News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ANR పంచలోహ విగ్రహం ఆవిష్కరణ, పెళ్లికి చావుకు లింకుపెట్టిన నిత్య - ఈ రోజు సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

FOLLOW US: 
Share:

ఏయన్నార్ పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు - రాజమౌళి ఏమన్నారంటే?

తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మరువలేని కథానాయకుడు అక్కినేని నాగేశ్వర రావు (Akkineni Nageswara Rao). తెలుగు సినిమా దిశ, దశ మార్చిన హీరోల్లో ఆయన కూడా ముఖులు. ఈ రోజు ఏయన్నార్ జయంతి. మరో ప్రత్యేకత ఏమిటంటే... నేటితో అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి (ANR Birth Centenary) సంవత్సరం కూడా ప్రారంభం అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

అప్పుడు తండ్రి, ఇప్పుడు కూతురు - ఆత్మహత్యలపై విజయ్ ఆంటోని ఏం మాట్లాడారంటే?

తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోనీ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విజయ్ కుమార్తె మీరా ఆంటోని మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు తమ నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని ఓ ప్రైవేటు స్కూల్ లో ఇంటర్‌ సెకండ్ ఇయర్ చదువుతున్న 16 ఏండ్ల మీరా.. చదువుల ఒత్తిడితోనే బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. కూతురి ఆకస్మిక మరణంతో విజయ్ ఆంటోనీ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో గతంలో ఆత్మహత్యలపై ఆయన మాట్లాడిన మాటలు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

పెళ్లికి చావుకు లింకు పెట్టిన నిత్య - ‘కుమారి శ్రీమతి’ టీజర్ చూశారా?

నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా వెబ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’.  గోమటేష్ ఉపాధ్యాయ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్‌, స్వప్నా సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. ప్రముఖ నటి కీర్తి సురేష్ ఈ టీజర్ ను ఆవిష్కరించింది.  పెళ్లి గురించి అందరూ ఒత్తిడి చేస్తున్నా పట్టించుకోని అమ్మాయి పాత్రలో నిత్యా కనిపించింది. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు పెళ్లికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ఇందులో చూపించారు. పెళ్లి చేసుకోమని విసిగించే వారికి గట్టిగా సమాధానం చెప్తుంది. నీ కంటే చిన్నవాళ్లు పెళ్లి చేసుకున్నారు? నువ్వెప్పుడు చేసుకుంటావ్? అని అడిగిన ఓ బామ్మకు, నీ కంటే చిన్నవాళ్లు అప్పుడే పోయారు. నువ్వెప్పుడు పోతున్నావ్? అంటూ ముఖం మీదే కడిగిపారేసే మొండిఘటంలా కనిపించింది నిత్య. ప్రస్తుతం ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

వీళ్ళ సరసాలు తగలెయ్య- రతిక, యావర్ రొమాన్స్- తట్టుకోలేకపోతున్న గౌతమ్

పవర్ అస్త్ర పేరుతో బిగ్ బాస్ ఇంట్లో మూడు వారాలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అటు గొడవలు.. ఇటు ఊహించని విధంగా లవ్ ట్రాక్ నడుస్తుంది. ఇంట్లోకి వచ్చిన కొత్తలో రతిక గౌతమ్ కృష్ణతో క్లోజ్ గా మూవ్ అయ్యింది. కానీ నామినేషన్స్ టైమ్ లో ఎవరూ ఊహించని విధంగా గౌతమ్ ని నామినేట్ చేసి అందరికీ షాకిచ్చింది. తర్వాత రైతు బిడ్డని వెనక తిప్పుకుంది. అర్థరాత్రి తనతో కబుర్లు చెప్పిన రొమాంటిక్ వీడియో కూడా బిగ్ బాస్ లీక్ చేశాడు. అంతలో ఏమైందో మళ్ళీ ఇద్దరూ గొడవపడిపోయారు. ఇప్పుడు రతిక ఖాతాలో మరొక వ్యక్తి చేరాడు. అతనే ప్రిన్స్ యావర్. దీనికి తగ్గట్టుగా రిలీజైన ప్రోమో చూస్తే మాత్రం ఇది బేబీ సినిమాకు అమ్మ మొగుడిలాగా ఉందని ఖచ్చితంగా అంటారు.  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మాస్ మహారాజ రవితేజతో రష్మిక - పాన్ ఇండియా సినిమా కోసం!

మాస్ మహారాజ రవితేజ (Ravi Teja)తో నేషనల్ క్రష్ & కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) నటించనున్నారా? డ్యాన్సుల్లో, నటనలో ఇరగదీసే వీళ్ళిద్దరూ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? వీళ్ళిద్దరి కలయికలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే... 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ జోడీ సినిమా చేయడం దాదాపు ఖాయం అయ్యిందని, ఇక అధికారికంగా వెల్లడించడం మాత్రమే తరువాయి అని టాక్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Published at : 20 Sep 2023 05:00 PM (IST) Tags: Tollywood News Movie News entertainment news TV News CINEMA NEWS

ఇవి కూడా చూడండి

Shobha Shetty: బిగ్ బాస్: 14 వారాలకు శోభా శెట్టి అందుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే?

Shobha Shetty: బిగ్ బాస్: 14 వారాలకు శోభా శెట్టి అందుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే?

Krishna Mukunda Murari Serial December 11th Episode నా భర్త ఇక్కడే, నా పక్కనే ఉన్నారు.. మురారికి హింట్‌ ఇచ్చిన కృష్ణ!

Krishna Mukunda Murari Serial December 11th Episode నా భర్త ఇక్కడే, నా పక్కనే ఉన్నారు.. మురారికి హింట్‌ ఇచ్చిన కృష్ణ!

‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్, ‘సలార్’ సెన్సార్ పూర్తి - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్, ‘సలార్’ సెన్సార్ పూర్తి  - నేటి టాప్ సినీ విశేషాలివే!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Jamal Kudu Song: బాబీడియోల్ ‘జ‌మల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?

Jamal Kudu Song: బాబీడియోల్ ‘జ‌మల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?

టాప్ స్టోరీస్

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే  ఏప్రిల్‌లోనే అవకాశం !

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?