స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తుంది. తన భర్తతో విడాకులు తీసుకోవడం, 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ ఇలా మీడియాలో హాట్ టాపిక్ అయింది ఈ బ్యూటీ. విడాకుల తరువాత ట్రిప్ లకు వెళ్లి కాస్త సమయం గడిపింది. ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ముంబైలోని బాంద్రా ఏరియాలో కనిపించింది. 


సెలూన్ షాప్ నుంచి బయటకొస్తూ.. కెమెరాలకు చిక్కింది సమంత. అయితే ఈ ఫొటోలలో సమంత ధరించిన టీషర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆమె వేసుకున్న టీషర్ట్ పై 'F**k you f**king f**k' అని రాసి ఉంది. ఆ లైన్స్ చూస్తుంటే సమంత ఎవరికో వార్నింగ్ ఇచ్చినట్లే అనిపిస్తుంది. అయితే ఇలాంటి ఒక టీషర్ట్ ను ధైర్యంగా బయటకు వేసుకురావడం కొందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసిన సమంత ప్రస్తుతం 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఆమె నర్స్ పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇదొక లేడీ ఓరియెంటెడ్ సినిమా. సమంతతో పాటు ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలో కనిపించనుంది. దీంతో పాటు ఓ బైలింగ్యువల్ సినిమా అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఒప్పుకుంది. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయబోతుందని సమాచారం.