బాలీవుడ్ నటి స్వర భాస్కర్, సమాజ్ వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్ దంపతులు పేరెంట్స్ అయ్యారు. పండంటి బిడ్డను తమ ఫ్యామిలీలోకి ఆహ్వానించారు. మార్చిలో స్వర భాస్కర్, ఫహద్ అహ్మద్ పెళ్లి చేసుకున్నారు. జూన్‌లో గర్భం దాల్చినట్లు స్వర భాస్కర్ ప్రకటించింది. రీసెంట్ గా సీమంతం వేడుక జరుపుకుంది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వర భాస్కర్ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ నెల 23న కూతురు పుట్టిందని తెలిపింది.  అప్పుడే ఆమెకు పేరు కూడా పెట్టినట్లు ప్రకటించింది. “మా ప్రార్థన దేవుడికి వినిపించింది. అక్కడి నుంచి ఒక ఆశీర్వాదం లభించింది.  ఒక పాట గుసగుసలాడింది.. మా పాప రుబియా సెప్టెంబర్ 23 నాడు జన్మించింది. మాకు శుభాకాంక్షలు చెప్పిన, మా పై ప్రేమను కురిపించే మీ అందరికీ ధన్యవాదాలు” అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది స్వర భాస్కర్.






రహస్య వివాహం చేసుకున్న స్వర భాస్కర్


స్వర భాస్కర్‌- ఫహద్‌ అహ్మద్‌ కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశారు. ఇద్దరి మధ్య పరిచయం అయ్యింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ ఏడాది జనవరి 6న రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ప్రత్యేక వివాహ చట్టం కింద కోర్టులో ఈ పెళ్లిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఫిబ్రవరి 16న సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. తర్వాత ఈ జంట పెద్దల అంగీకారంతో మార్చిలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి బంధువులు, మిత్రులు హాజరయ్యారు. జూన్‌లో ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది స్వర. తాజాగా పాప జన్మించినట్లు చెప్పింది. ప్రస్తుతం పలువురు సెలబ్రిటీలతో పాటు ఆమె అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు.  మరోవైపు స్వర భాస్కర్, ఫహద్ పేరెంట్స్ కావడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రెగ్నెంట్ అయిన తర్వాతే  స్వర భాస్కర్ పెళ్లి చేసుకుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.  గర్భం దాల్చడం వల్లే పెళ్లి చేసుకుని, ప్రెగ్నెన్సీ  వచ్చినట్లు ప్రకటించారని మరికొందరు అంటున్నారు.   


శోభనం గది ఫోటోలను నెట్టింట్లో పెట్టిన స్వర భాస్కర్


సమాజ్ వాదీ పార్టీ యూత్ వింగ్‌ మహారాష్ట్ర యూనిట్ ప్రెసిడెంట్‌గా ఫహద్ అహ్మద్ వ్యవహరిస్తున్నారు. ఓ ఆందోళన కార్యక్రమం సమయంలో కామన్ ఫ్రెండ్ ద్వారా ఫహ‌ద్‌తో స్వర భాస్కర్ కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. బోల్డ్ మాటలతో సోషల్ మీడియాలో తరచుగా వార్తల్లో నిలుస్తుంది స్వర భాస్కర్.  అంతేకాదు, తన శోభనం గది ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. శోభనం రోజున తాను కట్టుకోబోయే చీరను కూడా చూపించి అవాక్కయ్యేలా చేసింది.  తన ఫస్ట్ నైట్ కోసం బామ్మ ఎంతో చక్కగా గదిని రెడీ చేసిందని చెప్పింది. అప్పట్లో ఈ సోషల్ మీడియా పోస్టులు తెగ వైరల్ అయ్యాయి.  


Read Also: ఎట్టకేలకు ‘కింగ్ ఆఫ్ కోత’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ అంటే?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial