బాలీవుడ్ హీరోయిన్ శిల్పాషెట్టి  రాజ్ కుంద్రాతో విడిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తున్నారు. రాజ్ కుంద్రా జైల్లో ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో ఆమె తన సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. షూటింగ్‌లకు వెళ్తున్నారు. వైష్ణోదేవి ఆలయాన్ని కూడా సందర్శించారు. ఇక వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిమజ్జన వేడుకల కోసం నృత్యాలు కూడా చేశారు.  ఇప్పుడు కొత్తగా  ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్  ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లుగా ధృవీకరించేలా ఉంది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.


సుప్రసిద్ధ అమెరికా రచయిత కార్ల్ బ్రాడ్ రాసిన ఓ పుస్తకంలో ఓ కొటేషన్‌ను ప్రత్యేకంగాప్రస్తావించారు  "ఎవరూ వెనక్కి వెళ్లి సరికొత్త ప్రారంభాన్ని చేయలేరని.. కానీ  ఎవరైనా సరికొత్త ముగింపు ఇచ్చి ..కొత్తగా ప్రారంభించవచ్చని " పేర్కొన్నారు.  ఇది ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన పోస్ట్‌గానే భావిస్తున్నారు. పోర్న్ ఫిల్మ్స్ కేసులో రాజ్ కుంద్రా అరెస్టయి జైల్లో ఉన్నారు. ఆయనకు బెయిల్ కూడా దక్కడం లేదు. ఇటీవల ఆయనపై చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. అందులో శిల్పాషెట్టికి దాదాపుగా క్లీన్ చిట్ ఇచ్చారు పోలీసులు. రాజ్ కుంద్రా ఏం చేస్తున్నడో తనకు తెలియదని ఆమె చెప్పారు.


కొద్ది రోజులకిందట శిల్పా షెట్టి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కూడా ఇలాగే ఉన్నాయి. ఇక నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానన్నట్లుగా ఆమె పెట్టారు. రాజ్ కుంద్రా నుంచి విడిపోవాలని అమె అనుకుంటున్నట్లుగా ఇప్పటికే మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆమె కూడా ఖండించలేదు. గతంలో పెట్టిన పోస్ట్‌లో “తప్పులు అందరూ చేస్తారు కానీ ఆ తప్పులు భయంకరంగా, ఇతరులను బాధించేలా ఉండకూడదు.. తప్పు చేశాను కానీ వాటిని సరిదిద్దుకుంటాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ మాటలకు రాజ్ కుంద్రానే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 



" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">


 


శిల్పాషెట్టిఆమె భర్తకు విడాకులు ఇవ్వనుందని, ఈ కేసుకన్నా ముందునుంచే వారిద్దరి మధ్య వివాదాలు నడుస్తున్నాయని టాక్. దీంతో శిల్పా భర్తతో విడిపోవాలనుకుంటుందని, తన పిల్లలతో కలిసి వేరుగా ఉండేందుకు ఆమె ప్లాన్‌ చేసుకుంటున్నట్లు బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి రాజ్‌కుంద్రాతో ఇప్పటికే మానసికంగా విడిపోయినట్లుగా శిల్పాషెట్టి వ్యవహరిస్తున్నారు. రాజ్ బయటకు వచ్చిన తర్వాత అధికారికంగా విడాకులు తీసుకోవడం మాత్రమే మిగిలి ఉందని భావిస్తున్నారు.