'కొండపొలం' ఇంట్రెస్టింగ్ అప్డేట్: 


టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిస్తోన్న లేటెస్ట్ సినిమా 'కొండపొలం'. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. అడవి నేపథ్యంలో పూర్తి అడ్వెంచరస్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ గ్రామీణ యువతిగా కనిపించనుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను సెప్టెంబర్ 27న సాయంత్రం 3.33 గంటలకు విడుదలకు చేయనున్నట్లు దర్శకుడు క్రిష్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా వదిలారు. ఇందులో వైష్ణవ్ తేజ్ గొడ్డలి పట్టుకొని ఉండగా.. ఆ గొడ్డలిపై సినిమాలోని కొన్ని పాత్రలు కనిపించాయి. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. 







'రొమాంటిక్' మూవీ రిలీజ్ డేట్:


దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'రొమాంటిక్'. ఈ సినిమాకి పూరి శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, రెండు పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో రమ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తోంది.