Simbu Song In 18 Pages : నిఖిల్ కోసం శింబు పాట - టైమ్ ఇవ్వు పిల్లా 

నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా '18 పేజీస్'. ఇందులో ఓ పాటను తమిళ స్టార్ హీరో శింబు పడనున్నారు.  

Continues below advertisement

నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) హీరోగా నటించిన సినిమా '18 పేజీస్' (18 Pages Movie). సుకుమార్ (Sukumar) అందించిన కథతో రూపొందుతోంది. ఈ చిత్రానికి ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి జీఏ 2 పిక్చర్స్‌ పతాకంపై 'బన్నీ' వాస్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. లేటెస్ట్ క్రేజీ అప్‌డేట్ ఏంటంటే... ఇందులో ఓ పాటను తమిళ స్టార్ హీరో శింబు పాడనున్నారు. 

Continues below advertisement

టైమ్ ఇవ్వు పిల్లా...
టైమ్ ఇవ్వు!
Simbu Song In 18 Pages Movie : '18 పేజెస్' సినిమాలో 'టైమ్ ఇవ్వు పిల్లా టైమ్ ఇవ్వు' పాటను శింబు పాడనున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. తెలుగులో ఇంతకు ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' సినిమాలో 'డైమండ్ గాళ్', ఉస్తాద్ రామ్ పోతినేని 'ది వారియర్'లో 'బుల్లెట్...' సాంగ్స్ శింబు పాడారు. ఇంకా యువ హీరోలకు కొన్ని పాటలు పాడారు. ఆయన పాడిన ప్రతి పాట సూపర్ హిట్ అయ్యింది. దాంతో '18 పేజెస్'లో పాటపై అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో ఈ పాటను రికార్డ్ చేయనున్నారు.
 
'నన్నయ్య రాసిన...'
పాటకు సూపర్ రెస్పాన్స్!
ఇటీవల '18 పేజెస్' నుంచి 'నన్నయ్య రాసిన...' పాటను విడుదల చేశారు. దానికి శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. టీజర్ కూడా ట్రెండ్ అయ్యింది. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్. నిఖిల్, ఆమె నటించిన రెండో చిత్రమిది. తెలుగులో మాత్రమే కాదు... హిందీలో కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన 'కార్తికేయ 2' సినిమాలో నటించిన నిఖిల్, అనుపమ జంటగా నటించిన సంగతి తెలిసిందే. 

Also Read : కల్పిక అకౌంట్‌ను సస్పెండ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్

'18 పేజీస్'తో 'కార్తికేయ 2' సక్సెస్ ట్రాక్‌ను నిఖిల్, అనుపమ కంటిన్యూ చేయాలని కోరుకుందాం! వీళ్ళ హిట్ సెంటిమెంట్‌కు తోడు గీతా ఆర్ట్స్ సెంటిమెంట్ కూడా ఒకటి ఉంది. 'కాంతార' వంటి విజయవంతమైన సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఆ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. దాని తర్వాత వాళ్ళ నుంచి వస్తున్న చిత్రమిది. 'కుమారి 21 ఎఫ్' తర్వాత మరోసారి సూర్యప్రతాప్ పల్నాటి సినిమాకు సుకుమార్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. అదీ సంగతి!

'కార్తికేయ 2' ఉత్తరాదిలో సైతం భారీ విజయం సాధించడంతో ఇప్పుడు '18 పేజీస్'పై అక్కడి ప్రేక్షకుల దృష్టి పడింది. 'పుష్ప' కూడా హిందీలో సూపర్ హిట్. ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ పేరు కూడా '18 పేజీస్' పోస్టర్లపై ఉండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. లవ్ స్టోరీ కావడంతో అక్కడ విడుదల చేస్తారో? లేదో? వెయిట్ అండ్ సి.   

ఈ సినిమాలో కథలు రాసే యువతి పాత్రలో అనుపమా పరమేశ్వరన్ కనిపించనున్నారు. ఆమెకు ప్రియుడిగా ఎప్పుడూ ఫోనులో ఉండే హుషారైన పాత్రలో నిఖిల్ నటిస్తున్నారు.  ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరాలు అందిస్తున్నారు. '18 పేజెస్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై 'బన్నీ' వాసు నిర్మిస్తున్నారు.

Continues below advertisement