Krishnamma kalipindi iddarini June 30th: ఆదిత్య అమృతతో నిన్ను పెళ్లి చేసుకుంటే అన్నయ్య కోమాలోకి వెళ్తాడని అమ్మ చనిపోతుంది అని.. వాళ్ళని దూరం చేసుకొని నిన్ను పెళ్లి చేసుకొని నేను సంతోషంగా ఉండలేను అని ఇక నీ ఇష్టం అని మాట్లాడతాడు. దాంతో అమృత ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో అప్పుడే సునంద వచ్చి అమృతను అప్పుడే వెళ్తావ్ ఏంటి ఎంగేజ్మెంట్ అయ్యాక వెళ్ళు అని అంటుంది.
ఆదిత్యతో నీ ఫ్రెండ్ ప్రాబ్లం గురించి తెలుసుకున్నావా అని అడగటంతో తెలుసుకున్నాను సాల్వ్ కూడా చేశాను అని అంటాడు. తనను ఎంగేజ్మెంట్ లో ఉండమని అనటంతో నాకు పని ఉంది అని అంటుంది అమృత. కానీ సునంద బ్రతిమాలటంతో ఒప్పుకుంటుంది. ఆ తర్వాత పూజ జరుగుతుంది. అది చూసి అమృత తట్టుకోలేకపోతుంది. అప్పుడే సౌదామిని కనిపించడం లేదు అని తన తల్లి పిలవడానికి వెళ్తుంది.
ఇక సౌదామిని తన వాళ్లతో ఎంగేజ్మెంట్ అయినంత మాత్రాన పెళ్లి కావాలి కదా.. ఆఖరి క్షణాల్లో కూడా పెళ్లి ఆపవచ్చు అని అంటుంది. అప్పుడే తన తల్లి వచ్చి పిలవడంతో వేడుక దగ్గరికి వెళ్తారు. అక్కడ కోపంగా కనిపిస్తూ ఉంటారు. ఆదిత్య చాలా బాధపడుతూ కనిపిస్తాడు. ఆ తర్వాత రింగ్స్ మార్చుకుంటూ ఉంటారు. ఇక గౌరీ, ఈశ్వర్లు ఒకరికొకరు అదృష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు.
అఖిల మాత్రం ఈ ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంటున్నాను అన్నట్లుగా అనుకుంటుంది. తర్వాత దండలు కూడా మార్చుకుంటారు. ఎంగేజ్మెంట్ వేడుక పూర్తి అయిన తర్వాత గౌరీ ఈశ్వర్ ను తలుచుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే అఖిల, ఆదిత్య లు తనకు కనిపిస్తారు. ఒక ఆదిత్య అఖిలతో ఎటువంటి గొడవ జరగనందుకు చేతులు పట్టుకొని థాంక్స్ చెబుతాడు.
అఖిల ఛీ కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక అదంతా గౌరీ చూసి ఎవరి ఈ అమ్మాయి అని అనుమానం పడుతుంది. తమ ఇంటికి వెళ్ళాక అఖిల సునంద వాళ్ళ ఇంట్లో ఎత్తుకొచ్చిన బంగారం కుంకుమ భరణి చూసి తెగ మురిసిపోతూ ఉంటుంది. ఇదెక్కడిది అని తల్లి అడగడంతో అక్కడ దొంగతనం చేశాను అని చెబుతుంది. దాంతో భవాని అఖిలను కొడుతూ ఉండగా వెంటనే ఆనందయ్య వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు.
ఇక కూతురు దొంగతనం చేసిందన్న విషయం చెప్పకుండా ఆ కుంకుమ భరణి కొన్నదని చెబుతుంది భవాని. కానీ కూతురు దొంగతనం చేసిందని తెలుసుకొని కూతురిని అలా చేయొద్దు అని హెచ్చరిస్తాడు ఆనందయ్య. అప్పుడే గౌరీ కూడా రావటంతో గౌరీకి తన చెల్లెలను జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు.
ఆ తర్వాత ఆనందయ్య అక్కడ నుంచి వెళ్లాక గౌరీ తన తల్లితో.. నిజంగా అఖిల, ఆదిత్య పెళ్లికి సునంద గారు ఒప్పుకున్నారా అని అడుగుతుంది. లేదమ్మా నేనే వారిద్దరి పెళ్లి చేస్తే నీ పెళ్లి చేస్తాను అని బలవంతం చేశాను అని అనటంతో ఎందుకలా అంటున్నావు అమ్మ అంటుంది గౌరీ. మరేంటమ్మ స్వయంగా తానే పెళ్లికి ఒప్పుకుంటే మళ్లీ ఇలా అంటావు అని నటిస్తుంది భవాని.
అఖిలను పక్కకు తీసుకెళ్లి గౌరీకి అనుమానం వచ్చింది అని అంటుంది భవాని. ఇక గౌరీ సునంద గారు ఈ పెళ్లికి ఇష్టంగా ఒప్పుకుంటే ఏమి కాదు అని ఏదైనా బలవంతం ఒప్పుకుంటే ఈశ్వర్ తట్టుకోలేడు అని ఆయన ముందు నేను దోషిని అవుతాను అని బాధపడుతుంది. ఇక సునంద వాళ్ళ ఇంట్లో పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
Also Read: Rangula Ratnam June 30th: సిద్దును వదిలేసిన స్వప్న.. ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్న వర్ష?