Pawankalyan Viral video: 'హనుమాన్‌' సినిమా ఆద్యంతం ఒక అద్భుతం. ప్రతి సీన్‌ ప్రేక్షకుడికి విజువల్‌ ఫీస్ట్‌ అనే చెప్పాలి. ఆంజనేయుడు కనిపించిన ప్రతిసారి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా అద్భుతంగా ఉంది. పవర్‌ఫుల్‌ సీన్లు చాలా చక్కగా చూపించారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. హీరోకి దొరికే మణి ఎలా ఏర్పడిందనే సీన్లు వావ్‌.. అనిపించాయి. అలాంటి సీన్లకు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు తోడయ్యాయి. అలా ఎడిటింగ్‌ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. 


అంజనీ పుత్ర జనసేనాని.. పవన్‌కల్యాణ్‌


'హనుమాన్‌' సీన్లకు పవన్‌కల్యాణ్‌ ఫొటోలను జోడించి ఒక వీడియో ఎడిటింగ్‌ చేశారు. పవన్‌కల్యాణ్‌ చిన్ననాటి ఫొటోలు, జనసేన పార్టీ ఫొటోలను, వీడియోలను పెట్టి ఎడిటింగ్‌ చేశారు. ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. అది చూసిన 'హనుమాన్‌' డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఎడిటింగ్‌ అదిరిపోయింది అని ట్వీట్‌ చేశారు. దీంతో ఫ్యాన్స్ "పవన్‌ కల్యాణ్‌తో ఒక సినిమా చేయండి సార్‌" అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


పవన్‌ కల్యాణ్‌ హనుమంతుడికి అపర భక్తులు. ఆయన ఏ కార్యం మొదలుపెట్టినా హనుమంతుడికి పూజలు చేస్తారు. ఇటీవల ఆయన ప్రచార రథం 'వారాహి'కి కూడా కొండగట్టు ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేయించారు పవన్‌కల్యాణ్‌. 2009లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యకేత్రం అయినా కొండగట్టుకు వెళ్లిన పవన్, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఈ వీడియో చూసిన ఫ్యాన్స్‌ అందరూ.. 'అంజనీపుత్ర జనసేనాని.. పవన్‌కల్యాణ్‌' అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంజన్న దయవల్ల అంతా మంచే జరగాలి అంటూ ఆ వీడియోను రీ ట్వీట్‌ చేస్తున్నారు. 






ఇక 'హనుమాన్‌' సినిమా విషయాని వస్తే.. ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతి బరిలోకి దిగింది ఈ సినిమా. కానీ, ఇప్పుడు మిగతా తెలుగు సినిమాలకంటే ముందుకు దూసుకుపోతోంది. రూ.250కోట్ల కలెక్షన్ల క్లబ్‌లోకి చేరింపోయింది. ఇంకా ఆ కలెక్షన్ల సునామీ కొనసాగుతూనే ఉంది. తేజ సజ్జ హీరోగా నిటించారు ఈ సినిమాలో. ఇక ఇప్పుడు సెకెండ్‌ పార్ట్‌ 'జై హనుమాన్‌' కూడా రాబోతోంది త్వరలో దాంట్లో హీరో తేజ కాదని, హనుమంతుడే హీరో అని ప్రశాంత్‌ వర్మ ఇప్పటికే ప్రకటించారు. హనుమంతుడి పాత్ర కోసం ఆడిషన్స్‌ చేస్తానని చెప్పడంతో.. ఎవరు హనుమంతుడిగా నటిస్తారా? అని సస్పెన్స్‌ నెలకొంది.


ఇక ఈ పాన్‌ ఇండియా సినిమా రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ‘హనుమాన్’ సినిమాకు కోటి టికెట్లు అమ్ముడిపోయాయని సమాచారం. దీంతో 2024లో విడుదలయిన అన్ని సినిమాల్లో ఇలాంటి ఘనత సాధించిన మొదటి చిత్రంగా ‘హనుమాన్’ నిలిచింది. ఒక కోటి టికెట్లు అమ్ముడుపోయిన విషయాన్ని మూవీ టీమ్ స్వయంగా ప్రకటించింది. సినిమాను సమర్పించిన సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్.. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేసింది.


Also Read: తమ్ముడి రెండో పెళ్లిపై సల్మాన్‌ఖాన్‌ సెటైర్లు - అందరి ముందు పరువు తీసేశాడుగా!