Ammayi garu Serial Today Episode దీపక్‌ని నయం చేయడానికి సూర్య ప్రతాప్ బావ వచ్చి ఇలాంటి విచిత్రమైన కేసుని తన శిష్యుడు పరిష్కారం చేస్తాడని అనడంతో రాజు స్వామీజీ గెటప్లో ఎంట్రీ ఇస్తాడు. రాజు ఓ పెద్ద దుడ్డి కర్ర ఇచ్చి దానితో కొడితే నయం అవుతుందని అంటాడు. విజయాంబికను కొట్టమని అంటే నా వల్ల కాదు అంటుంది. దాంతో రూప దీపక్‌ని పెద్ద కర్రతో చితక్కొడుతుంది.
రూప ఎంత కొట్టినా దీపక్ ఓర్చుకుంటాడు కానీ ఉలకడు పలకడు. రూప బావతో పాటు అత్తని, మౌనికని చితక్కొడుతుంది. పొరపాటున తగిలింది అని సారీ చెప్తుంది. దీపక్ ఎంతకీ లేవకపోవడంతో సామూహిక దండ యాత్ర చేయాలి అని అందరూ కలిసి చితక్కొడతారు. ఈ పూటకి చాలు మళ్లీ రేపు చూద్దామని స్వామీజీ చెప్తారు. దీపక్‌ని మౌనిక, విజయాంబికలు గదిలోకి తీసుకెళ్తే దీపక్ అరుస్తాడు. నా వల్ల కాదు అని ఏడుస్తాడు. పెద్దగా అరిస్తే తెలిసిపోతుందని విజయాంబిక కొడుకు నోటిలో చీర అడ్డుపెడుతుంది. దెబ్బలు తినలేవు కదా ఇంట్లో చెప్పేద్దామని విజయాంబిక అంటే వద్దని కోలుకున్నా అని తెలిస్తే కోర్టుకి తీసుకెళ్లి మౌనికతో విడాకులు ఇప్పించేస్తారని అంటాడు. ఇక స్వామిజీ, రాజా విక్రమార్కగా వచ్చిన రాజు మందారానికి వెన్న ఇచ్చి దీపక్‌కి రాయమని అంటారు. అది చూసి మందారం వెన్న ఎర్రగా ఉందేంటి అని అంటే అది కుంకుమ పువ్వు కలిపిన వెన్న అని చెప్పి రాయమంటారు.
రూప అది నిజంగా వెన్నేనా అని అడిగితే గుంటూరి కారం కలిపిన వెన్న అని తల్లీకొడుకుల పని అయిపోతుందని రాజు రూపతో చెప్తాడు. ఇక మందారం కారం కలిపిన వెన్న తీసుకొస్తుంది. విజయాంబిక చూసి ఎర్రగా ఉంది ఏంటి అంటే కుంకుమ పువ్వు కలిపిన వెన్న అని ఇది రాస్తే తగ్గిపోతుందని మామయ్య చెప్పారని అంటుంది. మందారం, మౌనిక ఇద్దరూ కారం కలిపిన వెన్న రాయడంతో దీపక్ కుమిలిపోతాడు. మింగ లేక కక్కలేక కుర్చీకి అతుక్కుపోయి పిచ్చెక్కిపోతాడు. తల్లి వైపు తిరిగి సైగ చేయడంతో మందారం ఉంది ఏం చేయలేం ఓర్చుకో అని విజయాంబిక సైగ చేస్తుంది.
ఉదయం అందరూ రెడీ అయిపోతారు. దీపక్‌ని తీసుకొని విజయాంబిక వస్తుంది. దీపక్ హాయిగా నిద్ర పోయినట్లు ఉన్నాడు రాత్రి అంతా అని అంటే మీరు ఇచ్చిన వెన్నకి మంటలు మంటలు అని మీరు కొట్టిన దెబ్బలకు వాచిపోయాడని చెప్తుంది. మొత్తానికి నిద్ర పట్టింది కదా అది చాలు అని వెటకారంగా స్వామీజీ అంటారు. ఈ పూట మరి వైద్యం వద్దని విజయాంబిక అంటే మందారం వద్దని అంటుంది. దీపక్ మనసులో ఈ మట్టి బుర్రది నన్ను చంపేసేలా ఉందని అనుకుంటాడు. కోర్టు ఓపెన్ అయిన టైంకి దీపక్ కోర్టులో ఉండేలా చేయాలని సూర్యప్రతాప్ అంటారు. దాంతో మేం చూసుకుంటాం అని స్వామీజీ అంటారు. ముందుగా కళ్లలో బిగుసుకు పడ్డ నరాలు సెట్ చేయాలని చిన్న త్రిశూలం తీస్తారు. అది చూసిన దీపక్ గుండె ఆగినంత పని అయిపోతుంది.
రాజు అది తీసుకొని దీపక్ దగ్గరకు వెళ్లి నాలుక మీద పొడిచేస్తాడు. దీపక్ చావు కేక పెడతాడు. ముఖం తిప్పడంతో మా ఆయన ముఖం సెట్ అయిపోయింది మాట వచ్చేసిందని మందారం వాళ్లు సరదా పడిపోతారు. అక్కా మనం కోర్టుకు వెళ్తాం అని సూర్య సంతోషంగా చెప్తాడు. ఇక వేడి వేడి పొగలు వస్తున్న వేడి నీటిలో దీపక్ రెండు చేతులు ఇద్దరు భార్యలతో పెట్టిస్తారు. దీపక్ కెవ్వు మని అరుస్తాడు. దాంతో చేతులు వచ్చేశాయని అందరూ సంతోషపడతారు. ఆ సీన్ చూడటానికి భలే కామెడీగా ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గౌతమ్‌ని కుర్చీకి కట్టి కొరడాతో చితక్కొట్టిన సీత.. మహాలక్ష్మీ అధికారం పాయే!