‘కల్కి 2898 ఏడీ’కి సమస్య, ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ డేట్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
LSD ట్రైలర్ - ఆ ఓటీటీలోకి వచ్చేస్తున్న అడల్ట్ సీరిస్ - దిల్ రాజు డైలాగ్‌ను ఇలా వాడేశారు!
గత కొంత కాలంగా థ్రిల్లింగ్, సస్పెన్స్ కథాంశాలతో వస్తున్న వెబ్ సిరీస్ లు ఓటీటీలలో పెద్ద సంఖ్యలో విడుదల అవుతున్నాయి. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతోంది. ‘LSD’ పేరుతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ సీరీస్‌కు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ప్రాచీ టకర్, నేహా దేశ్‌పాండే, ప్రభాకర్ , కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. MX ప్లేయర్ లో ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
హాలీవుడ్ హర్రర్ మూవీలో అవంతిక వందనపు.- వెన్నులో వణుకుపుట్టిస్తున్న ‘Tarot’ ట్రైలర్
టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన అవంతిక వందనపు.. అనూహ్యంగా కొన్నేళ్ల తర్వాత హాలీవుడ్‌లో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ‘మీన్ గర్ల్స్’ అనే సిరీస్‌లో కనిపించి హాలీవుడ్‌లో పాపులర్ అయిపోయింది అవంతిక. ఇంతలోనే తను నటించిన మరో హాలీవుడ్ మూవీ ‘టారో’ (Tarot) కూడా థియేటర్లలో విడుదల అవ్వడానికి సిద్ధమవుతోంది. ‘టారో’ఒక హారర్ మూవీ. ఇప్పటికే హాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అవంతిక.. ఇలాంటి ఒక హారర్ మూవీలో నటిస్తుంది అనే విషయం మరోసారి ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ప్రభాస్‌కు షాకిచ్చిన హాలీవుడ్ - ‘కల్కి 2928 AD’కి ఆ సమస్య తప్పదా?
మే 9న ‘కల్కి 2898 ఏడీ’ మూవి రిలీజ్‌కు సిద్ధమయ్యిందని. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు పోస్ట్‌పోన్ అయ్యింది. దీంతో మే 9 నుంచి కూడా పోస్ట్‌పోన్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం అవన్నీ రూమర్స్ అని, సినిమా చెప్పిన తేదీకే విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ తేదీని పూర్తిగా ‘కల్కి’ కోసమే వదిలేశారు ఇండియన్ మూవీ మేకర్స్. కానీ హాలీవుడ్ మాత్రం దీనికి సిద్ధంగా లేదని అర్థమవుతోంది. మే 9న ‘ప్లానెట్ ఆఫ్ ఏప్స్’ చిత్రాన్ని విడుదల చేయాలని ఆ మూవీ మేకర్స్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. రెండు వారాల పాటు స్క్రీనింగ్ కోసం ఐమ్యాక్స్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ‘ప్లానెట్ ఆఫ్ ఏప్స్’ తరహాలోనే ‘కల్కి 2898 ఏడీ’ టీమ్ కూడా ఐమ్యాక్స్‌తో ఒప్పందం చేసుకోవడంతో అసలు సమస్య మొదలయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ప్రభాస్ 'కల్కి' రిలీజ్ డేట్‌పై కన్నేసిన ఉస్తాద్ హీరో?
డైరెక్టర్ పూరి జగన్నాథ్ - ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీ ప్రభాస్ 'కల్కి' రిలీజ్ డేట్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మొదట ఈ సినిమాని శివరాత్రి కానుకగా మార్చి 8న విడుదల చేయాలని అనుకున్నారు. సినిమా అనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. కానీ సినిమాకు సంబంధించి ఇంకా పెండింగ్ వర్క్ ఉండడంతో మే నెలలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అది కూడా 'కల్కి' రిలీజ్ డేట్ అయిన 9 కి 'డబుల్ ఇస్మార్ట్' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ 'కల్కి' రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వకుంటే మే 23 మరో ఆప్షన్ గా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ రెండిట్లో ఏదో ఒక డేట్ ని డబుల్ ఇస్మార్ట్ టీమ్ రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మగాళ్లకు సారీ చెప్పిన ప్రియమణి - ఎందుకో తెలుసా?
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో గోపీచంద్, ప్రియమణి జంటగా నటించిన 'గోలిమార్' సినిమాలో 'మగాళ్లు వట్టి మాయగాళ్లే 'అనే సాంగ్ అప్పటికీ, ఇప్పటికీ ఎంత ఫేమస్ అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రియమణిని చూసినప్పుడల్లా అందరికీ ఇదే పాట గుర్తొస్తుంది. అందుకే 'భామాకలాపం2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా స్టేజ్ పైకి వచ్చిన ప్రియమణిని యాంకర్ పాట పాడమని రిక్వెస్ట్ చేయగా.. ప్రియమణి పాడే ముందు మగవాళ్ళందరికీ సారీ చెప్పి 'మగాళ్లు వట్టి మాయగాళ్లే' సాంగ్ ని ఫుల్ జోష్ తో పాడి అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)