Ammayi garu Serial Today Episode ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షి, విజయాంబికలు ప్రచారం చేస్తారు. విజయాంబిక షో కోసం చిన్న పిల్లలకు స్నానం చేయిస్తుంది. విరూపాక్షి అందరికీ ఓట్లు వేయమని సమస్యలు పరిష్కరిస్తానని చెప్తుంది. విజయాంబిక రోడ్లు ఊడ్చుతూ పబ్లిసిటీ చేస్తుంది. నా వల్ల కావడం లేదు తమ్ముడు అని విజయాంబిక అంటే తప్పదు అక్క రాజకీయం అంటే ప్రజల్లోనే ఉండాలి అక్క ఏసీల్లో కాదు అని ప్రచారం చేయమని అంటాడు.
సూర్యప్రతాప్ వాళ్లు ఉన్న వైపు విరూపాక్షి వాళ్లు వస్తుంటారు. విజయాంబిక ఓ సెలూన్ షాప్‌లో ఆయిల్ రాస్తూ ఉంటే సూర్య ప్రతాప్ అక్కడ కూర్చొంటాడు. ఇక రూప తల్లి దగ్గరకు వెళ్తుంది. ఇంతలో జీవన్ దీపక్‌కి ఫోన్ చేసి ప్రచారం ఎలా జరుగుతుందని అడుగుతారు. బస్తీ ఓట్లు అన్నీ మా అత్తయ్యకే పడేలా ఉన్నాయి రాజు వల్ల విరూపాక్షి అత్తయ్యకి కూడా ఫాలోయింగ్ పెరుగుతుందని అంటాడు. దాంతో జీవన్ మీ మామయ్యకి ప్రమాదం జరిగేలా చేయి మీ అత్త ప్రచారం ఆపేస్తుందని అంటాడు. దాంతో దీపక్ కొబ్బరి బోండాలు కొని అందులో మత్తు వచ్చేలా ఓ ట్యాబ్లెట్ కలుపుతాడు. విరూపాక్షి తల్లితో మాట్లాడుతూ నీతోనే ఉండాలి అని ఉందమ్మా కానీ తప్పడం లేదు అంటుంది. ఇక దీపక్ ట్యాబ్లెట్ కలిపిన కొబ్బరి బోండాం మామయ్యతో తాగిస్తాడు. చంద్రకు మామూలు బొండాం ఇచ్చి సూర్యకి ట్యాబ్లెట్ కలిపినది ఇస్తాడు.
దీపక్ సూర్యతో రూప విరూపాక్షితో మాట్లాడుతుందని చెప్తాడు. దాంతో సూర్య కోపంగా అక్కడికి వెళ్లి రూప అని అరుస్తాడు. రూప షాక్ అయిపోతుంది. రూప ఏదో చెప్పబోతే మాట్లాడొద్దని అంటాడు. ఇంట్లో వాళ్లే వెన్నుపోటు పొడుస్తున్నారని దీపక్ అంటాడు. ఇక సూర్య అయితే నీకు వాళ్లతో వెళ్లిపోవాలి అని పిస్తే వెళ్లిపో నిన్ను ఎవరూ ఆపరు అంటాడు. దాంతో రూప అమ్మని సపోర్ట్ చేయడానికి రాలేదు నాన్న అని చెప్తాడు. రాజు రూపతో అమ్మాయి గారు వాళ్లు నిన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నారని ఇప్పుడు అర్థం చేసుకోవడానికి అంటాడు. ఇక విరూపాక్షి రూపతో రూప మీ నాన్నకి మంచి తోడుగా ఉన్నప్పుడు గెలిచారు ఈ సారి మాత్రం గెలుపు నాది అంటుంది. నిన్నూ అని అరుస్తూ సూర్య కుప్పకూలిపోతాడు. విజయాంబిక విరూపాక్షితో నీ వల్లే ఇదంతా అంటుంది. సూర్యని హాస్పిటల్‌లో చేర్పిస్తారు. హాస్పిటల్‌లో విజయాంబిక వాళ్లు విరూపాక్షి వల్లే అంతా అంటే రూప మా అమ్మ మీద పడి ఏడ్వొద్దని అంటుంది. అన్నయ్య పడిపోవడానికి వదిన గారికి ఏం సంబంధం లేదని చంద్ర అంటాడు.
ఇక డాక్టర్ వచ్చి ప్రమాదం ఏం లేదని ఫుడ్ పాయిజన్ వల్ల బాడీ డీ హైడ్రేట్ అయిందని చెప్తారు. రూప, చంద్రలు తండ్రిని చూడటానికి వెళ్తారు. ఇక దీపక్ తల్లితో తన మామయ్యకి ఇలా అవ్వడానికి కారణం నేనే అని చెప్తాడు. విజయాంబిక షాక్ అయిపోతుంది. కొబ్బరి నీళ్లతో మెడిసిన్ కలిపానని అంటాడు. విజయాంబిక కొడుకుని పొగిడేస్తుంది. సూర్యకి మెలకువ వస్తే అక్కడే ఉన్న రూపని విజయాంబిక తోసేసి తనకు రాజకీయాలు వద్దని నాటకం మొదలు పెడుతుంది. రూప కూడా అత్తయ్య వద్దు అంటుంది కదా నాన్న రాజకీయాలకు దూరంగా ఉందామని అంటుంది. ప్రజలకు మేలు జరగాలి అంటే నువ్వు గెలవడం చాలా ముఖ్యం అక్క అని అంటాడు.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్ టెన్షన్!