మెగాహీరో వరుణ్ తేజ్ తన కెరీర్ లో మొదటి నుంచి కూడా వైవిధ్యమైన కథల్లో నటిస్తూ.. హిట్టు మీద హిట్టు కొడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆయనకి సరైన హిట్టు పడడం లేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'గని' సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఈ హీరో త్వరలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.
ఇదిలా ఉండగా.. ఈరోజు వరుణ్ తేజ్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ నెల 19న తన కొత్త సినిమా గురించి ప్రకటించబోతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని చిన్న టీజర్ ద్వారా వెల్లడించారు. ఇందులో దర్శకుడు, ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నారట. ఇదివరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన 'అంతరిక్షం' సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది.
అయినప్పటికీ.. అతడికి మరో ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు వరుణ్ తేజ్. ఈసారి కూడా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలోనే సినిమా చేయనున్నారు. ఈరోజు విడుదల చేసిన టీజర్ లో ఒక యుద్ధ విమానం బొమ్మను చూపించారు. దీన్ని బట్టి ఈ సినిమాలో హీరో ఫైటర్ జెట్ నడిపే పైలట్ అయి ఉంటాడని అంచనా వేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నారు.
మరో ప్లాప్ డైరెక్టర్ తో వరుణ్:
సుజీత్... 'రన్ రాజా రన్'తో సాలిడ్ హిట్ కొట్టిన దర్శకుడు. తొలి సినిమాతో మంచి విజయం అందుకున్న అతడికి, మలి సినిమాలో ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. 'సాహో ' తీశారు. ఆ తర్వాత మరో సినిమా ఓకే కావడానికి మూడేళ్ళు పట్టింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సుజీత్ సినిమా చేయనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పవన్ కల్యాణ్ హీరోగా ఒక రీమేక్ మీద సుజీత్ కొన్ని రోజులు స్క్రిప్ట్ వర్క్ చేశారు. అది ముందు సెట్స్ మీదకు వెళుతుందా? లేదంటే వరుణ్ తేజ్ సినిమా ముందు స్టార్ట్ అవుతుందా? అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది.
'సాహో' తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం యువ దర్శకుడు సుజీత్‌కు వచ్చింది. ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధమవుతోన్న 'గాడ్ ఫాదర్' స్క్రిప్ట్ మీద ఆయన కొన్ని రోజులు వర్క్ చేశారు. ఆ తర్వాత ఎందుకో సుజీత్ దర్శకత్వంలో సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. తర్వాత రామ్ చరణ్, సుజీత్ కలయికలో సినిమా అని వినిపించింది. హిందీలో షారుఖ్ ఖాన్ హీరోగా సినిమా అని వినిపించింది. అదీ ఓకే కాలేదు. పవన్ కళ్యాణ్ సినిమా వర్క్ జరుగుతోంది. అది ఓ వైపు ఉండగా.. వరుణ్ తేజ్ సినిమా ఓకే అయింది. మెగాస్టార్‌తో మిస్ అయినా మెగా క్యాంప్‌లో మరో హీరోతో సినిమా చేసే అవకాశం అందుకున్నారు సుజీత్.
Also Read: 'దెబ్బకు థింకింగ్ మారిపోవాలా' - మరోసారి హడావిడి చేయనున్న బాలయ్య!
Also Read: ప్రభాస్ అభిమానులకు నిరాశ తప్పదా?