‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘ప్రిన్స్’. ఈ మూవీలో శివ కార్తికేయన్‌కు జోడిగా ఉక్రెయిన్‌ బ్యూటీ మారియా ర్యాబోషాప్కా నటించింది. టాలీవుడ్‌లో టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లు అయిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. శాంతి టాకీస్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్, పాటలు ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకున్నాయి. ఈ రోజు (అక్టోబరు 21) ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. ఇంతకీ ఈ మూవీ గురించి ఆడియెన్స్ ఏమంటున్నారు?


‘ప్రిన్స్’ మూవీ కథేంటంటే?  


ఒక భారతీయ కుర్రాడు, వేరే దేశానికి చెందిన అమ్మాయిని ప్రేమించడం వల్ల కలిగే ఇబ్బందులను  ఈ సినిమాలో ఫన్నీగా చూపించారు. జాతిరత్నాలు సినిమాతో మంచి కామెడీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అనుదీప్ కు ఇది రెండో సినిమా. 'సీమ రాజా', 'రెమో', 'డాక్టర్', 'డాన్' సినిమాలతో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేశారు. 


ఈ ఏడాదిలో అత్యంత చెత్త సినిమా!


ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమా ఫస్ట్ షో పడింది. ఈ మూవీని చూసిన జనాలు జండూబామ్ కోసం బయటకు పరిగెడుతున్నారట. కాటు మొక్కాయ్ సినిమాను మక్కీకి మక్కీ దింపినట్లు విమర్శిస్తున్నారు. “చెత్త స్క్రీన్‌ప్లే, కామెడీ లేదు, ఆటో ట్యూన్ మ్యూజిక్, ఈ ఏడాది నేను ఇప్పటి వరకు చూసిన సినిమాల్లో ఇదే చెత్త సినిమా. ఇలాంటి సినిమాలు మరిన్ని అందిస్తూ ఉండండి కార్తికేయన్” అంటూ  సూర్య అనే నెటిజన్ కామెంట్ చేశాడు.






కామెడీ పండలేదు, క్యారెక్టర్స్ లో దమ్ములేదు!


“శివకార్తికేయన్ ఈ రకమైన హాస్యాన్ని నమ్ముకోవడం మానేయాలి. మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఈ సమయంలో యూనిక్ కమర్షియల్ కంటెంట్ కోసం ప్రయత్నించాలి” అంటూ మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. “ఈ సినిమా పూర్తిగా భయంకరంగా ఉంది. శివ కార్తికేయన్ కామెడీ అస్సలు పని చేయలేదు. హీరోయిన్ పాత్రకూడా అంతగా ఆకట్టుకోలేదు. పవర్ ఫుల్ స్ర్కీన్ ప్లే లేదు. శివకార్తికేయన్ కు మరో డిజాస్టర్. ఈసినిమాకు 1.5/5 రేటింగ్ ఇవ్వొచ్చు” అని కామెంట్ చేస్తున్నారు. డబ్బులు, టైం రెండూ వేస్ట్ అంటూ మరో నెటిజన్ చెప్పాడు. ఈ సినిమా గురించి ఆడియెన్స్ నుంచి పూర్తి స్థాయిలో నెగెటివ్ టాక్ వినిపిస్తోంది.