Jathara: ప్రముఖ కన్నడ నటుడు దేవరాజ్ (Devaraj) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. భిన్న పాత్రల్లో నటించి, ప్రేక్షకుల చేత మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్రలు పోషించిన ఆయన.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి ఓ వారసుడు సినీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. దేవరాజ్ పెద్ద కుమారుడు, డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్(Prajwal Devaraj) ఓ లేటెస్ట్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వర్థమాన్ ఫిల్మ్స్, లోటస్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ ప్రొడ్యూసర్ గోవర్థన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు మేకర్స్ 'జాతర' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రజ్వల్ దేవరాజ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. ఉదయ్ నందనవనమ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.


ఇక 'జాతర' సినిమా ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు నిఖిల్ హీరోగా నటించిన 'శంకరాభరణం' మూవీ తీసిన ఉదయ్ నందనవనమ్... ఈ సినిమా కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ రెడీ చేశారు. అందమైన ప్రేమకథతో ఈ మూవీ తీయనున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. 


''ఆగస్టులో షూటింగ్ ప్రారంభించి ఈ 'జాతర'ను.. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. మంచి కథ కుదిరింది. దీనికి ప్రజ్వల్ దేవరాజ్ అయితే కరెక్ట్ అని ఆయన్ను సంప్రదించాం. ఆయన కూడా వెంటనే ఓకే చేశారు. ఈ విషయంలో దేవరాజ్ గారు కూడా మాకు అండగా ఉన్నారు. బి. వాసుదేవ్ రెడ్డి రాసిన కథకు ఉదయ్ నందనవనమ్ ఇచ్చిన ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే 'జాతర' స్క్రిప్ట్‌ను మరింత కొత్తగా మార్చింది. బళ్ళారి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం'' అని చిత్ర నిర్మాత గోవర్థన్ రెడ్డి చెప్పారు.  ''సినిమాలో ప్రేమకథ ఎంత అందంగా ఉంటుందో... నేపథ్యం కూడా అంతే కొత్తగా ఉంటుంది” దర్శకుడు ఉదయ్ నందనవనమ్ తెలిపారు. జాతర అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా కథ, కథనం ఉంటాయన్న ఆయన.. త్వరలోనే కథానాయిక వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. 




తెలుసు సినీ పరిశ్రమలో విలన్ పాత్రల్లో ఒదిగిపోయిన దేవరాజ్.. అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో హిట్ సినిమాల్లో, అగ్ర హీరోల పక్కన నటించిన ఆయన్ను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు. అలాంటి క్యారెక్టర్స్ అండ్ సినిమాలు చేశారు కాబట్టే ఈ రోజూ ఆయన గురించి చెప్పుకుంటున్నాం. మరి తండ్రిలానే ప్రజ్వల్ దేవరాజ్ కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తారా. హిట్ ను అందుకుంటాడా అని సినీ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఆ విషయం తెలియాలంటే మూవీ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.


Read Also : Anchor Vishnu Priaya: యాంకర్ విష్ణు ప్రియతో జేడీ చక్రవర్తి పెళ్లి - అసలు సంగతి ఇదీ!