టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు శనివారం నాడు తన కొత్త సినిమాను ప్రకటించారు. సుధీర్ కెరీర్ లో 16వ సినిమా ఇది. 'కథలో రాజకుమారి' ఫేమ్ దర్శకుడు మహేష్ సూరపనేని ఈ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయనున్నారు. సినిమాను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. స్పెషల్ క్రైమ్ డివిజన్ Hawk-Eye అని రాసి ఉన్న గోడపై గన్స్ ను ఎరేంజ్ చేసి ఉంచారు.
దీన్ని బట్టి సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని తెలిపారు. 'గన్స్ డోంట్ లై' అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు. త్వరలోనే సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత ఆనంద్ ప్రసాద్ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో భరత్ నివాస్, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గోపీచంద్ బయోపిక్ లో కనిపించనున్నారు సుధీర్ బాబు. ఇప్పుడు కొత్త సినిమా అనౌన్స్ చేశారు.