కరుణడ చక్రవర్తి డా. శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ఘోస్ట్' (Ghost Movie). అవుట్ అండ్ అవుట్ యాక్షన్ & ఎంటర్‌టైనింగ్ డ్రామాగా రూపొందిస్తున్నారు. సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి వేసిన జైలు ఇంటీరియర్ & అవుట్ డోర్ సెట్స్‌లో సన్నివేశాలు తెరకెక్కించారు. త్వరలో యాక్షన్ సీన్స్ తెరకెక్కించనున్నారు.
ఫిబ్రవరితో షూటింగ్ పూర్తి
''యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఇటీవల మైసూరులో సెకండ్ షెడ్యూల్ పూర్తి చేశాం. మూడో షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో బెంగళూరులో ప్రారంభం అవుతుంది. దాని కోసం మరో భారీ సెట్ వేశాం. ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు నాలుగు యాక్షన్ సీక్వెన్సులను తెరకెక్కిస్తాం'' అని చిత్ర బృందం తెలిపింది. దాంతో షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని వెల్లడించారు. ఫిబ్రవరి నెలాఖరుకు షూటింగ్ కంప్లీట్ అవుతుందన్నారు.
ఆడియో @ ఆనంద్
'ఘోస్ట్' ఆడియో & మ్యూజిక్ హక్కులను కన్నడనాట ప్రముఖ ఆడియో కంపెనీగా పేరు పొందిన ఆనంద్ ఆడియో సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేశారట. ఒక్క కన్నడ మాత్రమే కాదు... మిగతా భాషల ఆడియో హక్కులూ వారివే.
ఒక్కసారి గ్యాంగ్‌స్టర్ అయితే...
'వన్స్ ఎ గ్యాంగ్‌స్టర్... ఆల్వేస్ ఏ గ్యాంగ్‌స్టర్' - ఇదీ 'ఘోస్ట్' సినిమాకు ఇచ్చిన కొత్త కాప్షన్. 'ఒక్కసారి గ్యాంగ్‌స్టర్ అయితే... ఎప్పుడూ గ్యాంగ్‌స్టరే' అని అర్థం అన్నమాట. 'ఘోస్ట్'లో శివ రాజ్ కుమార్ గ్యాంగ్‌స్టర్ అని కన్ఫర్మ్ చేశారు. న్యూ ఇయర్ విషెస్ చెబుతూ విడుదల చేసిన వీడియోలో... గన్నులు, కారులు, హెలికాఫ్టర్, బ్లాస్టులు - భీభత్సమైన యాక్షన్ ఉందని హింట్ ఇచ్చారు. రెట్రో లుక్‌లో శివన్న స్టైల్ కూడా బావుంది.
Also Read : విలన్‌కు హీరోయిన్ ఛాన్స్ - బాలకృష్ణ ప్రామిస్
కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 'ఘోస్ట్' సినిమాను భారీ ఎత్తున విడుదల చేసే విధంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి కన్నడ హిట్ సినిమా 'బీర్బల్' ఫేమ్ శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ రాజకీయ నాయకులు సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మస్తీ, ప్రసన్న విఎం మాటలు రాస్తున్నారు. 'కెజియఫ్' ఫేమ్ శివ కుమార్ కళా దర్శకుడిగా పని చేస్తున్నారు. అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. మహేంద్ర సింహ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read : అక్కినేని హీరోతో పూజా హెగ్డే - ఇందులో నిజమెంత?
నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాలో శివ రాజ్ కుమార్ అతిథిగా కనిపించారు. శతకర్ణుడి కథను వివరించే పాత్రను ఆయన పోషించారు. రామ్ గోపాల్ వర్మ 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా చేశారు. ఆయన సినిమాలు కొన్ని తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. ఈ 'ఘోస్ట్' సినిమాతో ఆయన పాన్ ఇండియా మార్కెట్ మీద దృష్టి పెట్టారు. 'కెజియఫ్', 'కాంతార' విజయాలు, ఆ చిత్రాలకు ఇతర భాషల్లో వచ్చిన వసూళ్లు మిగతా కన్నడ హీరోలకు ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలతో పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు.