చెప్పాడని అంటుంది.
ఎలక్షన్ టైంలో జీవన్, గౌతమ్ ప్రచారం చేశారని ఇప్పుడు వాళ్ల ఇన్ఫులియన్స్‌తో ఇదంతా చేశారని అంటాడు. ఇక శ్వేత సూర్యప్రతాప్ వాళ్లు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియాలి అంటే విజయాంబిక మన పక్కన ఉండాలని చెప్పడంతో జీవన్ విజయాంబికకు కాల్ చేస్తాడు. తల్లీకొడుకులు ఫోన్ రావడంతో పక్కకు వెళ్తారు. ఇక ఇంట్లో అందరికీ ఈ విషయం మీద కాల్స్ వస్తుంటాయి. జీవన్‌తో మాట్లాడటానికి విజయాంబికి ఒప్పుకోదు కాల్ కట్ చేస్తా అంటే మాతో చేతులు కలపకపోతే కాళ్లు పట్టుకోవాల్సి వస్తుందని అంటాడు. దీపక్ కూడా ఇష్టం వచ్చినట్లు జీవన్‌ని తిడతాడు. దాంతో జీవన్ మీకు కావాల్సిన రాఘవ మా దగ్గర ఉన్నాడని చెప్తాడు. దీపక్ నమ్మకపోతే జీవన్ వీడియో కాల్ చేసి రాఘవని చూపిస్తాడు. దీపక్, విజయాంబిక షాక్ అయిపోతారు. జీవన్ దీపక్‌కి లొకేషన్ పంపించి అక్కడికి రమ్మని చెప్తాడు. దీపక్ మాటలు విన్న మందారం వాళ్లని ఫాలో అవుతుంది. రూప తండ్రితో ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి లేదంటే బెదిరించి ఇలా చేసుకుంటారని అంటుంది. వాళ్లతో మాట్లాడుదామని అంటే సూర్యప్రతాప్ వద్దని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.