Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ పోలీసులతో వెళ్లిపోతారు. రూప మాధవిని లాగి పెట్టి కొడుతుంది. నువ్వు చేసిన పనికి చంపేయాలి.. దేవుడి లాంటి మా నాన్నని అన్యాయంగా అరెస్ట్ చేయించావ్.. మా నాన్న కన్నతల్లిలా భావించే పార్టీ సభ్యుల ముందు నీచంగా అవమానించేలా చేశావ్.. మా నాన్న ఎంతో బాధ్యతగా చూసే సీఎం పదవికి రాజీనామా చేసేలా చేశావ్ చెప్పు ఎందుకు ఇలా చేశావ్ చెప్పు అని రాధిక చెంపలు రూప వాయించేస్తుంది.
రాధిక: ఇందులో నేను చేసిన తప్పేముంది. మీ నాన్నకి నేను అంటే చాలా ఇష్టం. నాకు కూడా మీ నాన్న అంటే అంతే ఇష్టం. మా మధ్య ఈ రోజు కొత్తగా ఈ సంబంధం ఏర్పడలేదు. నేను పర్సనల్ సెక్రటరీగా వచ్చినప్పటి నుంచి ఉన్న సంబంధం కాదిది మా మధ్య ఉన్న ఈ సంబంధం వల్లే నన్ను పీఏగా పెట్టుకున్నారు. మీ ఇంట్లో స్థానం ఇస్తానని చెప్తారు. ఇన్ని రోజులు మీకు తెలీకుండా జరిగింది ఈ రోజు మీకు తెలిసేలా జరిగింది అంతే. విరూపాక్షి: ఏం మాట్లాడుతున్నావే అని చెంప వాయిస్తుంది. సూర్య భార్యగా తనేంటో నాకు తెలుసు. సూర్య కోపంలో అయినా బాధలో అయినా ప్రేమలో అయినా ఉన్న ఒకే ఒక ఆడది నేనే. పరాయి వాళ్లతో సంబంధం పెట్టుకున్నాడు అంటే ఎవరు నమ్ముతారు.రాధిక: జనం నమ్ముతారు. ఆయన కోపం, బాధలో ఉండేది నువ్వు అవొచ్చు కానీ ప్రేమలో ఉన్నది నేనే ఇదే నిజం.రాజు: మళ్లీ మళ్లీ అదే కూశావంటే ఆడదానివి అని కూడా చూడను నరికి పోగులు పెడతా. నువ్వు ఆ జీవన్ గాడి పావు అని మాకు తెలుసు నీకు తెలుసు. జీవన్తో పాటు నీ వెనక ఇంకా ఎవరు ఉన్నారో మాకు తెలుసు. అన్నీ బయటకు వస్తాయ్. సూర్యప్రతాప్ గారితో ఎందుకు పెట్టుకున్నామా అనిపించేలా చేస్తా. సూర్యప్రతాప్ గారిని బయటకు తీసుకొచ్చి మిమల్ని లోపల వేయిస్తా. అసలైన మాధవి రాజు, రూపలకు థ్యాంక్స్ చెప్పి సూర్యప్రతాప్‌కి ఏం సాయం కావాలి అన్నా తనకు చెప్పమని వెళ్లిపోతుంది. సుమ: నువ్వు ఇందంతా ఏదో ఆశించే చేసుంటావ్ ఏం ఆశించి చేశావో చెప్పు. రూప: అవును రాధిక ఏం కావాలో చెప్పు. రాధిక: (రాధికతో విజయాంబిక, దీపక్‌లు జీవన్ ఇచ్చే కోటి కాకుండా వందల కోట్లు వచ్చేలా చేస్తాం అయితే నీకు వచ్చే ఆ వందల కోట్లలో సగం మాకు ఇవ్వాలి అని తమ్ముడికి అవమానం చేసి సగం ఆస్తి ఇవ్వమని అడగమని చెప్తారు) అందరూ ఏం కావాలి అని అడుగుతారు. సూర్యప్రతాప్ తన భర్తని సస్పెండ్ చేయడంతో నా భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు నేను నా కొడుకు రోడ్డున పడ్డామని అందుకే సూర్యప్రతాప్‌కి ఈ గతి పట్టించామని అంటుంది. డబ్బు కోసమే ఇదంతా చేశానని చెప్తుంది.రూప: డబ్బు కోసం ఇదంతా చేశావా మా నాన్న తప్పు చేయలేదు అని ఒప్పుకో నీకు ఎంత కావాలో చెప్పు ఇస్తాం.రాధిక: సూర్యప్రతాప్ ఆస్తిలో సగం ఆస్తి నా పేరు మీద రాయాలి. రూప: చూడు నువ్వు అడిగిన ఆస్తి ఇస్తాం నువ్వు మా నాన్న మీద చేసిన ఆరోపణలు అన్నీ ఒప్పుకోవాలి. రాధిక: నేను కోర్టుకి వచ్చే సరికి నాకు రావాల్సిన ఆస్తి పేపర్లు నాకు ముట్టాలి.విజయాంబిక: నువ్వు అనుకున్నది సాధించావ్ కదా ఇక వెళ్లిపో. రూప: రాజు మనం వెళ్లి నాన్నని కలిసి వద్దాం.
సూర్యప్రతాప్ పోలీస్ స్టేషన్‌లో రాధిక తన మీద వేసిన నిందలు తలచుకొని బాధపడుతూ ఉంటారు. విరూపాక్షి, రూప, రాజులు పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. విరూపాక్షి ఎస్‌ఐతో రాధిక డబ్బు కోసమే ఇదంతా చేశామని చెప్పామని సూర్యప్రతాప్‌ని వదలమని చెప్తారు. ఇప్పుడు కదరదు అని ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశామని అంటారు. న్యాయంగా గెలవాలి అంటారు. రూప వాళ్లు సూర్యప్రతాప్‌ని కలుస్తారు. విరూపాక్షిని చూసి సూర్యప్రతాప్ అరుస్తాడు. నీకు నేను వేసిన శిక్ష నాకు పడింది అని సంబర పడటానికి వచ్చావా అని తిడతారు. రూప తండ్రితో రాధిక తన తప్పు ఒప్పుకుంది అని డబ్బు కోసమే చేశానని ఒప్పుకుందని అంటుంది. ఒప్పుకోవడం ఏంటి రూప ప్రాణం లాంటి నా పరువు తీసేసిందని అంటాడు. నన్నో దుర్మార్గుడిలా చేసింది ఇంత జరిగిన తర్వాత తను తప్పు ఒప్పుకుంటే లాభం ఏంటి అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!