ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సింగర్ గా ఎన్నో పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇండియన్ ఐడల్ 9 టైటిల్ విజేతగా కూడా నిలిచాడు. బాహుబలి లాంటి సినిమాలో పాటలు పాడి తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 24న అన్విత అనే అమ్మాయితో రేవంత్ కి ఎంగేజ్మెంట్ జరిగింది.
ఇప్పుడు ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఆదివారం నాడు జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్ లో వీరి పెళ్లి నిరాడంబరంగా జరిగింది. కొందరు సెలబ్రిటీలు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు.
ప్రస్తుతం రేవంత్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక కెరీర్ విషయానికొస్తే.. పాటలు, టీవీ షోలతో బిజీగా ఉన్నాడు రేవంత్. ఇండియన్ ఐడల్ తెలుగు వెర్షన్ కి ముందుగా రేవంత్ ను హోస్ట్ గా తీసుకున్నారు. ఈ మేరకు అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఆ తరువాత శ్రీరామచంద్ర పేరు అనౌన్స్ చేశారు. ఇద్దరూ కలిపి ఈ షోని హోస్ట్ చేస్తారో లేక రేవంత్ తప్పుకున్నాడో తెలియాల్సివుంది!